నట శేఖర కృష్ణ..తెలుగు వెండి తెరకు సరికొత్త ఒరవడులుదిద్దుతూ.. ఆయన పరిచయం చేయని జోనర్ లేదు అంటే అతిశయోక్తి కాదు. సుమారు 50 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించారు. కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో చేయని ప్రయోగం లేదు. తాజాగా కృష్ణ గారు తీవ్ర అనారోగ్యం తో ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
అయితే సూపర్ స్టార్ తన సినీ జీవితం లో అనేక రికార్డు లను నెలకొల్పారు. తన సినీ జీవితం లో అనేక మంది హీరోయిన్లతో నటించిన కృష్ణ వారిలో చాలా మందికి లైఫ్ ఇచ్చారు. కృష్ణ మూడు వందలకుపైగా సినిమాల్లో హీరో నటిస్తే అందులో సుమారు 10-15 మంది హీరోయిన్లు ఎక్కువ సినిమాల్లో నటించారు.
#1 విజయ నిర్మల
సూపర్ స్టార్‌తో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్లలో తన రియల్ లైఫ్ పార్టనర్ విజయ నిర్మల 48 సినిమాలతో టాప్‌లో ఉన్నారు.
#2 జయప్రద
రీల్ లైఫ్ పార్టనర్‌గా జయప్రద 45 సినిమాలతో టాప్ 2 గా నిలిచారు. ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేయడమే కాదు ..వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ కావడం వల్లే కెమిస్ట్రీ రిపీట్ అవుతూ వచ్చింది.
మొదట్లో అంటే కలర్ సినిమాలు రాక ముందు కృష్ణతో విజయనిర్మల హిట్ పెయిర్ అయితే కలర్ సినిమాలు వచ్చిన తర్వాత సూపర్ స్టార్, జయప్రదే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే విధంగా జోడి కుదిరింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ మొదట్లో సక్సెస్ కాకపోయనప్పటికి ‘ఈనాటి బంధం ఏ నాటిదో’ అనే సినిమాతో కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.
#3 శ్రీదేవి
వీరిద్దరే కాకుండా శ్రీదేవి కూడా కృష్ణ తో 31 సినిమాలలో నటించింది.
#4 రాధ
మరో నటి రాధ కూడా ఆయనతో 19 సినిమాలలో జత కట్టింది.
#5 విజయశాంతి
కృష్ణ, విజయశాంతి కలిసి 12 సినిమాల్లో నటించారు.
#6 భానుప్రియ
కృష్ణ, భానుప్రియ కలిసి దాదాపు 8 సినిమాల్లో నటించారు.
#7 సౌందర్య
కృష్ణ, సౌందర్య కలిసి 8 సినిమాల్లో నటించారు.
#8 జయసుధ
కృష్ణ, జయసుధ కలిసి దాదాపు 15 సినిమాల్లో నటించారు.
ఈ సినిమాల్లో కృష్ణతో నటించిన హీరోయిన్లు అందరూ చాలా వరకు సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో నటిస్తే కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు.