సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీకి కొదవేలేదు. అది బాలీవుడ్ , టాలీవుడ్, కోలీవుడ్ ఏ పరిశ్రమైన కానీ తమ తరవాత ఇండస్ట్రీలో రాణించాలని వారసులను దించేస్తుంటారు ప్రతి ఒక్కరు. కుటుంబీకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలు ఒకరి వెనుక ఒకరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఇక్కడ నిర్మాత కొడుకైన కావచ్చు లేదా టాప్ హీరో సోదరులైన కావచ్చు.
ఇలా చెప్పుకుంటూపోతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే సినిమాల్లో సినీ వారసులుగా అడుగుపెట్టి సరైన గుర్తింపు సంపాదించుకోలేక కనుమరుగైన నటులు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రస్తుతం వాళ్ళని చూసి మనం అస్సలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయి ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు.
సహజనటి జయసుధ కుమారుడు శ్రేయన్ బస్తీ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కానీ ఆ చిత్రం మంచి గుర్తింపు సాధించకపోవడంతో ఒక చిత్రంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
హీరో శ్రీకాంత్ సోదరుడు అనిల్ ప్రేమించేది ఎందుకమ్మ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో అనిల్ సరసన శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విజయం సాధించకపోవడంతో హీరోగా మళ్లీ అతనికి సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. ఇప్పుడు అతన్ని గాని మీరు చూస్తే అస్సలు గుర్తుపట్టరు అంతగా మారిపోయాడు అనిల్.
అలనాటి హీరో V. K నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ, అయినా ఇష్టం నువ్వంటే, రెండు జెళ్ళ సీత, నందిని నర్సింగ్ హోమ్ వంటి చిత్రాల్లో నటించిన మంచి సక్సెస్ ని అందుకోలేక సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఎన్ని అవకాశాల కోసం ట్రై చేసిన చాన్స్ రాకపోవడంతో సినీ ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు.