అందమైన జీవితానికి అనుమానపు మచ్చ.. దాని వల్ల వచ్చే నష్టాలకి చెక్ పెట్టండిలా..!

అందమైన జీవితానికి అనుమానపు మచ్చ.. దాని వల్ల వచ్చే నష్టాలకి చెక్ పెట్టండిలా..!

by Anudeep

Ads

మనకు ఏదైనా స్పష్టత లేనప్పుడు సందేహాలు రావడం సహజమే. కొన్ని అనుమానాలు కూడా మనకి మంచి చేస్తూ ఉంటాయి. అయితే అదేపనిగా ప్రతి చిన్న విషయానికి మీకు అనుమానం కలుగుతోంది అంటే అది ఆలోచించాల్సిన విషయమే. నిజానికి అనుమానం అనేది పెనుభూతం. ఒకసారి మనసులో అనుమానం అనే చీడ పురుగు పుట్టిందంటే అది మనసుని తొలిచేస్తుంటుంది.

Video Advertisement

తోటివారితో మనకి ఉండే సత్సంబంధాలను తునాతునకలు చేసేస్తుంటుంది. వీరు సంతోషంగా ఉండలేరు.. వీరి పక్కన వారిని సంతోషంగా ఉంచలేరు. నిజానికి ఇదేమి చిన్న విషయం కాదు. ఇదోరకమైన మానసిక జబ్బు. దీనినే డెల్యూషన్ డిజార్డర్ అని కూడా అంటుంటారు.

delusion 1

ఓ అంచనా ప్రకారం ప్రతి వంద మందిలో కనీసం ఒక్కరైనా అనుమాన రోగంతో సతమతమవుతూ ఉంటారట. తన చుట్టూ ఉన్న వారు తన ఓటమి కోరుతున్నట్లు, తమ జీవిత భాగస్వామి తమని మోసం చేస్తున్నట్లు, తమకేదో అన్యాయం జరిగినట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనుమానం ఏ రూపంలో అయినా ఎలా అయినా కలుగుతూ ఉండొచ్చు. ఇలా అనుమాన రోగం కలిగిన వారు తమని తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే తమంతట వారెవరూ లేరనుకుని విర్రవీగుతుంటారు.

delusion 2

వీరి లక్షణాలు ఎలా ఉంటాయంటే.. వీరికి ఊరకనే కోపం వచ్చేస్తుంది. ప్రతి చిన్న దానికి భయపడుతుంటారు. ఎవరో పిలుస్తున్నట్లు, ఏదో జరిగిపోతున్నట్లు ఊహించేసుకుంటూ ఉంటారు. విపరీతంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. వంశపారంపర్యంగా కూడా అనుమాన రోగం వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి మనుషులపై నమ్మకం పోతుంది. నిరాశగా ఉండిపోతుంటారు. స్నేహితులు, బంధువుల వలన మోసపోవడం వలన కూడా ఈ అనుమాన రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఏది కోరుకున్నా దక్కకపోవడం వలన వీరిలో క్రమంగా అనుమానం పెరుగుతుంటుంది.

delusion 3

దీనికి ప్రధాన పరిష్కారం ఏమిటంటే వైద్యులను సంప్రదించడం. వీరిని దండించడం, కోప్పడడం కాకుండా వారి దారిలోకి వెళ్లి స్నేహపూర్వకంగా నచ్చచెప్పడం వలన ఈ రోగం నుంచి బయటపడేయచ్చు. సైక్రియాట్రిస్టును సంప్రదించి మందులు వాడుతూ ఉండాలి. దాని వలన నయం కాకపోతే స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీని కూడా తీసుకోవాలి.


End of Article

You may also like