“శాకుంతలం” సినిమాని ‘గుణశేఖర్’ ఎలా తీశారంటారు..?? ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫాన్స్..!!

“శాకుంతలం” సినిమాని ‘గుణశేఖర్’ ఎలా తీశారంటారు..?? ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫాన్స్..!!

by Anudeep

Ads

దర్శకుడు గుణశేఖర్ ది ఓ విభిన్న ఆలోచనా విధానం. నలుగురు నడిచిన బాట నడిచే దర్శకుడు కారు. తన ఆలోచన తనదే. కళ్ల ముందు విజువల్ వండర్ ను ఆవిష్కరించాలనుకుంటారు. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అవుతుంటుంది. అందుకే ఆయన పెద్ద స్టార్స్ తో సినిమాలు కూడా ఫ్లోప్స్ అయ్యాయి. తర్వాత చారిత్రక నేపథ్యం లో వచ్చిన రుద్రమదేవి చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాస్ అయ్యింది. అయితే ఆ చిత్రం తర్వాత మరో చిత్రం చెయ్యలేదు గుణశేఖర్.

Video Advertisement

 

 

అయితే చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తో ‘శాకుంతలం’ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పురాణాల ఆధారం గా రానుంది. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో డిఆర్‌పి-గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై గుణశేఖర్‌ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్‌ మోహన్‌ దుష్యంతుడుగా నటిస్తున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటిస్తోంది. ఈమె చిన్నప్పటి శకుంతల పాత్రలో నటించింది.

audience egarly waiting for sakunthalam movie..!!

ఈ చిత్రాన్ని పురాణాల నేపథ్యం లో తీయనున్నట్లు తెలిసిందే. అయితే ఇందులో కథని మార్చేందుకు వీలు లేదు. దుష్యంతుడు అనే రాజు..అడవికి వెళ్లాడు. అక్కడ శాకుంతలముల చేత పెంచబడిన శాకుంతలను చూసి మోహించాడు. గాంధర్వ వివాహం చేసుకుని, ఉంగరం చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఉంగరం కాస్తా పోయింది. మొహం గుర్తు లేదు ఉంగరం తప్ప. అంతే శకుంతలను నువ్వెవరో తెలియదన్నాడు. తరువాత మొత్తానికి కథ సుఖాంతమైంది. ఇదే కథని ప్రేక్షకులకు నచ్చేలా గుణశేఖర్ ఎలా తీస్తాడన్నదే ప్రశ్న.

audience egarly waiting for sakunthalam movie..!!

ఈ కథకు ఎమోషన్లు, రొమాన్స్ యాడ్ చేయగలరేమో కానీ పురాణ కథను పక్కదారి అయితే పట్టించలేరు. ఇక మిగిలినంతా విజువల్ గ్రాండియర్ మాత్రమే. కానీ ఒకటే సమస్య. బాహుబలి..ఆర్ఆర్ఆర్..అవతార్ వంటి చిత్రాలను చూసిన ప్రేక్షకులను మెప్పించడం కష్టమే. మనకు ఈ సినిమాలో తెలిసింది సమంత మాత్రమే. పాటలు ఇప్పటివరకు బయటకు రాలేదు కనుక వేచి చూడాలి. మొత్తం మీద గుణశేఖర్ ఈసారి ఏం చేస్తారో అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.


End of Article

You may also like