Anudeep
Anudeep
Maintaining Teluguadda website since 2017 and have 7 years of experience in managing various million fan based Facebook pages.
కెజిఎఫ్ చరిత్ర ఏంటో తెలుసా..? ఆ గనుల్లో బంగారాన్ని మనం ఎందుకు తవ్వుకోలేకపోతున్నాం?
అసలు కెజిఎఫ్ అంటే ఏంటో తెలుసా..? కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. అసలు కెజిఎఫ్ అనగానే మనకి సినిమా పేరు గుర్తొచ్చేస్తుంది. కానీ భారత్ లో ఉన్న ఈ గనుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ప్రాంతం లో పందొమ్మిదవ శతాబ్దం లోనే బంగారం కోసం తవ్వకాలు జరిగేవి అని ఇప్పటి ప్రజలకు తెలియదు. గతం లో ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) భారత్ కి ఎంతో ముఖ్యమైన బంగారు గని గా పేరు ప్రతిష్టలు సంపాదించింది. కానీ, ఆ పేరు ప్రతిష్టలు ఎంతో కాలం నిలవలేదు. ప్రభుత్వం వాటిని మూసివేయించింది. ప్రస్తుతం ఈ గనుల్లో ఎలాంటి బంగారం తవ్వకాలు జరగడం లేదు. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీవీ కధనం ప్రకారం …భారతీయులకంటే ముందే బ్రిటిష్ వారు గుర్తించారు. అప్పటి మహారాజు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి పోరాడారు. ఆ సమయం లోనే ఆంగ్లో-మైసూరు యుద్ధాలు చోటు చేసుకున్నాయి. 1767 – 69 వ సంవత్సరాలలో ఈ యుద్ధాలు జరిగాయి. ఇలా వరుస గా మూడు సార్లు ఆంగ్లో మైసూరు యుద్ధాలు చోటు చేసుకున్నాయి.

1780 – 84 లో రెండో ఆంగ్లో మైసూరు యుద్ధం, 1790 – 92 లో మూడవ మైసూరు యుద్ధం జరిగింది. 1799 లో జరిగిన నాలుగవ మైసూరు యుద్ధం లో టిప్పు సుల్తాన్ మరణించారు. కాలక్రమం లో అక్కడ సామంత రాజులను పెట్టి పరిపాలన కొనసాగించారు. ఆ తరువాత 1802 వ సంవత్సరం లో బ్రిటిష్ వారు మైసూర్ ను పూర్తిగా అధీనం లో తీసుకున్నారు.

ఆ తరువాత .. 1804 వ సంవత్సరం లో ఈస్ట్ ఇండియా కి చెందిన మైకేల్ అనే వ్యక్తి ఓ ఆర్టికల్ లో ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి, అందులో ఉన్న బంగారు గనుల గురించి తెలుసుకున్నాడు. సమయం చూసుకుని, 1871 సంవత్సరం లో బెంగళూరు కు షిఫ్ట్ అయ్యాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆ ప్రాంతం లో తవ్వకాలు జరిపాడు. అభివృద్ధి పేరిట అక్కడ ఉన్న బంగారాన్ని తవ్వుకుపోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎత్తుగడ వేసింది.

1900వ సంవత్సరంలో మైసూరు మహారాజు కు బ్రిటిష్ ప్రభుత్వం ఓ ప్రతిపాదన పంపింది. కోలార్ ప్రాంతం లో కావేరి నదిపై జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపింది. వెంటనే ఈ ప్రతిపాదనకు మైసూర్ మహారాజు కూడా అంగీకారం తెలిపారు.

ఈ కోలార్ గనుల్లో 56 కేజీల మట్టిలో గ్రాము బంగారం లభించేది. ఈ ప్రాంతం లో గోల్డ్ గురించి బ్రిటిష్ ప్రభుత్వం సర్వ్ చేసింది. 1850 వ సంవత్సరం లో లావెల్లి అనే వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయం లో నే కోలార్ గురించి ఆసక్తికర విషయాలను ఓ ఆర్టికల్ లో చదవడం ద్వారా తెలుసుకున్నారు. రెండేళ్ల పాటు కోలార్ లో పర్యటించారు. అక్కడ అద్భుతమైన బంగారు గని ఉందని తెలుసుకుని.. ఆ బంగారాన్ని వెలికితీయాలని భావించాడు. తన ప్రయత్నాలను కొనసాగించాడు. ఈ గనులు తవ్వడానికి 1875 వ సంవత్సరం లో కోలార్ గనులను లావెల్లి కి 20 ఏళ్ల పాటు లీజుకిచ్చారు.

కానీ, ఈ గనులు తవ్వడానికి చాలా ఖర్చు అయ్యేది.. బంగారం మాత్రం దక్కలేదు. దీనితో ఈ బంగారాన్ని వెలికి తీయడానికి తన వద్ద అంత డబ్బు లేకపోవడం తో తనకు ఉన్న హక్కులను అమ్మేసుకున్నాడు. ఆ తరువాత చాలా మంది గనుల తవ్వకానికి ప్రయత్నించినా.. ఎవరు నిలవలేదు. మధ్యలోనే వెళ్ళిపోయేవారు. 1880 లో టేలర్ అండ్ సన్స్ కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. కెజిఎఫ్ పనులను ముమ్మరం చేసింది. అప్పటి వరకు కెజిఎఫ్ నష్టాల్లోనే ఉంది. ఈ కంపెనీ ఇంగ్లాండ్ నుంచి ఎన్నో మెషీన్లను తెప్పించి సాంకేతికం గా అభివృద్ధి చేసింది. ఈ తవ్వకాలు మొదలవడం తో టేలర్ అండ్ సన్స్ కంపెనీ లాభాల బాట పట్టింది.

kgf1-Kgf2-Meme-Templates
ఇక్కడ పని చేయడానికి ఎంతో మంది ఇంజినీర్లు బ్రిటిష్ నుంచి వచ్చారు. 1900 నుంచి 1910 మధ్య ప్రాంతం లో ఈ గనులకు గోల్డెన్ టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలం లో ఒక లక్ష డెబ్భై వేల టన్నుల గోల్డ్ ను వెలికితీశారు. చాలా లోతు వరకు తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ గనిని ప్రపంచం లోనే లోతైన గని గా పేర్కొన్నారు. అయితే, కిరోసిన్ దీపాలతోనే ఈ తవ్వకాలు జరిగేవి. ఇబ్బందులు ఎదురు కావడం తో ఇక్కడా కూడా పవర్ ప్లాంట్ ను సృష్టించాలని భావించారు. అప్పటికే ఇంగ్లాండ్ లో పవర్ ని సృష్టిస్తున్నారు. ఇక్కడ కూడా పవర్ ను సృష్టించాలన్న ఉద్దేశం తో కావేరి నదిపై పనులను మొదలు పెట్టారు.

kgf1-Kgf2-Meme-Templates
ఆ ప్రాంతం లో విద్యుత్ ఏర్పాటు చేసారు. కోలార్ ప్రాంతం లో మొత్తం 148 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయించింది. ఆ రోజుల్లోనే కోలార్ విద్యుత్ లైన్ అత్యంత పొడవైన విద్యుత్ లైను గా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఆ పవర్ ప్లాంట్ దేశంలోనే మొదటి పవర్ ప్లాంట్ గా నిలిచింది. విద్యుత్ పనులు ప్రారంభం కాగానే, ఆ ప్రాంతం లో బంగారాన్ని దోచుకెళ్లే పని ని కూడా మొదలు పెట్టేసారు. ఆ ప్రాంతం లో ఎక్కువ మంది బ్రిటిష్ వారే ఉండేవారు. అక్కడే బంగ్లాను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతమంతా ఒక మినీ ఇంగ్లాండ్ గా మారిపోయింది. వారికింద పని చేసే భారతీయులు మాత్రం షెడ్లు ఏర్పాటు చేసుకుని ఉండేవారు.

అక్కడ కూలీల బతుకులు మాత్రం దుర్భరం గా ఉండేవి. ఒక దశలో బంగారాన్ని దోచుకుంటున్నారని కెజిఎఫ్ కోర్టుకెళ్లింది. దీనితో, అదనపు రాయల్టీని ఇవ్వడానికి ఇంగ్లాండ్ ఒప్పుకుంది. అలా, ఒప్పందం తో ఇంగ్లాండ్ భారత్ నుంచి నేరు గా బంగారాన్ని ఎగుమతి చేసుకుంది. స్వాతంత్య్రం వచ్చాక, 1956 లో ఈ గనులు జాతీయ గనులు గా పేరుపొంది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చాయి. అప్పుడు కూడా ఈ గనుల్లో తవ్వకాలు జరిగేవి. 2001 వ సంవత్సరం వరకు ఈ తవ్వకాలను కొనసాగించారు. భారత్ లో ఉత్పత్తి అయ్యే బంగారం లో 95 శాతం బంగారం ఈ ప్రాంతం నుంచే వచ్చేది.

వరల్డ్ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవద్దని అప్పటి ప్రధాని నెహ్రు కెజిఎఫ్ గనులను తాకట్టు పెట్టారు. ఆ తరువాత 1980 లలోనే కెజిఎఫ్ పతనం మొదలైనట్లు చెబుతారు. 2001 నాటికి మూడు కిలోమీటర్ల మేర సొరంగాలు ఏర్పడ్డాయి. మట్టి లో గోల్డ్ లెవెల్ మాత్రం గణనీయం గా పడిపోయింది. 95 పర్సెంట్ నుంచి 0 పర్సెంట్ కి పడిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి తవ్వకాలు జరగడం లేదు. ఇప్పటికైనా వాటిని తిరిగి తెరిచి తవ్వాలని కొందరు భావిస్తున్నారు. కానీ, ఆ ప్రాంతం లో ఉన్న బంగారం నిల్వల విలువ కంటే.. వాటిని బయటకు తీయడానికి అయ్యే ఖర్చే ఎక్కువ. అందుకే ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది.
గంటల తరబడి పని చేయడం కామనే.. కానీ కిడ్నీలు పాడయ్యేది అందుకే.. ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..?
ప్రస్తుతం మారుతున్న సమాజం లో చాలా మంది కంప్యూటర్లపైనే పని చేస్తున్నారు. దీనివలన శారీరక శ్రమ చాలా తగ్గిపోతోంది. ఎక్కువ భాగం కూర్చునే పని చేయాల్సి ఉంటోంది. దీనివలన మూత్ర పిండాలపై ఒత్తిడి పడుతుందని మీకు తెలుసా..? మూత్రపిండాలు మన శరీరం లో కీలకమైన అవయవాలు. ఇవి మన శరీరం లోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తూ మన శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచుతాయి. కానీ శారీరక శ్రమ తగ్గడం వలన.. మన కిడ్నీలకు కలిగే ఇబ్బందులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విసర్జన వ్యవస్థలో ముఖ్య భాగాలైన మూత్రపిండాలు (కిడ్నీలు) రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తాయి. రక్తం లోని అవాంఛిత కణాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి. రక్తాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా మలినాలను వేరు పరిచి మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపించేస్తాయి. మూత్రపిండాల ద్వారా శుభ్రపడిన రక్తం తిరిగి శరీరం లో అన్ని ఇతర అవయవాలకు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే, ఈ మూత్రపిండాలను మనం ఎల్లప్పుడూ ఆరోగ్యం గా ఉంచుకోవాలి. అందుకోసం తగినంత గా నీరుని తాగుతూ ఉండాలి. తగినంత నీరు అందుబాటులో ఉంటేనే, మూత్రపిండాలు ఈ వ్యర్ధాలను నీటితో బయటకు పంపగలవు.

మీరు తగినంత గా మంచినీటిని తాగకపోతే, ఈ వ్యర్ధాలు పూర్తి స్థాయిలో బయటకు పోవు. తద్వారా, ఈ వ్యర్ధాలన్నీ కిడ్నీలలోనే పేరుకుపోయి రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ రాళ్లు మూత్ర కోశం వద్ద పేరుకుపోతాయి. మీకు మూత్ర విసర్జన చేస్తున్నపుడు ఎప్పుడైనా విపరీతమైన మంట గా అనిపించిందా..? దానికి కారణమేమిటంటే.. ఆ స్థానం లో ఈ రాళ్లు అడ్డుపడడం వలన ఇలా జరుగుతుంటుంది. వంశపారంపర్యం గా గాని, డీ హైడ్రేషన్ వలన కానీ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

మూత్ర విసర్జన చేస్తున్న సమయం లో మీకు తరచుగా మంట గా అనిపిస్తూ ఉంటె, మీరు తక్షణమే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఒకవేళ కిడ్నీలలో రాళ్లు ఏర్పడి ఉంటె.. వాటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. రాళ్లు చిన్న చిన్న పరిణామాలలో ఉన్నపుడు సహజం గా మూత్రం ద్వారా బయటకు పంపేయవచ్చు. కానీ, రాళ్లు పెద్ద సైజు లో ఉంటె మాత్రం శస్త్ర చికిత్స తప్పనిసరి అవుతుంది. ఈ చికిత్స తరువాత ఆరోగ్యపరం గా ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే, క్రమం తప్పకుండ వ్యాయాయం చేయడం, ఎక్కువ మంచి నీటిని తీసుకోవడం ద్వారా ఈ ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.
కస్టమర్ పై పిచ్చి పిచ్చి గా అరిచేసిన డెలివరీ బాయ్..కానీ అందరు మంచి పని చేసావ్ అంటున్నారు..కారణమేమిటంటే..?
మనకి ఊరికే ఏదైనా తినాలనిపిస్తే ఏమి చేస్తాం.. బయటకెళ్లడానికి కూడా బద్దకిస్తే ఏదైనా ఆర్డర్ చేసేసుకుంటాం. నిమిషాల్లో మన ముందుకొచ్చి డెలివరీ బాయ్ లు ఫుడ్ అందిస్తూ ఉంటారు. వారి జీవితంలో ఏమి కష్టాలుంటాయో.. అవి అన్ని అధిగమిస్తూ అవసరం కోసం వారు కష్టపడుతూ ఉంటారు. వారి కష్టాన్ని గుర్తిస్తూ కంపెనీ చిన్న రైజ్ ఇచ్చినా.. లేదా ఎవరైనా కస్టమర్ టిప్ ఇచ్చినా ఆరోజు వారికి ఎంతో సంతృప్తి గా గడుస్తుంది.

డెలివరీ బాయ్స్ ని ఉత్తేజపరచడం కోసం చాలా మంది టిప్ లు ఇస్తూ ఉంటారు. అయితే, కొందరు మాత్రం కంపెనీ వాళ్ళకి జీతం ఇస్తుంది కదా.. మళ్ళి ఈ టిప్ లు ఎందుకు అని భావిస్తూ ఉంటారు. చాలా మంది డెలివరీ బాయ్స్ కరోనా గడ్డు కాలం లో కూడా ఎంతో కష్ట పడి పని చేసారు. కొందరైతే రోజుకు 12 నుంచి 15 గంటలు కూడా పని చేసిన వారు ఉన్నారు. వారికి జీతాలు తక్కువే ఉంటాయి. కాబట్టి, వారికి టిప్ ఇవ్వడం వలన ఉత్తేజపరిచినట్లు ఉంటుంది. ఈ క్రమం లో ఓ ఘటన చోటు చేసుకుంది.

డెలివరీ బాయ్స్ అంటే ఎండకి, వర్షానికి లెక్క చేయకుండా తిరగాల్సి ఉంటుంది. ఇటీవల డామినోస్ కి చెందిన ఓ డెలివరీ బాయ్ వర్షం వస్తున్నా కూడా లెక్క చేయకుండా ఓ కస్టమర్ కి పిజ్జా డెలివరీ చేసాడు. అతడిని టిప్ కోరగా, సదరు కస్టమర్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీనితో ఆ డెలివరీ బాయ్ కి కోపం వచ్చి ఆ కస్టమర్ పైనా, సదరు మానేజ్మెంట్ పైనా పిచ్చి కోపం గా అరిచేసాడు. ఇదంతా సీసీ టీవీ లో రికార్డు అయింది.ఈ వీడియో టిక్ టాక్ లో అప్ లోడ్ అయింది.

కెమెరా వెనక నుంచి ఓ వ్యక్తి.. కామ్ డౌన్ ప్లీజ్.. ఇంకా చాల డెలివరీలు ఉన్నాయి అని చెప్పడం వినిపిస్తోంది. అయితే, సదరు డెలివరీ బాయ్ మాత్రం ఆగ్రహం లోనే నో… నేను ఇంకా ఇక్కడ పని చేయను.. వర్షం లో అంత సేపు నుంచున్నా కనీసం టిప్ ఇవ్వలేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసాడు. అంతే కాదు పక్కన ఉన్న పిజ్జా బాక్స్ లను కూడా నేలకేసి కొట్టాడు. ఈ వీడియో నెట్టింట్లో పెట్టడం తో వైరల్ అయింది. పలువురు నెటిజన్లు సదరు డెలివరీ బాయ్ పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
watch video:
ఆమె చేతి వంట తింటే మరణమే…చివరికి ఆమెను అడ్డుకునేందుకు పోలీసులు ఏం చేసారంటే?
మన ప్రపంచంలో ఎన్నెన్ని మిస్టీరియస్ కథలున్నాయసలు.. ఎంత పెద్ద మిస్టరీని అయినా సైన్స్ చేధించగలదు. కాని సైన్స్ కూడా అందని విషయాలు, సైన్స్ కూడా ఛేధించలేని ఎన్నో దృష్టాంతాలను మనం చూసాం . వాటిల్లో ఒక్కటి టైఫాయిడ్ మేరీ కథ. పేరు చదవగానే మీకు కొంత కథ మైండ్లోకి వచ్చేసుంటుంది. కాని అసలు కథ చదివితే ఔరా అని ఆశ్చర్యపోక మానరు.
మనకు వచ్చే ఎన్నో రకాల వ్యాధుల్లో చాలా వరకు వైరస్ లు, బ్యాక్టీరియాల నుండి వ్యాప్తి చెందినవే. వైరస్, బ్యాక్టిరియాలు అనేవి మన కంటికి కనపించనంతటి పరిణామాల్లో ఉంటాయి. కాని ఒక మనిషి రూపంలో ఎందరికో టైఫాయిడ్ వ్యాప్తి చెందిందంటే నమ్ముతారా? నమ్మి తీరాలి.. ఆ వ్యక్తి పేరు టైఫాయిడ్ మేరి అసలు పేరు మేరీ మల్లాన్. టైఫాయిడ్ వ్యాధి ఎప్పటి నుంచో ఉనికిలో ఉండేది. 1900 సంవత్సరంలో పరిశోధకులు ఈ వ్యాధి వ్యాప్తికి గల కారణాలను కనుగొన్నారు. టైఫాయిడ్ బ్యాక్టీరీయా మలం లేదా అపరిశుభ్రత వల్ల వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్నారు.

కానీ ఒక వ్యక్తి వలన కూడా టైఫాయిడ్ బ్యాక్టిరియా వ్యాప్తి చెందుతుందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. బ్యాక్టిరియాను వ్యాప్తి చేసిన తొలి వ్యక్తిగా మేరీ పేరు నిలిచిపోతుంది. 1869, సెప్టెంబర్ 23న ఉత్తర ఐర్లాండ్‌లోని కూక్స్‌టౌన్ అనే ఊరిలో జన్మించిన మేరి వాళ్లది సాధారణ కుటుంబం . అందరమ్మాయిల్లానే పెరిగింది. వంట చేయడం ఇష్టం కావడంతో అదే వృత్తిగా ఎంచుకుంది. ఇళ్లల్లో వంటలు చేసి పెట్టేది.ఎక్కడ పనికి కుదిరినా కొద్ది రోజుల్లో మానేసేది దానికి కారణం అక్కడి వారు అనారోగ్యంతో బాధపడడమే. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆమె ఎప్పుడూ టైఫాయిడ్ కి గురి కాలేదు.
టైఫాయిడ్ వచ్చిన రోగి నుండి ఇతరులకు ఆ వ్యాధి వ్యాపిస్తుంది, కాని అదేంటో మేరీ మాత్రం ఏ ఒక్క రోజు కూడా టైఫాయిడ్ తో బాధపడలేదు. కాని ఆమె వల్ల ఇతరులకు మాత్రం వ్యాపించేది. అసలు తన వల్లే అదంతా జరుగుతోందని ఆమెకి కూడా తెలియదు.ఎలా తెలుస్తోంది తనెప్పుడైనా అనారోగ్యంతో మంచం పడితే కదా.. తనే కారణమేమో అనుకోవడానికి.అయితే ఒక రోజు అసలు విషయం బయటపడింది. ఎలా అంటే? 1906లో ఛార్లెస్ హెన్ని వారెన్ అనే వ్యక్తి ఇంట్లో పది మంది కుటుంబ సభ్యుల్లో ఒకే సారి ఆరుగురు టైపాయిడ్ బారిన పడ్డారు. తమ చుట్టుపక్కల ఎవరికి ఆ వ్యాదిలేదు, తమ ఇంట్లో అందరూ శుభ్రంగానే ఉంటారు. మరి ఎలా ఇంతమందికి టైఫాయిడ్ వచ్చింది అనే సందేహం వచ్చింది. అదే విషయాన్ని తన స్నేహితుడు జార్జ్ సాపర్ కి చెప్పాడు . ఆ ఇంట్లోకి బయటి నుండి వచ్చే వ్యక్తులు ఎవరా అని ఆలోచిస్తే కేవలం అక్కడ వంట చేసే మేరి మాత్రమే.. కాని తను ఇప్పుడు పనిమానేసింది.

తన గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసాడు. ఎక్కడ వాకబు చేసినా తెలిసిన విషయం ఒక్కటే తను ఎక్కడా కూడా ఎక్కువ రోజులు పనిచేయదు. అంతేకాదు తను పని చేసిన చొటల్లా వ్యక్తులు టైపాయిడ్ భారిన పడ్డారు.అంతే అనుమానం బలపడింది. నేరుగా పోలీసులకు విషయం తెలియచేశాడు . పోలీసులు ఎంక్వైరీ చేసి చివరికి మేరిని పట్టుకుని అరెస్ట్ చేశారు.మరోవైపు ఒక మనిషి వలన టైఫాయిడ్ వస్తుందనే వార్తా అంతటా మారుమోగిపోయింది.

పోలీసులు వైరస్ ఇతరులకు సోకకూడదనే ఉద్దేశ్యంతో మేరిని న్యూయార్క్ సముద్ర తీరం శివురలో నార్త్ బ్రదర్ దీవిలో బందించారు. 1910లో డాక్టర్ రిపోర్ట్ వచ్చింది.. అందులో ఉన్న సారాంశం ఏంటంటే మేరిలో ఎలాంటి బ్యాక్టిరియా లేదు అని.దాంతో ఆ రిపోర్ట్ ఆధారంగా మేరి న్యూయార్క్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్‌కు కూడా ఫిర్యాదు చేసింది. మేరీ వాదనలో నిజం ఉందని గ్రహించి, తాను మరెక్కడా వంట చేయకూడదనే షరతు మీద విడుదల చేసింది కోర్టు.

కోర్టు నిర్ణయం ప్రకారం మేరీ వంట పని మానేసి ఒక లాండ్రీలో పనికి కుదిరింది. కాని అక్కడ వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో పేరు మార్చుకుని ఒక హాస్పిటల్లో వంట మనిషిగా చేరింది. అక్కడ మేరి వంట తిన్న వారిలో 22 మంది డాక్టర్లు , నర్సులు టైఫాయిడ్ బారిన పడ్డారు, ఇద్దరు చనిపోయారు. దాంతో మళ్లీ మేరిని మనుషుల్లేని దీవిలో బంధించారు పోలీసులు..ఇది జరిగింది 1915లో..మేరి మారు పేరు స్లోనే..

ఆ దీవికి అధికారులు నిత్యావసర వస్తువులు పంపేవారు, అలా ముఫ్పై ఏళ్లు ఆ దీవిలోనే జీవించింది. చనిపోవడానికి ఆరేళ్ల ముందు పక్షవాతానికి గురైన మేరీ నవంబరు 1938, నవంబరు 11న 69 ఏళ్ల వయస్సులో న్యుమోనియాతో చనిపోయింది . అసలు టైఫాయిడ్ కి గురికాకుండా అంతమందికి ఎలా అంటించింది అనేది ఇప్పటికి సమాధానం దొరకని ప్రశ్నే.. చేతులు కడుక్కోకుండా వంట చేసేది అనేది చాలామంది వాదన, ఆ వాదన ఎంత వరకు నిజమో మనకి తెలీదు..మనకే కాదు ప్రపంచానికే తెలీని మిస్టరీ టైఫాయిడ్ మేరీ..
ఈ ఫోటో చూడగానే ఎన్నో అభిప్రాయాలు వచ్చి ఉంటాయ్..అసలు కథ తెలిస్తే కన్నీళ్లొస్తాయ్..!
ఈ సమాజం లో మహిళలకు ఎక్కువ కష్టాలున్నాయన్న సంగతి కొంతమేర ఒప్పుకోవాల్సిన విషయమే. ఈ సమాజం పెట్టిన కట్టుబాట్లు కావచ్చు, సంప్రదాయాల పేరిట వారిపై రుద్దబడుతున్న నియమాలు కావచ్చు.. ఇవన్నీ మహిళలు ఓర్చుకుని తమ జీవిత లక్ష్యాలను సాధించుకోవాలి. ఉదాహరణకి ఈ కింద ఇవ్వబడిన ఫోటో ను నిశితం గా గమనించండి.

image credits: twitter/unwomen_pak
మొదట చూడగానే, మీకేమనిపిస్తుంది. పెళ్లి కూతురు లా ఉన్న ఓ అమ్మాయి కన్నీళ్లు పెడుతోంది. ఈ ఫోటో చూడగానే మీ మనసులో రకరకాల భావాలు కలుగుతూ ఉండవచ్చు. అయితే, ఆ తరువాత ఫోటోలను వరుస గా చూస్తూ వెళితే మీకు ఓ విషయం బోధ పడుతుంది.

image credits: twitter/unwomen_pak
పై ఫోటో చూడగానే, ఆమె ఏదో బరువుని లాగుతున్నట్లు కనిపిస్తోంది కదా. సరిగ్గా గమనిస్తే.. ఎద్దుల బండి లాంటి బండి పైన కొన్ని బరువైన వస్తువులు ఉన్నాయి. వాటిని పెళ్లి కూతురు వస్త్రాలలో ఉన్న ఆమె బలవంతం గా లాగుతూ ముందుకు వెళుతోంది.. ఇంకొక ఫోటో ను చూడండి..

image credits: twitter/unwomen_pak
ఆ బండి పైన పెళ్లి కొడుకు కూడా నుంచుని ఉన్నాడు. బహుశా ఆమె భర్త అయి ఉంటాడు. ఆమె అంత బరువుని మోస్తుంటే.. అతను ఆమె పై మరింత భారం మోపుతున్నాడు.

image credits: twitter/unwomen_pak
చివరిగా, ఈ ఫోటో ను చూసాక.. ఇంకా నేను ఏమి చెప్పక్కర్లేదు అనుకుంట. కట్నం పేరిట పెళ్లి కూతురుపై చాలా భారం పడుతుంది. ఈ ఫోటోలు స్క్రోల్ చేస్తున్న కొద్దీ మనలో భావోద్వేగం పెరుగుతుంటుంది. ఇండియన్ సొసైటీ లో కట్నం అనేది ఓ సంప్రదాయం అయిపొయింది. ఒక రకం గా చెప్పాలంటే ఈ సమాజం సంప్రదాయం పేరిట.. ఆడ పెళ్లి వారి కుటుంబం పై మోతబరువును వేస్తోంది. మరో మాట గా చెప్పాలంటే, ఆడ పిల్లల తల్లి తండ్రులు ఓ అబ్బాయి కి తమ కూతురిని ఇవ్వడమే కాకుండా, తమ జీవిత సంపాదనను కూడా ధారపోస్తున్నారు. దీనిని మీరు అంగీకరిస్తారా..?
“బేబమ్మ” చిన్నప్పటి నుంచే ఫామ్ లో ఉంది.. మీరు ఎపుడైనా గమనించారా..? ఈ యాడ్స్ పై ఓ లుక్ వేయండి..!
“ఉప్పెన” సినిమా తో కృతి శెట్టి కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. “నీలి కళ్ళు నీలి సముద్రం” పాట రిలీజ్ అయినప్పటి నుంచి కృతి శెట్టి రాత్రికి రాత్రి స్టార్ డమ్ సంపాదించేసుకుంది. అమాయకం గా కనిపించే ముఖం, అభినయం, ఆమె ఎక్స్ప్రెషన్స్ అన్ని కుర్రకారుని కట్టి పడేశాయి. అయితే మనలో చాలా మంది కృతి శెట్టి కెమెరా ముందుకు రావడం ఇదే మొదటి సారి అని అనుకుంటున్నాం కదా.. కానీ, కాదు. కృతి శెట్టి చిన్నప్పుడే అడ్వర్టైజ్మెంట్ షూట్స్ లో పాల్గొంది.

నమ్మాలనిపించడం లేదా..? అయితే ఈ ఆర్టికల్ పూర్తి గా చదివి, కింద ఇచ్చిన యాడ్స్ వీడియో లు చూడండి. చిన్నతనం లోనే డైరీ మిల్క్, లైఫ్ బాయ్ సోప్, అలానే ఓ క్లోతింగ్ వస్త్రాలకు సంబంధించిన యాడ్ లో కూడా కృతిశెట్టి నటించింది. ఓ పెన్నుల వాణిజ్య ప్రకటన లో కూడా కృతి నటించింది. అలానే, హృతిక్ రోషన్ తో కూడా ఈ ముద్దుగుమ్మ చిన్నతనం లోనే తెరను పంచుకుంది. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రధారి గా నటించిన సినిమా “సూపర్ 30 ” ఈ సినిమా లో కూడా కృతి శెట్టి ఓ సన్నివేశం లో నటించింది.

హీరోయిన్ గా “ఉప్పెన” సినిమా ఆమెకు తొలి సినిమా నే అయినా, ఏ మాత్రం బెదురు లేకుండా అభినయాన్ని పలికిస్తూ అద్భుతం గా నటించింది. అందుకే ఈ సినిమా ఆమెకు అంత పేరు తెచ్చిపెట్టింది. ఉప్పెన మంచి హిట్ అవ్వడం తో, కృతి పాప అభిమానులు ఆమె బ్యాక్ గ్రౌండ్ ను తవ్వేస్తున్నారు. ఈ క్రమం లోనే, గతం లో కృతి శెట్టి నటించిన అడ్వర్టైజ్మెంట్ లు బయటపడ్డాయి. ఆమె అభిమానులు ఈ వీడియో లను వైరల్ చేస్తూ మురిసిపోతున్నారు. మీరు కూడా ఓ లుక్ వేయండి మరి.
#1.
#2.
#3.
Bigg Boss Malayalam Vote Season 3 Online Voting | Bigg Boss 3 Malayalam Voting Poll Results:
Bigg Boss Malayalam Vote Season 3 Online Voting | Bigg Boss 3 Malayalam Voting Poll Results: Bigg Boss Season 3 premiered on 14 February 2021 on the Asianet channel with Mohanlal as a host. Bigg Boss Malayalam is the Malayalam language version of the Indian reality TV program Bigg Boss. On Bigg Boss Malayalam 3, as many as 14 contestants entered the house on the launch day. Adhering to all the COVID-19 safety regulations.
Bigg Boss Malayalam 3 Contestants: Here is the full and final list of contestants who entered the show
Bigg Boss Malayalam season 3 contestants are Noby Marcose (Comedian), Firoz Azeez (Radio jockey), Sandhya Manoj (Dancer), Dimpal Bhal (Psychiatrist), Manikuttan (Actor), Majiziya Bhanu (Powerlifting and arm wrestling), Adoney John (Public speaker), Anoop Krishnan (TV artist), Lekshmi Jayan (Singer), Ramzan Muhammed (Dancer), Rithu Manthra (Model, singer), Sai Vishnu (Model), Soorya Menon (Actress), Bhagyalakshmi (Dubbing artist).
Bigg Boss Malayalam 3 Start Date / Timing
| Show name | Bigg Boss Malayalam Season 3 (2021) |
| Channel | Disney + Hotstar and Asianet |
| Produced By | Endemol Shine India |
| Start date | 14th February 2021 |
| Telecast Time | Mon-Sun at 9:30 PM |
| Host | Mohanlal |
| Days | 100 |
| Set | EVP Film City, Chennai |
Bigg Boss Malayalam 3 Contestants:
Noby Marcose (Comedian)
Firoz Azeez (Radio jockey),
Sandhya Manoj (Dancer),
Dimpal Bhal (Psychiatrist),
Manikuttan (Actor),
Majiziya Bhanu (Powerlifting and arm wrestling),
Adoney John (Public speaker),
Anoop Krishnan (TV artist),
Lekshmi Jayan (Singer),
Ramzan Muhammed (Dancer),
Rithu Manthra (Model, singer),
Sai Vishnu (Model),
Soorya Menon (Actress),
Bhagyalakshmi (Dubbing artist).
Bigg Boss Malayalam Vote Season 3 Online Voting
HOTSTAR :
- Open HOTSTAR APP
- Search for “Bigg Boss Malayalam”
- Click on episodes, find out the latest episode
- Under the episode, you can see the VOTE button. Click on it.
- Nominates contestant’s images will be displayed, clicking on them casts the vote.
- 10 votes are allowed per day/per login ID
NOTE: You must log in to Hotstar using your Mail ID/ Phone no to cast vote.
MISSED CALL :
- Each nominated contestant will be given a unique phone number.
- Giving a Missed call to that number, your vote will be casted
- Numbers will Be updated soon here below
Note: This is not official votes but the numbers generally imply the fan base of the contestant
లావు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్న సెలెబ్రిటీలు వీరే..!
సినిమా రంగుల ప్రపంచం లో నిలదొక్కుకోవడానికి చాలా మంది కలలు కంటారు. అయితే.. ఈ రంగం లో నిలదొక్కుకోవడానికి ప్రధానం గా కావాల్సింది అందం..ఆ తరువాత ప్రతిభ. అందుకే నటులు, ముఖ్యం గా హీరోయిన్లు అందం గా కనిపించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

సినిమా రంగం లో మిగిలిన పనుల్లో ఉండేవాళ్ళు ఎలా ఉన్నా, నటులు గా ప్రూవ్ చేసుకోవాలనుకునే వారు మాత్రం కచ్చితం గా అందం పై శ్రద్ద చూపిస్తారు. కొన్ని సార్లు ఈ అతి శ్రద్ధ అనేది ఇక్కట్లు తెచ్చిపెడుతుంది. కొందరు హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ లు, పెదాలను, ముక్కుని సరిచేయించుకోవడం వంటివి చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే, కొందరు బరువుని తగ్గడం కోసం కూడా లైపో సెక్షన్ వంటివి చేయించుకుంటున్నారు. ఈ సర్జరీ కొన్ని సార్లు సక్సెస్ అయినప్పటికీ, చాలా సార్లు వికటించడం వలన ప్రాణాలు కోల్పోతుంటారు. అలా, లైపోసక్షన్ సర్జరీ చేయించుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్న సెలెబ్రిటీల లిస్ట్ ను ఓ సారి చూద్దాం.
1. ఆర్తి అగర్వాల్:

ఆర్తి అగర్వాల్ ఎంత అందం గా ఉంటారో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. అందం తో పాటు అభినయం, నటన ఆమె సొంతం. అందుకే చిన్న వయసు లోనే ఆమె దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. చిన్న వయసుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే, ఆమె ప్రేమ జీవితం కారణం గా కెరీర్ నిలిచిపోయింది. అయితే, డిప్రెషన్ కి లోనైన ఆర్తి చాలా బరువు పెరిగిపోయింది. కొన్ని ఏళ్ల తరువాత తిరిగి ఆ స్టార్ డమ్ ను సొంతం చేసుకోవాలని భావించింది. అందుకోసం లైపో సక్షన్ సర్జరీ చేయించుకోవాలనుకుంది. ఆమె కు తెలిసిన వ్యక్తిగత డాక్టర్ కూడా వద్దని వారించినప్పటికీ ఆమె వినలేదు. ఆర్తి తాను పుట్టిన పెరిగిన అమెరికా లోనే లైపో సక్షన్ చేయించుకుంది. దురదృష్టవశాత్తు అది వికటించడం తో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
2. మిస్తీ ముఖర్జీ:

బాలీవుడ్ నటి మిస్తీ ముఖర్జీ ఇందుకు మరో ఉదాహరణ. బెంగాలీ సినిమాలలో బాగా పాపులర్ అయినా మిస్తీ ముఖర్జీ పలు హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పు పొందారు. అయితే, ఏమి తిన్నా లావు అయిపోయే శరీర తత్త్వం కారణం గా ఆమె బరువు పెరిగిపోయారు. దానివలన ఆమె కు అవకాశాలు సన్నగిల్లాయి. అయితే ఎలా అయినా సన్నబడాలన్న కోరికతో, తిరిగి అవకాశాలను సంపాదించుకోవాలన్న జిజ్ఞాసతో ఆమె కీతో డైట్ ను ఫాలో అయ్యారు. డాక్టర్ వారించినప్పటికీ.. ఆమె అతిగా ఆ డైట్ ను ఫాలో అయ్యారు. దీనితో ఆమె చాలా సన్నగా అయిపోయారు. ఆమె ఆరోగ్యం చెడిపోవడం మాత్రమే కాకుండా కిడ్నీలు కూడా పాడైపోయాయి. ఎంత ఖర్చు చేసినప్పటికీ ఆమె తిరిగి తన ఆరోగ్యాన్ని పొందలేకపోయింది. కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే ఆమె తన ప్రాణాలను పోగొట్టుకుంది.
3. రాకేష్ దివానా:
సీరియల్స్ నటుడి గా రాకేష్ దివానా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో కూడా కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రాకేష్ కి మంచి పేరు ఉంది. ఈయన బరువు దగ్గడం కోసం బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ జీర్ణాశయానికి చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ సర్జరీ సక్సెస్ అయింది. కానీ, ఆ తరువాత బీపీ లెవెల్స్ లో చాలా మార్పులు వచ్చాయి. వీటిని కంట్రోల్ చేయడం వైద్యుల వల్ల కాలేదు. దీనితో ఈయన కూడా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బరువు తగ్గడం కోసం సర్జరీ లు చేయించుకోవడం అంత శ్రేయస్కరం. ఎక్కడో కొందరికి ఇవి ఉపయోగపడుతుంటాయి. డైటింగ్ , వ్యాయాయం ద్వారా బరువు తగ్గడమే ఉత్తమం.
















