ప్రేమకి వయసుతో సంబంధం లేదు అంటారు. సినిమా వాళ్లు కూడా ఇదే కాన్సెప్ట్ ఫాలో అయ్యారు. మామూలుగా సినిమాల్లో నటించే హీరోల వయసు హీరోయిన్ల వయసు కంటే ఎక్కువ ఉంటుంది. కొన్ని సార్లు తమకి రెట్టింపు ఏజ్ ఉన్న హీరోలతో నటిస్తారు హీరోయిన్లు.
కానీ కొన్ని సినిమాల్లో ఇది రివర్స్ అయ్యింది. అంటే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ హీరో కంటే వయసులో ముందు ఉండటం. అలా తమకంటే వయసులో పెద్ద అయిన హీరోయిన్లతో నటించిన హీరోలు, లేదా తమకంటే వయసులో చిన్న అయిన హీరోలతో నటించిన హీరోయిన్లు ఎవరో చూద్దాం..
#1 సమంత – విజయ్ దేవరకొండ
ఏజ్ గ్యాప్: 2 సంవత్సరాలు
సమంత, విజయ్ దేవరకొండ తో మహానటి చిత్రం లో నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం ‘ఖుషి’ రాబోతోంది.
#2 సమంత – బెల్లంకొండ సాయి శ్రీనివాస్
ఏజ్ గ్యాప్: 6 సంవత్సరాలు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి చిత్రం అల్లుడు శ్రీను లో సమంత హీరోయిన్ గా నటించారు.
#3 ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్
ఏజ్ గ్యాప్: 2 సంవత్సరాలు
నిజ జీవితం లో కూడా జంట అయిన వీరిద్దరూ గురు, రావణ్ చిత్రాల్లో కలిసి నటించారు.
#4 రాణి ముఖర్జీ – పృథ్వీరాజ్
ఏజ్ గ్యాప్: 5 సంవత్సరాలు
రాణి ముఖర్జీ, పృద్థ్వీరాజ్ కలిసి ‘అయ్యా’ చిత్రం లో నటించారు.
#5 అనుష్క – నవీన్ పోలిశెట్టి
ఏజ్ గ్యాప్: 8 సంవత్సరాలు
అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం లో నటిస్తున్నారు.
#6 పూజా హెగ్డే – బెల్లంకొండ సాయి శ్రీనివాస్
ఏజ్ గ్యాప్: 2 సంవత్సరాలు
పూజ హెగ్డే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం సినిమాలో నటించారు.
#7 ఇలియానా – రామ్
ఏజ్ గ్యాప్: 1 సంవత్సరం
18 ఏళ్లకే హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్.. దేవదాస్ చిత్రం లో తనకంటే ఏడాది పెద్దదైన ఇలియానా తో జత కట్టాడు.
#8 నిధి అగర్వాల్ – అఖిల్
ఏజ్ గ్యాప్: 1 ఏడాది
మిస్టర్ మజ్ను చిత్రం లో నిధి అగర్వాల్, అఖిల్ కలిసి నటించారు.
#9 మంచు లక్ష్మి – సందీప్ కిషన్
ఏజ్ గ్యాప్: 10 సంవత్సరాలు
లక్ష్మీ మంచు,సందీప్ కిషన్ తో కలిసి గుండెల్లో గోదారి సినిమాలో నటించారు.
#10 నమ్రత – మహేష్ బాబు
ఏజ్ గ్యాప్: 4 సంవత్సరాలు
నిజ జీవితం లో క్యూట్ కపుల్ గా పేరు గాంచిన వీరిద్దరూ వంశి మూవీ లో కలిసి నటించారు.
#11 పూజ హెగ్డే – అఖిల్
ఏజ్ గ్యాప్: 3 సంవత్సరాలు
పూజ హెగ్డే, అఖిల్ కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం లో నటించారు.
#12 కాజల్ – రామ్
ఏజ్ గ్యాప్: 2 సంవత్సరాలు
కాజల్, రామ్ కలిసి గణేష్ చిత్రం లో నటించారు.
#13 రకుల్ ప్రీత్ సింగ్ – బెల్లం కొండ శ్రీనివాస్
ఏజ్ గ్యాప్: 2 సంవత్సరాలు
రకుల్ ప్రీత్ సింగ్, బెల్లం కొండ శ్రీనివాస్ జయ జానకి నాయక చిత్రం లో కలిసి నటించారు.
#14 భూమిక – ఎన్టీఆర్
ఏజ్ గ్యాప్: 4 సంవత్సరాలు
భూమిక, ఎన్టీఆర్ తో సింహాద్రి, సాంబ సినిమాల్లో నటించారు.
#15 కాజల్ – బెల్లం కొండ శ్రీనివాస్
ఏజ్ గ్యాప్: 7 సంవత్సరాలు
కాజల్ అగర్వాల్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కవచం, సీత సినిమాల్లో నటించారు.