ఒకప్పుడు రికార్డుల మీద రికార్డులు కొట్టిన వీరుడు… ఇప్పుడు డక్ అవుట్లు కొడుతున్నాడు..! ఏమైంది ఇతనికి..?

ఒకప్పుడు రికార్డుల మీద రికార్డులు కొట్టిన వీరుడు… ఇప్పుడు డక్ అవుట్లు కొడుతున్నాడు..! ఏమైంది ఇతనికి..?

by Anudeep

Ads

జాస్ బట్లర్.. ఈ ఇంగ్లండ్ టీం కెప్టెన్ టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ జట్టు గెలవడంలో కాలాక పాత్ర పోషించాడు. మంచి ఓపెనర్ గా పేరొందిన బట్లర్ ఇంగ్లాండ్ టీం లో వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తాడు. ఇక టీ20 స్పెషలిస్ట్‌ గా పేరొందిన ఈ ఇంగ్లండ్‌ ఆటగాడు గత ఐపీయల్ లో సూపర్ ఫామ్ తో ఆడాడు. సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతూనే ఉన్న అతడు లీగ్ లో 800 పరుగులను పూర్తి చేసుకున్నాడు.

Video Advertisement

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న బట్లర్ ఈ సీజన్ లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. రాజస్థాన్ జట్టులో బట్లర్ అత్యంత కీలకమైన ఆటగాడు. ఓపెనరుగా వచ్చి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఈ డాషింగ్ ఓపెనర్. బట్లర్ క్రీజులో ఉన్నాడంటే చాలు వీరబాదుడు బాదుతాడు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. కానీ ఈ సీజన్ లో కొత్త బట్లర్ కనిపిస్తున్నాడు.

jos buttler worst record in ipl 2023..!!

అయితే చెలరేగి ఆడడం.. లేకపోతే తుస్సుమన్నడం అన్నట్లు ఉంది బట్లర్ ఆట. గతంలో మాత్రం మ్యాచ్ పరిస్థితికి తగ్గట్టుగా తన శైలిని మార్చుకొని జట్టును ఆదుకునేవాడు. కానీ.. ఈ సీజన్ లో అనుకున్నంతగా రాణించలేదు. తాజా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో జాస్ బట్లర్ (0) మరోసారి డకౌట్ అయ్యాడు. ఈ సీజన్ లో జోస్ బట్లర్ కి ఇది ఐదో డకౌట్.

jos buttler worst record in ipl 2023..!!

దీంతో.. ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2020లో ధావన్, 2009లో గిబ్స్ ఓపెనర్లగా ఐపీఎల్ లో నాలుగు సార్లు డకౌట్ అవ్వగా.. పంజాబ్ తో మ్యాచ్ కు ముందు నాలుగు డకౌట్లతో వీరి సరసన ఉన్న బట్లర్.. ఈ మ్యాచ్ లో కూడా డకౌట్ కావడంతో తన పేరుతో సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.

jos buttler worst record in ipl 2023..!!

ఈ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన బట్లర్ 28 యావరేజ్ తో 392 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇలా ఓకే సీజన్ లో నాలుగు హాఫ్ సెంచరీలు.. ఐదు డకౌట్లు ఉండడంపై ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. గత సీజన్ లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న బట్లర్ ఎందుకు ఈ సీజన్ లో ఇలా విఫలం అవుతున్నాడు అంటూ చర్చించుకుంటున్నారు ఫాన్స్.


End of Article

You may also like