లవ్ స్టోరీ సినిమాలోని “సారంగా దారియా” పాట ఎంతగా ఆకట్టుకుందో.. అంత వివాదాస్పదమైంది. ఈ పాట పల్లవి జానపద గీతాలనుంచి తీసుకున్నదన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పాట ఒరిజినల్ సాంగ్ ను కోమలి ఆలపించారు. అయితే.. ఈ సాంగ్ పల్లవిని అలానే ఉంచేసి.. మిగతా పాటంతా అశోక్ సుద్దాల సొంతం గా రాసారు. అయితే.. తాను ఒరిజినల్ సింగర్ ని అని.. ఈ పాటను తనచేతే పాడించి ఉంటె బాగుండేదని కోమలి ఆవేదన చెందారు.saranga dariya

దీనితో.. ఈ అంశం వివాదాస్పదమైంది. అయితే.. దర్శకుడు శేఖర్ కమ్ముల విషయం తెలుసుకుని.. కోమలి కి న్యాయం చేస్తామని ఈ వివాదాన్ని ముగించారు. గతం లో వచ్చిన జానపదాలను సినిమాలలో వాడుకోవడం ఎప్పటినుంచో వస్తున్నదే. అయితే.. సారంగదరియా పాట బాగా వివాదాస్పదమైంది. కానీ.. గతం లో అత్తారింటికి దారేది సినిమా లో కూడా ఓ పాటను ఇలాగే పాడు చేసారు.

saranga dariyaa 2

అత్తారింటికి దారేది సినిమా లో.. “బేట్రాయి స్వామి దేవుడా..” అనే పాట వస్తుంది కదా.. ఈ పాటను పవన్ కళ్యాణ్ గారే పాడారు. ఇందులో పాటను అలానే ఉంచేసి..బాగా పాడారు. కానీ.. ఈ పాటను వాడుకున్న తీరు పైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పాట వచ్చే సన్నివేశం లో అందరు స్టెప్పులేస్తూ.. ఏకం గా ఓ క్లబ్ డాన్స్ తరహా పాటను చేసేసారు. వాస్తవానికి ఇది ఓ జానపద భక్తుడు తాను నమ్మిన స్వామిని దశావతారాలను వర్ణిస్తూ పాడిన పాట. ఆ పాట లిరిక్స్ ను మీరు ఇక్కడ చూడవచ్చు..

“బేట్రాయి సామి దేవుడా – నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా
కాటేమి రాయుడా – కదిరినరసిమ్ముడా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా ||బేట్రాయి||

శాప కడుపు సేరి పుట్టగా – రాకాసిగాని
కోపామునేసి కొట్టగా
ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ ||బేట్రాయి||

తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ
దేవాసురులెల్లకూడగా
దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు
సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ ||బేట్రాయి||

అందగాదనవుదులేవయా – గోపాల గో
విందా రచ్చించా బేగరావయా
పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి
కిందు మిందు సేసినోద సందమామ నీవె కాద ||బేట్రాయి||

నారసిమ్మ నిన్నె నమ్మితి – నానాటికైన
కోరితి నీ పాదమే గతీ
ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి
కోర మీసవైరిగాని గుండె దొర్లసేసినోడ ||బేట్రాయి||

బుడత బాపనయ్యవైతివి ఆ సక్కురవరితి
నడిగి భూమి నేలుకుంటివే
నిడువు కాల్లోడివై అడుగు నెత్తిపైన బెట్టి
తడవు లేక లోకమెల్ల మెదిమతోటి తొక్కినోడ ||బేట్రాయి||

రెందుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల
సెండాడినావు పరసుతో
సెందకోల బట్టి కోదందరామసామికాడ
బెండు కోల సేసికొనే కొండకాడకేగినోడ ||బేట్రాయి||

రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి
శ్యామసుందర నిన్ను మెచ్చగా
సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి
ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ ||బేట్రాయి||

దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన
దేవుడై నిలిచినావురా
ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగుడుకొనీ
తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ ||బేట్రాయి||

ఏదాలు నమ్మరాదనీ ఆ శాస్త్రాలా
వాదాలూ బాగలేవనీ
బోధనలూ సేసికొనీ బుద్ధులూ సెప్పుకొనీ
నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద ||బేట్రాయి||

కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన
పలికినావు బాలసిసువుడా
చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర
పిల్లంగోవె సేతబట్టి పేట పేట తిరిగినోడ ||బేట్రాయి ||”

betrayi

ఈ పాటపై యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి.. ఈ వీడియోల్లో ఈ పాట రచయితా గా సముద్రాల రాఘవాచార్య పేరు కనిపిస్తోంది. ఈ పాటను ఓ మలయాళీ గాయకుడు పాడిన వీడియో సోషల్ మీడియాలలో వైరల్ అవుతోంది. ఈ పాట గురించి తెలియగానే.. ఇలాంటి పాటని “అత్తారింటికి దారేది” సినిమాలో అలాంటి సన్నివేశం కోసం ఎలా వాడారంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఈ పాటను మీరు కూడా ఇక్కడ వినొచ్చు.