2022 టీ20 కప్ గెలిచిన కెప్టెన్ “జోస్ బట్లర్” సక్సెస్ అవ్వడానికి కారణం అయిన… ఈ మహిళ ఎవరో తెలుసా..?

2022 టీ20 కప్ గెలిచిన కెప్టెన్ “జోస్ బట్లర్” సక్సెస్ అవ్వడానికి కారణం అయిన… ఈ మహిళ ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

ఇంగ్లండ్ మాజీ సారధి ఇయాన్ మోర్గాన్ సడెన్‌గా రిటైర్ అవడంతో వైట్ బాల్ క్రికెట్‌లో బట్లర్‌ను కెప్టెన్ చేశారు. సారధిగా భారత్‌తో ఆడిన సిరీస్‌లో బట్లర్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో అతన్ని చాలా మంది విమర్శించారు. కెప్టెన్‌గా పనికిరాడన్నారు. కానీ ఆ విమర్శకుల నోళ్లు మూయించేలా ప్రపంచకప్ ముద్దాడి చరిత్ర సృష్టించాడు బట్లర్.

Video Advertisement

ఫైనల్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేసిన ఆ జట్టు ఈ ఫార్మాట్‌లో రెండో ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంతో ఆ జట్టు మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఇక టీ20 స్పెషలిస్ట్‌ గా పేరొందిన ఈ ఇంగ్లండ్‌ ఆటగాడు గత ఐపీయల్ లో సూపర్ ఫామ్ తో ఆడాడు. సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతూనే ఉన్న అతడు లీగ్ లో 800 పరుగులను పూర్తి చేసుకున్నాడు.

wife of jos buttler..behind his success..

అంతే కాకుండా ప్రపంచకప్‌లో జట్టుకు కావలసిన ధనాధన్ ఓపెనింగ్ అందించిన జోడీల్లో ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ జోడీ టాప్‌లో ఉంటుంది. లాగే కెప్టెన్‌గా కూడా బట్లర్ మంచి పరిణితి చూపించాడు. టీం లో వికెట్ కీపింగ్ బాధ్యతలు బట్లర్‌ నిర్వహిస్తాడు.

wife of jos buttler..behind his success..

అయితే ఈ ప్రపంచ కప్ విజయం లో జోస్ బట్లర్ వెనుక ఒకరు ఉన్నారు. ఆమే అతడి భార్య లూయిస్. ‘ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది’.. ఇది రెగ్యులర్ గా అందరూ చెప్పే మాట. కానీ ఎప్పటికప్పుడు ఇది నిజమవుతూనే ఉంది. అంతెందుకు ఈసారి టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ జట్టు గెలవడంతో ఈ విషయం మరోసారి ప్రూవ్ అయింది.

wife of jos buttler..behind his success..

ఇంగ్లాండ్ క్రికెటర్ జాస్ బట్లర్. అద్భుతమైన బ్యాటర్ కమ్ వికెట్ కీపర్. అయిదేళ్ల క్రితం బట్లర్ పరిస్థితి పూర్తిగా వేరు. ఒకప్పుడు టీమ్ లో ఏడో, ఎనిమిదో ప్లేయర్ గా వచ్చి ఫామ్ లేక ఎన్నో తంటాలు పడ్డాడు. ఆ తర్వాత తనని తాను నిరూపించుకుని ఓపెనర్ అయ్యాడు. ఇప్పుడు కెప్టెన్ గా కూడా ఆకట్టుకున్నాడు. వీటన్నింటి వెనక బట్లర్ భార్య లూయిస్ ఉంది.

wife of jos buttler..behind his success..

లూయిస్.. బట్లర్ జీవితం లోకి అడుగుపెట్టిన తర్వాతే ఈ స్థాయికి చేరుకోగలిగాడు. 2017లో కెరీర్ పరంగా సతమతమవుతున్న స్టేజీలో లూయిస్ వెబర్, బట్లర్ జీవితంలోకి అడుగుపెట్టింది.దానితో పాటు ధైర్యం, నమ్మకం కూడా పెరిగింది. ఆటలో స్టెబిలిటీ పెంచుకున్నాడు. ఆమె నింపిన మనోస్థైర్యం వల్లే ఇప్పుడు బట్లర్ ఈ స్థాయికి చేరుకున్నాడని అతడి ఫ్రెండ్స్ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం బట్లర్-లూయిస్ దంపతులకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బట్లర్ ఫ్యామిలీ మొత్తం గ్రౌండ్ లో సందడి చేసింది.


End of Article

You may also like