తమిళ నాటే కాదు తెలుగులోనూ విజయ్ సేతుపతికి ఒక క్రేజ్ ఉంది. ఆయన నటనకు, మ్యానారిజానికి, సింప్లిసిటీకి అభిమానులు పివచెక్కిపోతారు. అయితే తాజాగా విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమాలు కొన్ని ప్లాన్లు మారడంతో… సేతుపతి సరసన ఒక హీరోయిన్ ని యాడ్ చేసి మళ్లీ పునః చిత్రీకరించారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే నిజానికి విజయ్ సేతుపతి కేవలం హీరో పాత్రలే నటించాలనే పరిమితులు ఏమీ పెట్టుకోకుండా… విలన్ అయినా , సైడ్ క్యారెక్టర్ అయినా, గెస్ట్ రోల్ అయినా ఏదైనా సరే నటనకు ప్రాధాన్యమిస్తూ… అభిమానుల ప్రేమను పొందుతున్నారు.

ఇటు వరస సినిమాలు చేస్తూ, అటు ఓటీటీలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా విడుదలై-1 లో కమెడియన్ సూరీని పరిచయం చెయ్యడమే ప్రధాన అంశం అని చెప్పొచ్చు. ఇక సేతుపతి కేవలం రెండు, మూడు సీన్లకు మాత్రమే పరిమితం చేశారు. అయినప్పటికీ ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా పొందడంతో దీన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు.

అంతా సక్రమంగా నడుస్తుండటంతో… దాదాపు సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కానీ ఈ సమయంలోనే దర్శకుడు వెట్రిమారాన్ సినిమాలో పలు కీలక మార్పులు చేసి ప్లాన్ లు మార్చి చిత్రీకరణ మొదలు పెట్టారు. ఈ సీక్వెల్ లో సేతుపతి జోడీగా మలయాళ నటి మంజు వారియర్ ను నిశ్చయించుకోగా… వీరి సీన్స్ ను చిరుమలై ప్రాంతంలో తీస్తున్నారు. ఇక ఈ సినిమాను విడుదల చేసి తేదీని కూడా త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.
ALSO READ : అందరినీ హ్యాపీ చెయ్యడానికి నేను బిర్యానీ కాదు!! విశ్వక్ సేన్ కామెంట్స్..!







అలాంటి వాటిల్లో ఒక నమ్మకం.. మూడు రోటీలను ఒకే ప్లేట్లో కలిపి వడ్డించకూడదు. ఈ సంప్రదాయాన్ని చాలా మంది ఏళ్ల తరబడి పాటిస్తున్నారు. అయితే, దీని వెనుక కారణం చాలా మందికి తెలియదు. ఒక ప్లేట్లో 3 రొట్టెలను ఎప్పుడూ పెట్టవద్దు – జ్యోతిషశాస్త్రంలో మూడవ సంఖ్య మంచిది కాదు. మూడవ సంఖ్య ఆరాధన లేదా సాధారణ జీవితానికి దూరంగా ఉంచుతుందని నమ్ముతారు.



























