2021 లో సంవత్సరం ఆకాశం నీ హద్దురా సినిమాతో మన ముందుకు వచ్చిన సూర్య, గత సంవత్సరం జై భీమ్ సినిమాతో అలరించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. జై భీమ్ సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

Video Advertisement

ఈ సినిమాలో సూర్య లాయర్ చంద్రు అనే పాత్రను పోషించారు. సూర్యని చూసిన వారు అందరూ, సూర్య మంచి పవర్ ఫుల్ పాత్రలో నటించారు అని అనుకున్నారు. కానీ సూర్య పోషించిన లాయర్ చంద్రు నిజంగా ఉన్నారు.

jai bhim review

చంద్రు ముందు ఒక సామాజిక కార్యకర్త. ఆ తర్వాత లాయర్ వృత్తిని చేపట్టారు. మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా చంద్రు బాధ్యతలు నిర్వహించారు.  మానవ హక్కులకు సంబంధించిన 96,000 కేసులను చంద్రు పరిష్కరించారు. ఇందులో అందరికీ స్మశాన వాటికలు లభ్యం అవ్వాలి అనే కేసుపై కూడా చంద్రు తీర్పునిచ్చారు. లాయర్‌గా తన కెరీర్‌లో ఏ ఒక్క కేసుకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. చంద్రు మహిళల తరపున కూడా ఎన్నో కేసులకి పోరాడారు.

jai bhim real lawyer chandru

అందులో ఎక్కువ శాతం మహిళలు చిన్న పట్టణాలకి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి చెందినవారు. 2006 లో జులై 31వ తేదీన హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రు. తర్వాత 2009 లో నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మార్చి 2013 లో న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు చంద్రు.  జై భీమ్ సినిమా విడుదల క్రమంలో చంద్రు, ద న్యూస్ మినిట్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఇందులో చంద్రు మాట్లాడుతూ, “రాజకన్ను (తెలుగులో రాజన్న) కేసులో చాలా మలుపులు ఎదురయ్యాయని, వాటిని ఛేదించడం కోసం తాను చాలా పరిశోధన చేయాల్సి వచ్చింది” అని చెప్పారు.

jai bhim real lawyer chandru

రాజకన్ను కస్టడీ నుండి తప్పించుకున్నట్లు అందరు భావించేలా చేశారు అని, అతని కుటుంబానికి అతనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదని, దాంతో వాళ్లు చాలా ఆందోళన చెందారు అని అన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ, “సినిమాలో కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కూడా, చాలా వరకు ఉన్నది ఉన్నట్టుగానే తీశారు” అని చంద్రు అన్నారు. పోలీసులు కేవలం రాజకన్ను భార్యకి మాత్రమే కాదు, తనకి కూడా లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు అని, దాంతో వారిని తన కార్యాలయం నుండి తరిమికొట్టాల్సి వచ్చిందని చంద్రు అన్నారు.

watch video :