ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాయలసీమ బిడ్డ.. హరీష్ శంకర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాయలసీమ బిడ్డ.. హరీష్ శంకర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

by Anudeep

Ads

తెలుగు రాష్ట్రాల లో గత రెండు మూడు రోజుల నుంచి హాట్ టాపిక్ ఏంటి అంటే మన తెలుగు బిడ్డ హరీష్ శంకర్ ఐపీఎల్ కి ఎంపిక అవడమే. ఈ వార్తతో రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. సిఎస్కె ( చెన్నై సూపర్ కింగ్స్) జట్టు ఇరవై లక్షల రూపాయల వేలం పాటతో హరీష్ ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ లో హరీష్ శంకర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి ఆడనున్నాడు. ఈ తెలుగు తేజం ఎవరు..? బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అన్న విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

Video Advertisement

harish shankar

హరీష్ శంకర్ మంచి పేస్ బౌలర్. ఇతనికి కుడిచేతివాటమెక్కువ. రాయచోటికి చెందిన చిన్నమండెం మండలం లో నాగూరువాండ్లపల్లె వాసి ఈ హరీష్ శంకర్. హరీష్ శంకర్ ఇంటి పేరు మారం రెడ్డి. ఎనిమిదేళ్ల వయసు నుంచే హరీష్ శంకర్ క్రికెట్ పై అత్యుత్సాహం ప్రదర్శించేవాడు. బాగా ఆడేవాడు, ప్రాక్టీస్ చేసేవాడు. చాలా సార్లు క్లాస్ లు ఎగ్గొట్టి మరీ టోర్నీలకు వెళ్లేవాడట. హరీష్ భవిష్యత్ పై అతని తల్లితండ్రులు కూడా చాలా బెంగ పెట్టుకున్నారు. అంత పట్టుదల ఉండబట్టే.. 2016 లో అండర్ 19 కి హరీష్ ఎంపికయ్యాడు.

harish shankar

2018 వ సంవత్సరం నాటికి హరీష్ రంజీల్లోకి కూడా ఎంటర్ అయిపోయాడు. రంజీ జట్టులో కూడా తన ఆటతీరుతో హరీష్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. తాజాగా, ఐపీఎల్ కు కూడా ఎంపికయ్యాడు. అతని ఆనందానికి అవధుల్లేవు. ఇక హరీష్ ధోని, అంబటిరాయుడు, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, శార్దుల్ ఠాకూర్, ఫాప్ డుఫ్లెసిస్,దీపక్ చాహర్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడనున్నాడు. వారందరితో రూమ్ కూడా పంచుకోబోతున్నాడు. ఐపీఎల్ లో ఎంపిక అయ్యా అని తెలిసాక చాలా సంతోషపడ్డాడు. ధోని తో ఒక్క ఫోటో దిగినా చాలు అనుకునేవాడినని, ఇప్పుడు ఏకంగా ధోని తో కలిసి ఆడే ఛాన్స్ వచ్చిందని హరీష్ సంబరపడిపోతున్నారు.

తనను ఎంపిక చేసుకున్నందుకు అతను చెన్నై జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాడు. మరో వైపు అతను ఐపీఎల్ కు ఎంపిక కావడం తో అతని జిల్లా ప్రజలు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతని తల్లితండ్రులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని సాగిస్తూ వచ్చారు. రైతు కుటుంబం నుంచి వచ్చి, క్రికెట్ ప్రపంచం లోకి అడుగు పెట్టిన హరీష్ శంకర్ మరింత ముందుకెళ్లాలని, టీం ఇండియా కి ఆడాలని మనస్పూర్తి గా కోరుకుందాం.

 


End of Article

You may also like