సినీ పరిశ్రమలో కాంబినేషన్స్ అనేవి కీ రోల్ పోషిస్తాయి. హీరో.. హీరోయిన్, హీరో .. డైరెక్టర్స్ ఇలా..కొన్ని సక్సెఫుల్ కాంబినేషన్స్ తమ ముద్రని వేస్తాయి. అలాగే ఒక ఇద్దరు హీరోలు లేదా ఒక ఇద్దరు హేమాహేమీ నటులు ఒకే సినిమాలో నటించాలని కూడా అభిమానులు ఆకాంక్షిస్తారు.

Video Advertisement

 

 

అలాంటి సూపర్ కాంబినేషన్ ఒకటి మనం మిస్ అయిపోయాం. యంగ్ హీరో అడవి శేష్ ని హీరో గా ఒక మెట్టు పైకి ఎక్కించిన సినిమా ‘గూడాచారి’. ఈ చిత్రం ఎంత విజయం సాధించిందో మనం చూసాం. ఈ చిత్రం తర్వాతే అడవి శేష్ అంటే స్పై జానర్ సినిమాలకు పెట్టింది పేరు లాంటి వాడని అందరికీ అర్థం అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు మేకర్స్.

the movie which we missed in super star krishna and adivi sesh combination..!!

అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబందించి ఒక క్రేజీ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ చిత్రం లో ఒక పాత్ర కోసం స్పై జోనర్ తరహా చిత్రాలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారిని అడిగారట. దానికి ఆయన ఒప్పుకోలేదట. అప్పటికే సినిమాలకు దూరం గా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారట. కానీ గూఢచారి 2 మేకర్స్ పట్టు వదల కుండా ప్రయత్నించారట.

the movie which we missed in super star krishna and adivi sesh combination..!!

కేవలం రెండు రోజుల కాల్ షీట్స్ మాత్రమే అవసరం ఉంటుందని, కూర్చొని డైలాగ్స్ పలికే పాత్ర మాత్రమే.. ఎలాంటి ఒత్తిడి లేని పాత్ర అని కృష్ణ ని ఎంతో బ్రతిమిలాడితే ఓకే చెప్పారట. ఇంతలోపే ఆయన పెద్ద కొడుకు చనిపోవడం, భార్య ఇందిరా దేవి చనిపోవడం తో కృష్ణ గారి మానసిక స్థితి బాగా దెబ్బ తినింది. అయినా మాట ఇచ్చాను కాబట్టి కచ్చితంగా మీరు అడిగిన రెండు రోజుల కాల్ షీట్స్ ఇస్తానని మూవీ టీం కి చెప్పారట సూపర్ స్టార్.

the movie which we missed in super star krishna and adivi sesh combination..!!

కానీ ఈ లోపే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దాంతో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు చివరిసారిగా వెండితెర మీద తమ అభిమాన హీరో ని చూసుకునే అదృష్టాన్ని కోల్పోయారు. కృష్ణ మైథలాజికల్‌, డ్రామా, వెస్టర్న్‌, ఫాంటసీ, యాక్షన్‌, స్పై జోనర్‌తోపాటు చారిత్రాత్మక చిత్రాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన గూడఛారి 116, జేమ్స్‌ బాండ్‌ 777, ఏజెంట్ గోపీ, రహస్య గూడఛారి, గూడఛారి 117 వంటి స్పై చిత్రాల్లో నటించారు.

Also read: “చిరంజీవి – రాజమౌళి” కాంబినేషన్ తో పాటు… ప్రేక్షకులు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న 12 “హీరో – డైరెక్టర్” కాంబినేషన్స్..!