సోషల్ మీడియా లో కొన్ని రోజుల క్రితం ఫేమస్ అయిన పాట ‘ మాణికే మాగే హితే’. ఈ పాటను పాడింది శ్రీలంకలోని కొలొంబోకు చెందిన ఓ పాప్ సింగర్. ఆమె పేరు యొహాని డి సిల్వా. తన పాటలతో స్టార్ గుర్తింపు తెచ్చుకున్న యొహాని 2021 మే నెలలో మాణికే మాగే హితే పాటను ఆలపించి యూట్యూబ్ ఛానల్లో వదిలింది. ఈ పాట యూట్యూబ్లో 8 కోట్లకు పైగా వీక్షణలను సంపాదించుకుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం సింగర్ యొహాని డి సిల్వా ఒక తెలుగు సినిమాలో పాట పాడబోతుంది. వివరాల ప్రకారం..రవితేజ – త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో ‘ధమాకా’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను డిసెంబరు 23న విడుదల చేయాలని టీమ్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రచార పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో టీమ్ నుండి ఓ అప్డేట్ కూడా వచ్చింది. అదే ఈ సినిమాలో ఫేమస్ శ్రీలంక సింగర్ యోహాని ఓ పాట పాడిందట.
ఆ పాట గ్లింప్స్ కూడా త్వరలో వస్తాయట. ఇదే కాకుండా మరో యూట్యూబ్ హిట్ సాంగ్ ని కూడా రవి తేజ తన సినిమాలో వాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ‘ సింపురు జుట్టు దాన్ని.. సెవులెరుకన చుట్టదాన్ని’ అంటూ క్కడో ఉత్తరాంధ్రలో పుట్టిన ఈ పాటకి త్వరలో మాస మహారాజ స్టెప్పులు వేయనున్నారు.
రమణ అనే ఫోక్ సింగర్ ఈ పాట పాడగా.. ఇప్పుడది సెన్సేషనల్ సాంగ్గా మారింది. ఆ పాట బీట్ వస్తే చాలు కుర్రకారు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. మొన్నామధ్య ఈటీవీలో ఓ కార్యక్రమం ఈ పాట పాడిన రమణకు మంచి పేరొచ్చింది. అలాగే ఈ పాటకు డ్యాన్స్ చేసి ఝాన్సీకి కూడా మంచి ఆదరణ లభించింది.
ఇలాంటి అవకాశాలను చక్కగా ఒడిసిపట్టుకునే రవితేజ.. ఇప్పుడు ‘పల్సర్ బైక్..’ను తన సినిమాలో పెట్టేశాడట. ఈ పాట హక్కుల్ని కొని మరీ సినిమాలోకి తీసుకున్నాడట. త్వరలోనే దాని గ్లింప్స్ కూడా వస్తాయి అని చెబుతున్నారు.