సినిమా ఇండస్ట్రీ లో టాలెంట్ కు కొదవ ఉండదు. చిన్న వయసు లో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్స్ నుంచి.. అందరు తమ తమ టాలెంట్ ను చూపించుకునే అవకాశం ఉంటుంది.
అయితే, చిన్న వయసులో కూడా అద్భుతం గా నటిస్తూ ఆల్రెడీ ఇండస్ట్రీ లో సెలెబ్రిటీలుగా ఉన్న పేరెంట్స్ కి కొందరు చైల్డ్ ఆర్టిస్ట్ లు గర్వ కారణం గా ఉంటారు. అలాంటి ఆర్టిస్ట్స్ లో “కీర్తన” ఒకరు.
తమిళ స్టార్ నటుడు మాధవన్ సినిమా “అమృత” లో నటించిన కీర్తన అనే ఈ చిన్నారి గుర్తుందా..? ఈ పాప ఎవరో కాదు.. తమిళ స్టార్ హీరో “ప్రతిభన్” కూతురు. ఈమె చిన్న వయసు లోనే “అమృత ” సినిమా లో నటించి టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. “అమృత” సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించాడు. తాజాగా కీర్తన మళ్ళీ సినీ ఇండస్ట్రీ కి రాబోతోంది. తానూ నటించిన సినిమా దర్శకుడు మణిరత్నం వద్దనే ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయనుంది.
మణిరత్నం కార్తీ, దుల్కర్ సల్మాన్ లతో సినిమా చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కి కీర్తన అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం కాబోతోంది. మణిరత్నం గురించి మనకు తెలిసినదే. ఎంతో లక్ ఉంటె తప్ప ఆయన దగ్గర పని చేసే అవకాశం రాదు. ఈ చిన్నది అలాంటి అవకాశాన్ని కొట్టేసింది. ప్రస్తుతం కీర్తన ఈ సినిమాలో నటుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తోంది.శృతి హాసన్, నయనతార లు ఈ సినిమాలో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.