Anudeep
Anudeep
Maintaining Teluguadda website since 2017 and have 7 years of experience in managing various million fan based Facebook pages.
“బేబమ్మ” చిన్నప్పటి నుంచే ఫామ్ లో ఉంది.. మీరు ఎపుడైనా గమనించారా..? ఈ యాడ్స్ పై ఓ లుక్ వేయండి..!
“ఉప్పెన” సినిమా తో కృతి శెట్టి కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. “నీలి కళ్ళు నీలి సముద్రం” పాట రిలీజ్ అయినప్పటి నుంచి కృతి శెట్టి రాత్రికి రాత్రి స్టార్ డమ్ సంపాదించేసుకుంది. అమాయకం గా కనిపించే ముఖం, అభినయం, ఆమె ఎక్స్ప్రెషన్స్ అన్ని కుర్రకారుని కట్టి పడేశాయి. అయితే మనలో చాలా మంది కృతి శెట్టి కెమెరా ముందుకు రావడం ఇదే మొదటి సారి అని అనుకుంటున్నాం కదా.. కానీ, కాదు. కృతి శెట్టి చిన్నప్పుడే అడ్వర్టైజ్మెంట్ షూట్స్ లో పాల్గొంది.

నమ్మాలనిపించడం లేదా..? అయితే ఈ ఆర్టికల్ పూర్తి గా చదివి, కింద ఇచ్చిన యాడ్స్ వీడియో లు చూడండి. చిన్నతనం లోనే డైరీ మిల్క్, లైఫ్ బాయ్ సోప్, అలానే ఓ క్లోతింగ్ వస్త్రాలకు సంబంధించిన యాడ్ లో కూడా కృతిశెట్టి నటించింది. ఓ పెన్నుల వాణిజ్య ప్రకటన లో కూడా కృతి నటించింది. అలానే, హృతిక్ రోషన్ తో కూడా ఈ ముద్దుగుమ్మ చిన్నతనం లోనే తెరను పంచుకుంది. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రధారి గా నటించిన సినిమా “సూపర్ 30 ” ఈ సినిమా లో కూడా కృతి శెట్టి ఓ సన్నివేశం లో నటించింది.

హీరోయిన్ గా “ఉప్పెన” సినిమా ఆమెకు తొలి సినిమా నే అయినా, ఏ మాత్రం బెదురు లేకుండా అభినయాన్ని పలికిస్తూ అద్భుతం గా నటించింది. అందుకే ఈ సినిమా ఆమెకు అంత పేరు తెచ్చిపెట్టింది. ఉప్పెన మంచి హిట్ అవ్వడం తో, కృతి పాప అభిమానులు ఆమె బ్యాక్ గ్రౌండ్ ను తవ్వేస్తున్నారు. ఈ క్రమం లోనే, గతం లో కృతి శెట్టి నటించిన అడ్వర్టైజ్మెంట్ లు బయటపడ్డాయి. ఆమె అభిమానులు ఈ వీడియో లను వైరల్ చేస్తూ మురిసిపోతున్నారు. మీరు కూడా ఓ లుక్ వేయండి మరి.
#1.
#2.
#3.
Bigg Boss Malayalam Vote Season 3 Online Voting | Bigg Boss 3 Malayalam Voting Poll Results:
Bigg Boss Malayalam Vote Season 3 Online Voting | Bigg Boss 3 Malayalam Voting Poll Results: Bigg Boss Season 3 premiered on 14 February 2021 on the Asianet channel with Mohanlal as a host. Bigg Boss Malayalam is the Malayalam language version of the Indian reality TV program Bigg Boss. On Bigg Boss Malayalam 3, as many as 14 contestants entered the house on the launch day. Adhering to all the COVID-19 safety regulations.
Bigg Boss Malayalam 3 Contestants: Here is the full and final list of contestants who entered the show
Bigg Boss Malayalam season 3 contestants are Noby Marcose (Comedian), Firoz Azeez (Radio jockey), Sandhya Manoj (Dancer), Dimpal Bhal (Psychiatrist), Manikuttan (Actor), Majiziya Bhanu (Powerlifting and arm wrestling), Adoney John (Public speaker), Anoop Krishnan (TV artist), Lekshmi Jayan (Singer), Ramzan Muhammed (Dancer), Rithu Manthra (Model, singer), Sai Vishnu (Model), Soorya Menon (Actress), Bhagyalakshmi (Dubbing artist).
Bigg Boss Malayalam 3 Start Date / Timing
| Show name | Bigg Boss Malayalam Season 3 (2021) |
| Channel | Disney + Hotstar and Asianet |
| Produced By | Endemol Shine India |
| Start date | 14th February 2021 |
| Telecast Time | Mon-Sun at 9:30 PM |
| Host | Mohanlal |
| Days | 100 |
| Set | EVP Film City, Chennai |
Bigg Boss Malayalam 3 Contestants:
Noby Marcose (Comedian)
Firoz Azeez (Radio jockey),
Sandhya Manoj (Dancer),
Dimpal Bhal (Psychiatrist),
Manikuttan (Actor),
Majiziya Bhanu (Powerlifting and arm wrestling),
Adoney John (Public speaker),
Anoop Krishnan (TV artist),
Lekshmi Jayan (Singer),
Ramzan Muhammed (Dancer),
Rithu Manthra (Model, singer),
Sai Vishnu (Model),
Soorya Menon (Actress),
Bhagyalakshmi (Dubbing artist).
Bigg Boss Malayalam Vote Season 3 Online Voting
HOTSTAR :
- Open HOTSTAR APP
- Search for “Bigg Boss Malayalam”
- Click on episodes, find out the latest episode
- Under the episode, you can see the VOTE button. Click on it.
- Nominates contestant’s images will be displayed, clicking on them casts the vote.
- 10 votes are allowed per day/per login ID
NOTE: You must log in to Hotstar using your Mail ID/ Phone no to cast vote.
MISSED CALL :
- Each nominated contestant will be given a unique phone number.
- Giving a Missed call to that number, your vote will be casted
- Numbers will Be updated soon here below
Note: This is not official votes but the numbers generally imply the fan base of the contestant
లావు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్న సెలెబ్రిటీలు వీరే..!
సినిమా రంగుల ప్రపంచం లో నిలదొక్కుకోవడానికి చాలా మంది కలలు కంటారు. అయితే.. ఈ రంగం లో నిలదొక్కుకోవడానికి ప్రధానం గా కావాల్సింది అందం..ఆ తరువాత ప్రతిభ. అందుకే నటులు, ముఖ్యం గా హీరోయిన్లు అందం గా కనిపించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

సినిమా రంగం లో మిగిలిన పనుల్లో ఉండేవాళ్ళు ఎలా ఉన్నా, నటులు గా ప్రూవ్ చేసుకోవాలనుకునే వారు మాత్రం కచ్చితం గా అందం పై శ్రద్ద చూపిస్తారు. కొన్ని సార్లు ఈ అతి శ్రద్ధ అనేది ఇక్కట్లు తెచ్చిపెడుతుంది. కొందరు హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ లు, పెదాలను, ముక్కుని సరిచేయించుకోవడం వంటివి చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే, కొందరు బరువుని తగ్గడం కోసం కూడా లైపో సెక్షన్ వంటివి చేయించుకుంటున్నారు. ఈ సర్జరీ కొన్ని సార్లు సక్సెస్ అయినప్పటికీ, చాలా సార్లు వికటించడం వలన ప్రాణాలు కోల్పోతుంటారు. అలా, లైపోసక్షన్ సర్జరీ చేయించుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్న సెలెబ్రిటీల లిస్ట్ ను ఓ సారి చూద్దాం.
1. ఆర్తి అగర్వాల్:

ఆర్తి అగర్వాల్ ఎంత అందం గా ఉంటారో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. అందం తో పాటు అభినయం, నటన ఆమె సొంతం. అందుకే చిన్న వయసు లోనే ఆమె దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. చిన్న వయసుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే, ఆమె ప్రేమ జీవితం కారణం గా కెరీర్ నిలిచిపోయింది. అయితే, డిప్రెషన్ కి లోనైన ఆర్తి చాలా బరువు పెరిగిపోయింది. కొన్ని ఏళ్ల తరువాత తిరిగి ఆ స్టార్ డమ్ ను సొంతం చేసుకోవాలని భావించింది. అందుకోసం లైపో సక్షన్ సర్జరీ చేయించుకోవాలనుకుంది. ఆమె కు తెలిసిన వ్యక్తిగత డాక్టర్ కూడా వద్దని వారించినప్పటికీ ఆమె వినలేదు. ఆర్తి తాను పుట్టిన పెరిగిన అమెరికా లోనే లైపో సక్షన్ చేయించుకుంది. దురదృష్టవశాత్తు అది వికటించడం తో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
2. మిస్తీ ముఖర్జీ:

బాలీవుడ్ నటి మిస్తీ ముఖర్జీ ఇందుకు మరో ఉదాహరణ. బెంగాలీ సినిమాలలో బాగా పాపులర్ అయినా మిస్తీ ముఖర్జీ పలు హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పు పొందారు. అయితే, ఏమి తిన్నా లావు అయిపోయే శరీర తత్త్వం కారణం గా ఆమె బరువు పెరిగిపోయారు. దానివలన ఆమె కు అవకాశాలు సన్నగిల్లాయి. అయితే ఎలా అయినా సన్నబడాలన్న కోరికతో, తిరిగి అవకాశాలను సంపాదించుకోవాలన్న జిజ్ఞాసతో ఆమె కీతో డైట్ ను ఫాలో అయ్యారు. డాక్టర్ వారించినప్పటికీ.. ఆమె అతిగా ఆ డైట్ ను ఫాలో అయ్యారు. దీనితో ఆమె చాలా సన్నగా అయిపోయారు. ఆమె ఆరోగ్యం చెడిపోవడం మాత్రమే కాకుండా కిడ్నీలు కూడా పాడైపోయాయి. ఎంత ఖర్చు చేసినప్పటికీ ఆమె తిరిగి తన ఆరోగ్యాన్ని పొందలేకపోయింది. కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే ఆమె తన ప్రాణాలను పోగొట్టుకుంది.
3. రాకేష్ దివానా:
సీరియల్స్ నటుడి గా రాకేష్ దివానా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో కూడా కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రాకేష్ కి మంచి పేరు ఉంది. ఈయన బరువు దగ్గడం కోసం బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ జీర్ణాశయానికి చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ సర్జరీ సక్సెస్ అయింది. కానీ, ఆ తరువాత బీపీ లెవెల్స్ లో చాలా మార్పులు వచ్చాయి. వీటిని కంట్రోల్ చేయడం వైద్యుల వల్ల కాలేదు. దీనితో ఈయన కూడా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బరువు తగ్గడం కోసం సర్జరీ లు చేయించుకోవడం అంత శ్రేయస్కరం. ఎక్కడో కొందరికి ఇవి ఉపయోగపడుతుంటాయి. డైటింగ్ , వ్యాయాయం ద్వారా బరువు తగ్గడమే ఉత్తమం.
సెలెబ్రిటీలు వేల రూపాయల ఖరీదు పెట్టి వాటర్ ని ఎందుకు కొనుక్కుంటారో తెలుసా..?
మనం తాగే వాటర్ బాటిల్ ఖరీదు ఎంత..? ఇరవై రూపాయలు కదా.. మహా అయితే పాతిక రూపాయలు. అయినా సరే, మనం అస్తమానం బాటిల్ ను కొనం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లోంచి వాటర్ బాటిల్ ని కూడా తీసుకుని వెళ్తాము. మరీ అవసరం అయితే తప్ప వాటర్ బాటిల్ ని మనం కొనము. మరి అలాంటిది.. సెలెబ్రిటీలు మాత్రం వేలకు వేలు పోసి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటారు. అంత ఖరీదు పెట్టి వారు ఆ వాటర్ నే ఎందుకు తాగుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విరాట్ కోహ్లీ గురించి పరిచయం అవసరం లేదు. విరాట్ తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా..? ఆరువందల రూపాయలు. “ఎవియన్” బ్రాండ్ వాటర్ ని మాత్రమే విరాట్ తాగుతాడు. మ్యాచ్ కోసం ఏ కంట్రీ కి వెళ్లినా, ఏ హోటల్ కి వెళ్లినా అతనితో పాటు “ఎవియన్” బ్రాండ్ వాటర్ బాటిల్ ఉండాల్సిందే. విరాట్ మాత్రమే, కాదు చాలా మంది సెలెబ్రిటీలు, స్పోర్ట్స్ మెన్లు వేల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ తాగుతుంటారు. అసలు అవి ఏమిటో..?వాటికి అంత ప్రత్యేకత ఎందుకొచ్చిందో తెలుసుకుందాం.
#1 హవాయి కోనా నిగరి వాటర్..

ఇవి ప్రపంచం లోనే అత్యంత ఖరీదైనవి. ఈ వాటర్ తాగడం వలన మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాదు, బరువు తగ్గి చర్మం కూడా నిగారింపు ను సంతరించుకుంటుందట. అలాగే మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుందని నమ్ముతారు. హవాయికి దగ్గర్లో ఉండే పసిఫిక్ సముద్ర తీరం వద్ద రెండు వేల అడుగుల లోపలకి తవ్వి నీటిని వెలికితీస్తారు. అందుకే ఈ నీరు అంత కాస్ట్లీ. కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ నీటిలో ఉండే లవణాన్ని పోగొట్టి తాగే నీటిగా మార్చి బాటిల్స్ లో నింపుతారు. ఈ నీరు స్వచ్ఛం గా ఉండడమే కాదు.. ఎన్నో ఖనిజ లవణాలు కూడా ఈ నీటిలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ నీటికి జపాన్ లో బాగా డిమాండ్ ఉంది. అక్కడ రోజుకు ఎనభై వేలకు పైగా కోనా నిగరి వాటర్ బాటిల్స్ దిగుమతి అవుతాయట.
#2 బ్లింగ్ హెచ్ టు ఓ..!

ఈ బాటిల్ లోని వాటర్ మాత్రమే కాదు., బాటిల్ కూడా చాల ఖరీదైనది. ఎంతో ఆకర్షణీయం గా ఈ బాటిల్ ని తీర్చిదిద్దారు. టేనేస్సి దగ్గర ఉండే నీటి బుగ్గల నుంచి నీటిని సేకరించి ఈ బాటిల్స్ లో నింపుతారు. ఈ బాటిల్స్ ను స్వరోవ్స్కి రాళ్లతో తీర్చిదిద్ది అందం గా డిజైన్ చేసారు. ఈ బాటిల్ లో వాటర్ ధరకి బాటిల్ ధర అదనం గా పడుతుంది.
#3 వీన్:

ఈ బాటిల్ లో నీటిని తాగినప్పుడల్లా సుతిమెత్తనిదేదో నాలుకపై తగిలినట్లు అనిపిస్తుంది. ఈ నీరు అంత స్వచ్ఛం గా ఉంటాయట. కాలుష్యం లేకుండా, స్వచ్ఛమైన ప్రాంతాల్లోని నీటి బుడగలు సేకరించి ఈ నీటిని తయారు చేస్తుంది వీన్ కంపెనీ. ఈ కంపెనీ ఫిన్లాండ్ కు చెందినది. అలా హిమాలయ ప్రాంతాలనుంచి, లాప్ ల్యాండ్ నుంచి, ప్రపంచం లోనే ప్రకృతి సంపద ఎక్కువ గా ఉన్న భూటాన్ దేశం నుంచి కూడా ఈ కంపెనీ నీటిని సేకరిస్తుంది.
#4 10 థౌజండ్ కంపెనీ :

కెనడా లోని వాంకోవర్ సిటీ నుంచి ఒక రెండొందల కిలోమీటర్ల దూరం వెళ్తే, అక్కడ జనసంచారం ఉండదు. జంతువులు కూడా ఉండవు. అక్కడ హిమనీ నదాలు ఉంటాయి. దాదాపు ఆరువేల అడుగుల లోతు వరకు ఈ నదాలు ఉన్నాయి. వాటిని కరిగించి ఆ నీటిని బాటిల్స్ లో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ చోటుకు ఎవరు వెళ్ళలేరు, జంతువులు కూడా ఉండవు. అందుకే అక్కడి నీరు స్వచ్ఛం గా ఉంటుంది. పైగా, ఈ నీటిని తాగడం వలన చర్మ సంబంధిత రోగాలు రావని ఈ కంపెనీ చెబుతోంది. ఈ హిమానీ నదాలు పద్దెనిమిది వేల సంవత్సరాలక్రితం ఘనీభవించాయట. ఈ వాటర్ కు కెనడా కు చెందిన “ఆక్వా డెకో” ఉత్తమ నాన్ కార్బోనేటేడ్ స్ప్రింగ్ వాటర్ గా పేర్కొంది.
#5 ఎవియన్ :

ఎవియన్ కంపెనీ నీరు కూడా చాలా స్వచ్ఛమైనది. శరీరం లో రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు. 1789 వ సంవత్సరం లోనే మార్కిస్ అనే వ్యక్తి రోజు వాకింగ్ కి వెళ్లేవాడట. అలా వెళ్తూ, ఎవియన్ లెస్ బెయిన్స్ వద్ద ఉండే నీటిబుడగల్లోని నీటిని తాగేవాడట. క్రమం గా అతనికి ఉన్న కిడ్నీ, లివర్ సమస్యలు తగ్గిపోయాయని రుజువైంది. ఈ సంగతి అందరికి ప్రచారం అవడం తో, క్రమం గా ఆ నీటిని అమ్మడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ నీరే ఎవియన్ బ్రాండ్ గా మార్కెట్ లో అందుబాటులో ఉంది. చాలామంది సెలెబ్రిటీలు ఈ నీటిని ప్రత్యేకించి తెప్పించుకుని తాగుతారు. భారత్ లో కూడా ఆన్ లైన్ అమ్మకాలు సాగుతున్నాయి.
#6 లాక్వెన్ మినరల్ వాటర్:

ఇవికూడా భూమి అడుగుల్లోంచి తవ్వి తీయబడ్డాయి. దక్షిణ అమెరికా లో, ఆండెస్ పర్వతాల సమీపం లో ఎలాంటి జనసంచారం లేని,కాలుష్య రహిత ప్రాంతం లో పదిహేనొందల అడుగుల లోపలికి తవ్వి నీటిని వెలికితీశారు. ఈ నీరు బాటిల్ లో నింపేవరకు గాలి కూడా తగలనంత స్వచ్ఛం గా ఉంటాయట.
“జయసుధ” గారికి ఏమైంది..? వైరల్ అవుతున్న వీడియో చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..!
జయసుధ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది మన ఇంట్లో అమ్మ లాగానో, పిన్ని లాగానో, లేదంటే అమ్మమ్మ లాగానో కనిపించే నిండైన రూపం. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లి గా, నానమ్మ గా కూడా పాత్రలు పోషించి కుటుంబ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. ఆమెకు చాలా మంది అభిమానులే ఉన్నారు తప్ప హేటర్స్ ఎవరు లేని నటి గా ఆమె పేరు ప్రఖ్యాతలు గడించారు.

అయితే, ఇటీవల ఆమె ఓ వీడియో ను విడుదల చేసారు. ఈ వీడియో ను చూసి అందరు జయసుధ కు ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు. దానికి కారణం ఆమె బాగా చిక్కిపోయి కనిపించడం. ఆమె జుట్టు కూడా బాగా నెరిసిపోయి కనిపించడం తో జయసుధ ఏమైనా అనారోగ్యం బారిన పడ్డారా? అన్న అనుమానాలు కూడా అభిమానులకు కలుగుతున్నాయి. మూడు తరాలు గా టాప్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జయసుధ అకస్మాత్తు గా ఇలా కనిపించడం తో అభిమానులు ఒకింత ఆందోళనకు గురి అవుతున్నారు.

బుల్లి తెరపై ప్రసారం కానున్న ఓ సీరియల్ గురించి మాట్లాడడానికి ఆమె కెమెరా ముందు కు వచ్చారు. బుల్లి తెరపై ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ త్వరలోనే ప్రసారం కానుంది. జయసుధ తాజాగా రిలీజ్ చేసిన వీడియో లో ఈ సీరియల్ టీం కి ఆమె బెస్ట్ విషెస్ తెలిపారు. సినిమా మాత్రమే కాదని, సీరియల్ తో కూడా తాను ముందుకు వస్తున్నానని ఆమె వీడియో ద్వారా తెలిపారు. గతం లో శోభన్ బాబు తో కలిసి జయసుధ “జానకి కలగనలేదు..రాముని సతి కాగలనని ఏనాడు..” అన్న పాటలో నటించారు.

ఈ పాటకు ఇళయరాజా సంగీతం అందించారు. అప్పట్లో ఈ పాట సంచలనం సృష్టించింది. తాజాగా, ఈ పాటలో మొదటి లైన్ ను సీరియల్ కి పేరుగా పెట్టారు. ఈ సీరియల్ గురించే జయసుధ ఈ వీడియో లో మాట్లాడారు. అయితే, ఆమె బరువు తగ్గినట్లు, ముఖం కూడా పీక్కుపోయినట్లు కనిపించడం తో ఆమె ఆరోగ్యం పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

1970 ల కాలం లోనే జయసుధ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. రెండు దశాబ్దాలకు పైగా ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. శ్రీదేవి, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లే కాదు, దాదాపు అందరు స్టార్ హీరోలతో కూడా ఆమె తెరను పంచుకున్నారు. 1990 లకు వచ్చేసరికి జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించడం ప్రారంభించారు.

తల్లి, వదిన, అత్త వంటి పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఈ పాత్రల్లో ఒదిగిపోయారు. గతం తో పోలిస్తే ప్రస్తుతం కొంతమేర సినిమాలు తగ్గించినప్పటికీ, ఆమెకు ఉన్న క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. తాజాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు “మహర్షి” సినిమా లో కూడా జయసుధ అమ్మగా కనిపించారు. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా.. ఎప్పట్లానే సినిమాలతో, సీరియల్స్ తో అలరించాలని కోరుకుందాం..
గుడ్లగూబ అంటే అందరికి ఎందుకంత భయం..? గుడ్లగూబ వల్ల అదృష్టం కలిసొస్తుందని మీకు తెలుసా..?
మనలో చాలా మందికి గుడ్లగూబ అంటే భయం, ఒక అయిష్టత. రకరకాల ప్రచారాల వల్లనే మనలో చాల మందికి గుడ్లగూబ అంటే ఒక ఏహ్యభావం కలుగుతోంది. కానీ, హిందూ శాస్త్ర ప్రకారం గుడ్లగూబ శుభ శకునానికి సూచన అట. అదెలానో మనం ఈ ఆర్టికల్ లో చూసేద్దాం..

గుడ్లగూబ అందవికారం గా ఉంటుంది. కళ్ళు చాలా పెద్దవి గా ఉండడం తో చూడగానే భయం వేసే విధం గా ఉంటుంది. అంతే కాదు దాని గొంతు కూడా కర్ణకఠోరం గా ఉంటుంది. అందుకే సహజం గా గుడ్లగూబని చూడగానే భయం కలగడం సహజం. ప్రస్తుత కాలం లో గుడ్లగూబలు అంతరించిపోతున్నాయి. గుడ్లగూబలు చూడడానికి కానీ, పెంచుకోవడానికి కానీ మనలో చాలా మంది ఇష్టపడరు. కానీ, రైతులకు మాత్రం ఇవి మంచి స్నేహితులు.

మనలో చాలా మందికి ఉన్న నమ్మకం ఏమిటంటే, గుడ్లగూబను చూస్తే చెడు జరుగుతుంది అని, గుడ్ల గూబ ఇంట్లో కి వస్తే ఆ ఇల్లు విడిచేయాలని, లేకుంటే చావు వార్త వినాల్సి వస్తుందని..ఇలా రకరకాలుగా చెబుతుంటారు. అందుకే మనలో చాలా మంది అదొక భయంకరమైన పక్షి లా భావిస్తూ ఉంటారు. అయితే, హిందూ శాస్త్రాలు గుడ్లగూబను లక్ష్మి దేవి వాహనం గా కీర్తిస్తున్నాయి. లక్ష్మి అమ్మవారు స్వామి వారితో పాటు గరుడ వాహనం పైన, ఒంటరిగా వెళ్ళవలసి వస్తే గుడ్లగూబ పైన ప్రయాణిస్తుందట.

అలాగే, ఉల్లూక తంత్రం ప్రకారం నాలుగవ జాము సమయం లో గుడ్ల గూబ ఎవరి ఇంటిపైన అయినా వాలితే, వారి ఇంట్లో కనకవర్షం కురుస్తుందట. ఎవరైనా ఇంటి పరిసరాల్లో గుడ్లగూబ నివాసం ఏర్పరుచుకుంటే.. వారి ఇంట్లో యజమాని తో సహా కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో నివసిస్తారట.
ఈ బ్యాక్ ఎక్కడో చూసినట్లుందే.. ఎవరా అని ఆలోచిస్తున్నారా..? మన టాలీవుడ్ హీరోయిన్ దే అండి… ఈ మధ్య సినిమాలకు దూరం గా ఉంటూ.. తాజాగా సినిమాలు నిర్మించేస్తోంది. మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి బెస్ట్ ఫ్రెండ్ కూడా.. గుర్తొచ్చేసిందా..? ఆ ఛార్మి కౌర్. ఛార్మి కౌర్ తాజాగా ఈ ఫోటో ను ఇన్స్టా లో పోస్ట్ చేసింది. అప్పటి నుంచి ఈ ఫోటో వైరల్ అవుతోంది.
View this post on Instagram
A post shared by Charmmekaur (@charmmekaur)
గత కొంత కాలం గా ఛార్మి కౌర్ సినిమాలకు దూరం గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం నిర్మాణ రంగం లో దూసుకెళ్తోంది. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి ఆమె వరుస సినిమాలు నిర్మిస్తోంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఛార్మి కుర్రకారు ని ఎంత గా ఆకట్టుకుందో కొత్త గా చెప్పక్కర్లేదు. టాప్ హీరోయిన్ గా కూడా కొనసాగింది. కానీ, అకస్మాత్తుగా సినిమాలు చేయడం తగ్గించింది.

ప్రస్తుతం నిర్మాణ భాగస్వామి గా కొనసాగుతోంది. 2002 లో నీ తోడు కావాలి చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఛార్మి ఐటెం సాంగ్ లు కూడా చేసిన సంగతి తెలిసిందే. “సక్కు బాయి” సాంగ్ ఎంత హిట్టో కొత్త గా చెప్పక్కర్లేదు. ప్రస్తుతానికి సినిమాలకు దూరం గా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం ఛార్మి ఆక్టివ్ గానే ఉంటోంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ , విజయ్ దేవరకొండ కాంబో లో వస్తున్న “లైగర్” సినిమా కి నిర్మాణ భాగస్వామి గా ఉంది. సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే ఛార్మి వరుసగా తన ఫోటోలను పంచుకుంటోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి మరి..



తల్లి పై కామెంట్ చేసిన నెటిజెన్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్ మనవరాలు..!
సెలెబ్రిటీలు తమ జీవితం లోని చాలా విషయాలను తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా యుగం వచ్చాక ఇటీవల చాలా విషయాలు పబ్లిక్ లోనే ఉంటున్నాయి. ఈ క్రమం లో కొందరు అతిగా స్పందిస్తుంటారు. అవి మనకు చిరాకు తెప్పిస్తుంటాయి.. ఎక్కువ గా ఇలాంటివి సెలెబ్రిటీల జీవితం లో జరుగుతూ ఉంటాయి. అయితే సాధారణ యూజర్ల కంటే.. సెలెబ్రిటీలు మరింత ఎక్కువ జాగ్రత్త గా స్పందించాల్సి ఉంటుంది.

ఎందుకంటే.. వారి లైఫ్ పబ్లిక్ లో ఉంటుంది. వారిని ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. ఈ క్రమం లో ఇటీవల అమితాబ్ మనవరాలు తాను ఎదురైన కౌంటర్ కి ధీటు గా సమాధానం ఇచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. అమితాబ్ మనవరాలు నవ్య నవేలీ ఫోర్డామ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ‘ఆరా హెల్త్’ పేరుతొ ఓ హెల్త్ కేర్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా లో పంచుకుంటూ.. తమ ఫామిలీ లో అందరు మహిళలు ఏదొక పని చేసుకుంటూనే ఉన్నామని పేర్కొంది.

దీనికి ఓ కొంటె నెటిజెన్.. మీ అమ్మకు ఉద్యోగం లాంటి పనులు ఏమి లేవు కదా అంటూ కామెంట్ చేసాడు. దీనితో, నవ్య దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది. ఆమె మాకు తల్లి, రైటర్, డిజైనర్, హౌస్ వైఫ్” అంటూ పేర్కొంది. ఒక స్టేటస్ ను కూడా షేర్ చేసింది. “ఒక మహిళ భార్య గా, తల్లి గా ఉండడం కూడా ఫుల్ టైం జాబ్ లాంటిదేనని, తక్కువ చేసి చూడక్కర్లేదని, వారికి సపోర్ట్ గా ఉండాలి తప్ప ఇలా అవమానించకూడదని” గట్టి గా కౌంటర్ ఇచ్చింది.
ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాయలసీమ బిడ్డ.. హరీష్ శంకర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
తెలుగు రాష్ట్రాల లో గత రెండు మూడు రోజుల నుంచి హాట్ టాపిక్ ఏంటి అంటే మన తెలుగు బిడ్డ హరీష్ శంకర్ ఐపీఎల్ కి ఎంపిక అవడమే. ఈ వార్తతో రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. సిఎస్కె ( చెన్నై సూపర్ కింగ్స్) జట్టు ఇరవై లక్షల రూపాయల వేలం పాటతో హరీష్ ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ లో హరీష్ శంకర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి ఆడనున్నాడు. ఈ తెలుగు తేజం ఎవరు..? బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అన్న విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

హరీష్ శంకర్ మంచి పేస్ బౌలర్. ఇతనికి కుడిచేతివాటమెక్కువ. రాయచోటికి చెందిన చిన్నమండెం మండలం లో నాగూరువాండ్లపల్లె వాసి ఈ హరీష్ శంకర్. హరీష్ శంకర్ ఇంటి పేరు మారం రెడ్డి. ఎనిమిదేళ్ల వయసు నుంచే హరీష్ శంకర్ క్రికెట్ పై అత్యుత్సాహం ప్రదర్శించేవాడు. బాగా ఆడేవాడు, ప్రాక్టీస్ చేసేవాడు. చాలా సార్లు క్లాస్ లు ఎగ్గొట్టి మరీ టోర్నీలకు వెళ్లేవాడట. హరీష్ భవిష్యత్ పై అతని తల్లితండ్రులు కూడా చాలా బెంగ పెట్టుకున్నారు. అంత పట్టుదల ఉండబట్టే.. 2016 లో అండర్ 19 కి హరీష్ ఎంపికయ్యాడు.

2018 వ సంవత్సరం నాటికి హరీష్ రంజీల్లోకి కూడా ఎంటర్ అయిపోయాడు. రంజీ జట్టులో కూడా తన ఆటతీరుతో హరీష్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. తాజాగా, ఐపీఎల్ కు కూడా ఎంపికయ్యాడు. అతని ఆనందానికి అవధుల్లేవు. ఇక హరీష్ ధోని, అంబటిరాయుడు, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, శార్దుల్ ఠాకూర్, ఫాప్ డుఫ్లెసిస్,దీపక్ చాహర్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడనున్నాడు. వారందరితో రూమ్ కూడా పంచుకోబోతున్నాడు. ఐపీఎల్ లో ఎంపిక అయ్యా అని తెలిసాక చాలా సంతోషపడ్డాడు. ధోని తో ఒక్క ఫోటో దిగినా చాలు అనుకునేవాడినని, ఇప్పుడు ఏకంగా ధోని తో కలిసి ఆడే ఛాన్స్ వచ్చిందని హరీష్ సంబరపడిపోతున్నారు.

తనను ఎంపిక చేసుకున్నందుకు అతను చెన్నై జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాడు. మరో వైపు అతను ఐపీఎల్ కు ఎంపిక కావడం తో అతని జిల్లా ప్రజలు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతని తల్లితండ్రులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని సాగిస్తూ వచ్చారు. రైతు కుటుంబం నుంచి వచ్చి, క్రికెట్ ప్రపంచం లోకి అడుగు పెట్టిన హరీష్ శంకర్ మరింత ముందుకెళ్లాలని, టీం ఇండియా కి ఆడాలని మనస్పూర్తి గా కోరుకుందాం.
















