తెలుగు హీరోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత కేవలం మన సినిమాలే కాదు మన హీరోలు కూడా ఇమేజ్ పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్లకు యాడ్ రంగంలో కూడా తిరుగులేని ఇమేజ్ ఉంది. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మన హీరోలు యాడ్స్‌లో కుమ్మేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సౌత్‌లో మన హీరోలకు ఉన్నంత మార్కెట్ వేరే హీరోలకు కనిపించడం లేదు.
ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్, రానా, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలైతే ఎండోర్స్మెంట్ చేయడంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక తెలుగులో కాదు సౌత్ ఇండియాలోనే యాడ్స్‌కు పెట్టింది పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన చేసినన్ని యాడ్స్ ఏ స్టార్ హీరో చేయడేమో.. సబ్బు నుంచి ఇంటి వరకు అన్నీ చేస్తాడు ఈ హీరో. ఇప్పుడు కూడా మహేష్ బాబు చేతిలో దాదాపు అరడజన్ యాడ్స్ పైనే ఉన్నాయి. మహేష్ ఒక యాడ్ కి 12 కోట్ల వరకు తీసుకుంటారు.
అలాగే పుష్ప తర్వాత అల్లు అర్జున్ కూడా వరుస యాడ్స్ లో కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఒక బ్రాండ్ కి 2 నుంచి 7 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్రస్తుతం థమ్స్ అప్ కి విజయ్ దేవరకొండ, అలాగే ఫ్రూటీ కి రామ్ చరణ్ ప్రచారకర్తలు గా ఉన్నారు. అలాగే హీరోయిన్స్ లో సమంత యాడ్స్ లో దూసుకుపోతుంది. అలాగే సమంత ఇంస్టాగ్రామ్ ప్రమోషన్ పోస్ట్ లకి 20 లక్షలు తీసుకుంటుంది. విజయ్ దేవరకొండ థమ్స్ అప్ యాడ్ కోసం 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలాగే రామ్ చరణ్ ఒక యాడ్ కి 7 కోట్ల వరకు తీసుకుంటారట.
చాలా వరకు బ్రాండ్స్ కి అగ్రిమెంట్ ఒక ఏడాది వరకు ఉంటుంది. ఒక వేళ ఆ బ్రాండ్ వేల్యూ పెరిగితే ఇంకా అది పొడిగించే అవకాశం ఉంది. అలాగే యాడ్స్ కి షూటింగ్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది. రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే షూట్ చేస్తారు. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియా యాడ్స్ కూడా పెరుగుతున్నాయి. వీటిలో సమంత, అల్లు అర్జున్ ముందంజ లో ఉన్నారు.
హీరో లు చేసే బ్రాండ్స్ ని బట్టి వారు తీసుకొనే పారితోషికం ఉంటుంది. కొన్ని యాడ్స్ కేవలం తెలుగు రాష్ట్రాలకి, లేదంటే సౌత్ కి పరిమితం అవుతాయి.. మరి కొన్ని పాన్ ఇండియా రేంజ్ లో ఉంటాయి. వీటిని బట్టి వారు తీసుకొనే పారితోషికం నిర్ణయిస్తారు.
Also read: యూట్యూబ్ స్టార్స్ “షాపింగ్” నిజమేనా..?? అసలు కథ ఇదే..!!