ఆర్సీబీ వద్దు పొమ్మంది…ఇప్పుడు ఆర్సీబీ బౌలర్లకే చుక్కలు చూపించిన 5 ప్లేయర్స్ వీరే.!

ఆర్సీబీ వద్దు పొమ్మంది…ఇప్పుడు ఆర్సీబీ బౌలర్లకే చుక్కలు చూపించిన 5 ప్లేయర్స్ వీరే.!

by Harika

Ads

ఆర్సీబీ టీం కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు అనుకుంట. కానీ ఆర్సీబీ టీం, దరిద్ర దేవత మంచి ఫ్రెండ్స్ అనుకుంట. అందుకే ఇప్పటివరకు ఒక్క కప్ కూడా గెలవలేకపోయారు. ఆదివారం నాడు ఐపీఎల్ 2024 లో కోల్కత్తతో జరిగిన మ్యాచ్ లో ఒక పరుగు తేడాతో ఓడిపోయింది ఆర్సీబీ. చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది. దినేష్ కార్తీక్ అవుట్ అయినా కరణ్ శర్మ గెలుపుపై ఆశల్ని పెంచాడు. కానీ స్టార్క్‌కు స్ట్రెయిట్ క్యాచ్ ఇచ్చి కరణ్ శర్మ అవుట్ అవ్వడంతో ఆర్సీబీ ఓడిపోయింది.

Video Advertisement

మొదట బ్యాటింగ్ చేసిన కోల్కత్త జట్టు…నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ చేసాడు. 223 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు గెలుపు ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. విల్ జాక్స్‌ ( 32 బంతుల్లో 55, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్ పాటిదార్‌ ( 23 బంతుల్లో 52, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మంచి ఇన్నింగ్స్ ఆడినా ప్రమోజనం లేకపోయింది. ఈ ఓటమితో ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు మరింత కష్టంగా మారింది.

ఇది ఇలా ఉంటే…గతంలో ఆర్సీబీ రిలీజ్ చేసిన కొంతమంది ప్లేయర్స్ ఇప్పుడు ఆర్సీబీ పైనే అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి తలనొప్పిగా మారారు. ఈ ప్లేయర్స్ లిస్ట్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ హెడ్‌, క్లాసెన్‌ ఉన్నారు. ఏప్రిల్ 15 బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన SRH vs RCB మ్యాచ్ లో .. ట్రావిడ్ హెడ్‌ (102), క్లాసెన్‌ (67) బెంగళూరు బౌలర్లపై విరుచుకు పడ్డారు. గతంలో ఈ ఇద్దరు ఆర్సీబీకి ఆడిన వారే.

ఇంకా ఈ లిస్ట్ లో…ప్రస్తుత చెన్నై స్టార్ ప్లేయర్ శివమ్ దూబే, లక్నో కెప్టెన్ కె.ఎల్.రాహుల్ ఉన్నారు. ఐపీఎల్‌ 2024 మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగింది. బెంగళూరు, చెన్నై జట్లు తలపడ్డ ఈ మ్యాచ్ లో…శివమ్ దూబే 34 పరుగులు చేసాడు. గతంలో ఐపీఎల్‌ 2022 లో… ఆర్సీబీపై దూబే 46 బంతుల్లో 95 పరుగులు చేశాడు. అలాగే లక్నో జట్టు కెప్టెన్ కె.ఎల్.రాహుల్…2020 లో పంజాబ్ జట్టులో ఆడి…ఆర్సీబీ పై 69 బంతుల్లో 132 పరుగులతో విజృభించాడు. అలాగే ఈ లిస్ట్ లో క్రిస్ గేల్ కూడా ఉన్నారు. బెంగళూరు జట్టు తర్వాత పంజాబ్ జట్టుకి ఆడి ఎన్నో విజయాలు అందించాడు గేల్.


End of Article

You may also like