Ads
సినిమాల్లో మాత్రమే కాదు బయట కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు బయట చేసే పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన కృషితో ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా పిల్లల ప్రాణాలు కాపాడాడు మహేష్ బాబు. తన వంతు సాయంగా అందరికీ తోచినంత వైద్యం అందిస్తున్నాడు ఈయన. తాజాగా మరో చిన్నారి ప్రాణం కూడా నిలబెట్టాడు సూపర్ స్టార్.
Video Advertisement
తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేర్చిన రోజే.. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఒక చిన్నారికి ఆపరేషన్ చేయించి ప్రాణాలు నిలబెట్టారు మహేష్. అమలాపురానికి చెందిన మోక్షిత్ సాయి అనే మూడేళ్ల బాబుకు గుండెల్లో రంద్రం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. చిన్నారికి పరిస్థితి విషమించడంతో విజయవాడ లోని ఆంధ్ర హాస్పిటల్స్ కి తీసుకొచ్చారు.
ఈ ఆపరేషన్ కి 4 లక్షలు ఖర్చవుతుందని గతం లో డాక్టర్స్ తెలుపగా.. మధ్యతరగతి కి చెందిన ఆ దంపతులు మహేష్ బాబు ఫౌండేషన్ సాయాన్ని కోరగా.. వారు ఈ ఆపరేషన్ జరిగేలా చేసారు. సరిగ్గా గంటల వ్యవధిలో కృష్ణ కన్నుమూయడం అదేరోజు మోక్షిత్ సాయి సర్జరీ చేసుకుని మళ్లీ బతికి రావడం గమనార్హం.
గుండె జబ్బుల వైద్యానికి పేరుగాంచిన విజయవాడ లోని ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతోనే ఇవన్నీ చేస్తున్నాడు మహేష్ బాబు. మొన్నటికి మొన్న తన సొంతూరు బుర్రిపాలెంలో కూడా కోవిడ్ సెకండ్ డోస్ వేయించాడు. అప్పుడు కూడా ఈ ఆంధ్రా హాస్పిటల్స్ సపోర్ట్‌తోనే చేసాడు. మహేష్ చేసే ప్రతీ కార్యక్రమంలోనూ ఆంధ్రా హాస్పిటల్స్ ఉన్నారు.
ఇంతటి బాధాకర సమయంలో కూడా మహేష్ చేసిన సాయం తెలుసుకున్న అభిమానులు మరియు నెటిజెన్లు.. ‘దైవం మానుషు రూపేణా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన కుటుంబం లోని వరుస మరణాలతో మహేష్ బాబు కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలని, ఆయన సాయాన్ని పొందిన వెయ్యికి పైగా చిన్నారుల కుటుంబాలు, ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.
watch video :
End of Article