ఇతరులను మన దారిలోకి తెచ్చుకోడానికి చాణుక్యుడు చెప్పిన హిప్నోటిజం ట్రిక్స్ ఇవే.!

ఇతరులను మన దారిలోకి తెచ్చుకోడానికి చాణుక్యుడు చెప్పిన హిప్నోటిజం ట్రిక్స్ ఇవే.!

by Anudeep

Ads

మన చేతి ఐదువేళ్ళు ఒకలా లేనట్టే.. మన చుట్టూ ఉండే సమాజం లో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఉండరు. అయితే.. పరిస్థితులను బట్టి.. అవసరాలను బట్టి.. మన చుట్టూ ఉండేవారు కొన్ని సార్లు మన మాటలను విని అర్ధం చేసుకోవాలని.. ఆచరించాలని కోరుకుంటూ ఉంటాం.. అయితే.. ప్రతి వ్యక్తి తనదైన శైలిలో ఆలోచిస్తాడు కాబట్టి.. పక్కన వారి మాటలను వినాలని కోరుకోడు.. అయితే.. అవతలివారిని మీ మాటలు వినేలా ఎలా చేసుకోవాలో చాణుక్యుడు కొన్ని టిప్స్ చెప్పాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

chanukyudu 1

కొందరు మూర్ఖులు ఉంటారు. తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు వీరి వ్యవహార ధోరణి ఉంటుంది. ఇలాంటి వారిని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి.. వారు ఏది చేస్తే అది ఫాలో అవ్వాలి. అలా చేస్తూ ఉంటె.. కొంతకాలానికి వారే మీ కంట్రోల్ లోకి వచ్చేస్తారు.

అలాగే.. కొందరేమో కోపిష్టి స్వభావం కలిగి ఉంటారు. వారి పట్ల మర్యాద గా ప్రవర్తించాలి. ప్రశాంతం గా మాట్లాడాలి. ఎల్లపుడు వారి పట్ల కోపం గా ఉంటె.. వీరితో సఖ్యత కుదరడం కష్టం. అందుకే వారిపట్ల మర్యాదగా ప్రవర్తిస్తే.. వారు కొంత కూల్ అయ్యి మీతో ఫ్రెండ్లీ గా ఉంటారు.

chanukyudu 2

అవతలి వారు మీకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారు అయితే.. టాలెంట్ ఉన్న వారు అయితే.. వారి పట్ల మీరు నిజాయితీ గా ఉండడం ఉత్తమం. అప్పుడు వారికి మీ పట్ల ఆసక్తి కలిగి మీ దారిలోకి నడుస్తారు.

కొందరికి విపరీతమైన ఈగో ఉంటుంది. అలాంటి వారిని వారి అభిప్రాయాలను గౌరవిస్తూ.. మర్యాద ఇవ్వాలి. వారు ఆటోమేటిక్ గా మీ దారిలోకి వచ్చేస్తారు.

అత్యాశ, స్వార్ధం కలిగిన వారు:
వీరికి ఏదైనా లాభం వస్తుందంటే ఏ పని అయినా చేసేస్తారు. కొంత డబ్బు ఇవ్వజూపితే.. వీరే మీ దారిలోకి వచ్చేస్తారు.

chanukyudu 3

పిల్లలని డీల్ చేసే సమయం లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లితండ్రులు అయితే.. వీరిని ప్రేమతో లొంగదీసుకోవాలి. ఐదు సంవత్సరాల వయసు వచ్చేవరకు వీరిని గారాబం గా ప్రేమ గా పెంచాలి. పదేళ్ల లోపు పిల్లలపై అతిగా దురుసు గా ప్రవర్తించడం తగదు. 16 ఏళ్ళు దాటాక వారితో స్నేహం గా మెలగాలి.

ఎలాంటి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి అనే కాదు.. ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో కూడా చాణుక్యుడు చెప్పాడు. కష్ట కాలం వచ్చినపుడు ఓర్పు గా ఉండడం మాత్రమే చేయాలట. మీ ఓర్పే మీకు మంచి రోజుల్ని తీసుకొస్తుంది. అలాగే.. ఎవరితోనూ కఠినమైన మాట్లాడడం అన్నివేళలా మంచిది కాదట. ఓ వ్యక్తి సహజ స్వభావం తెలుసుకోవడానికి అతని మాటలు , ప్రవర్తనని కొలమానం గా తీసుకోవాలట.

ఇంకా కొన్ని విషయాలు..
మన నిత్యా జీవన విధానం లో పనికి వచ్చే విషయాలను చాణుక్యుడు చాలానే చెప్పాడు. అవేంటంటే:

  • మనకి మర్యాద దక్కని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదట. మనకు డబ్బులు రాని చోట, మనల్ని గౌరవించని వారి వద్ద అస్సలు ఉండకూడదు.
  • ధనవంతుల వద్ద ఉంటె ధనం, జ్ఞానవంతుల వద్ద ఉంటె జ్ఞానం లభిస్తాయట.
  • ఎవరినైనా పది మంది పొగుడుతూ ఉంటె మీరు కూడా పొగడాలట. అదే మీకు మీరే పొగుడుకోవడం మాత్రం తగదట.

chanukyudu 4

  • దురాశ, స్వార్ధం, అత్యాశ వంటి లక్షణాలు కలిగిన వారిని ఎప్పటికి మార్చలేము.
  • నదులు, వైద్యులు ఉన్న ప్రాంతాలకు సమీపం లోనే నివసించడం ఉత్తమం.
  • గొడవలు లేకుండా, ఆహరం, నీరు ఉన్న ప్రదేశాల్లో ధనం కూడా ఎక్కువ గా నిలుస్తుంది.
  • ఏది చేసినా, ఎంత సంపాదించినా మనకు ఉన్న దానిలో తృప్తి గా బతకడం వల్లనే శాంతి లభిస్తుంది.
  • ఎప్పుడు విజయం సాధించే వారిని ఆదర్శం గా తీసుకోవడం, వారి కధలను తెలుసుకోవడం వలన మనం కూడా విజయం వైపు నడుస్తాము.
  • జీవితం లో వచ్చే ఏ అవకాశాన్ని కాదు అని చెప్పకూడదట. ఏ అవకాశం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో చెప్పలేము కదా.

End of Article

You may also like