ఆమె చేతి వంట తింటే మరణమే…చివరికి ఆమెను అడ్డుకునేందుకు పోలీసులు ఏం చేసారంటే?

ఆమె చేతి వంట తింటే మరణమే…చివరికి ఆమెను అడ్డుకునేందుకు పోలీసులు ఏం చేసారంటే?

by Anudeep

Ads

మన  ప్రపంచంలో ఎన్నెన్ని మిస్టీరియస్ కథలున్నాయసలు.. ఎంత పెద్ద మిస్టరీని అయినా సైన్స్ చేధించగలదు. కాని సైన్స్ కూడా అందని విషయాలు, సైన్స్ కూడా  ఛేధించలేని ఎన్నో దృష్టాంతాలను మనం చూసాం . వాటిల్లో ఒక్కటి టైఫాయిడ్ మేరీ కథ. పేరు చదవగానే మీకు కొంత కథ మైండ్లోకి వచ్చేసుంటుంది. కాని అసలు కథ చదివితే ఔరా అని ఆశ్చర్యపోక మానరు.

Video Advertisement

మనకు వచ్చే ఎన్నో రకాల వ్యాధుల్లో చాలా వరకు వైరస్ లు, బ్యాక్టీరియాల నుండి వ్యాప్తి చెందినవే. వైరస్, బ్యాక్టిరియాలు అనేవి మన కంటికి కనపించనంతటి పరిణామాల్లో ఉంటాయి. కాని ఒక మనిషి రూపంలో ఎందరికో టైఫాయిడ్ వ్యాప్తి చెందిందంటే నమ్ముతారా? నమ్మి తీరాలి.. ఆ వ్యక్తి పేరు టైఫాయిడ్ మేరి అసలు పేరు మేరీ మల్లాన్. టైఫాయిడ్ వ్యాధి ఎప్పటి నుంచో ఉనికిలో ఉండేది. 1900 సంవత్సరంలో పరిశోధకులు ఈ వ్యాధి వ్యాప్తికి గల కారణాలను కనుగొన్నారు. టైఫాయిడ్  బ్యాక్టీరీయా మలం లేదా అపరిశుభ్రత వల్ల వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్నారు.

కానీ ఒక వ్యక్తి వలన కూడా టైఫాయిడ్ బ్యాక్టిరియా వ్యాప్తి చెందుతుందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. బ్యాక్టిరియాను వ్యాప్తి చేసిన తొలి వ్యక్తిగా మేరీ పేరు నిలిచిపోతుంది. 1869, సెప్టెంబర్ 23న ఉత్తర ఐర్లాండ్‌లోని కూక్స్‌టౌన్ అనే ఊరిలో జన్మించిన మేరి వాళ్లది సాధారణ కుటుంబం . అందరమ్మాయిల్లానే పెరిగింది. వంట చేయడం ఇష్టం కావడంతో అదే వృత్తిగా ఎంచుకుంది. ఇళ్లల్లో వంటలు చేసి పెట్టేది.ఎక్కడ పనికి కుదిరినా కొద్ది రోజుల్లో మానేసేది దానికి కారణం అక్కడి వారు అనారోగ్యంతో బాధపడడమే. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆమె ఎప్పుడూ టైఫాయిడ్ కి గురి కాలేదు.

టైఫాయిడ్ వచ్చిన రోగి నుండి  ఇతరులకు ఆ వ్యాధి వ్యాపిస్తుంది, కాని అదేంటో మేరీ మాత్రం ఏ ఒక్క రోజు కూడా టైఫాయిడ్ తో బాధపడలేదు. కాని ఆమె వల్ల ఇతరులకు మాత్రం వ్యాపించేది. అసలు తన వల్లే అదంతా జరుగుతోందని ఆమెకి కూడా తెలియదు.ఎలా తెలుస్తోంది తనెప్పుడైనా అనారోగ్యంతో మంచం పడితే కదా.. తనే కారణమేమో అనుకోవడానికి.అయితే ఒక రోజు అసలు విషయం బయటపడింది. ఎలా అంటే? 1906లో ఛార్లెస్ హెన్ని వారెన్ అనే వ్యక్తి ఇంట్లో పది మంది కుటుంబ సభ్యుల్లో ఒకే సారి ఆరుగురు టైపాయిడ్ బారిన పడ్డారు. తమ చుట్టుపక్కల ఎవరికి ఆ వ్యాదిలేదు, తమ ఇంట్లో అందరూ శుభ్రంగానే ఉంటారు. మరి ఎలా ఇంతమందికి టైఫాయిడ్ వచ్చింది అనే సందేహం వచ్చింది. అదే విషయాన్ని తన స్నేహితుడు జార్జ్ సాపర్ కి చెప్పాడు . ఆ ఇంట్లోకి బయటి నుండి వచ్చే వ్యక్తులు ఎవరా అని ఆలోచిస్తే కేవలం అక్కడ వంట చేసే మేరి మాత్రమే.. కాని తను ఇప్పుడు పనిమానేసింది.

తన గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసాడు. ఎక్కడ వాకబు చేసినా తెలిసిన విషయం ఒక్కటే తను ఎక్కడా కూడా ఎక్కువ రోజులు పనిచేయదు. అంతేకాదు తను పని చేసిన చొటల్లా వ్యక్తులు టైపాయిడ్ భారిన పడ్డారు.అంతే అనుమానం బలపడింది. నేరుగా పోలీసులకు విషయం తెలియచేశాడు . పోలీసులు ఎంక్వైరీ చేసి చివరికి మేరిని పట్టుకుని అరెస్ట్ చేశారు.మరోవైపు ఒక మనిషి వలన టైఫాయిడ్ వస్తుందనే వార్తా అంతటా మారుమోగిపోయింది.

పోలీసులు వైరస్ ఇతరులకు సోకకూడదనే ఉద్దేశ్యంతో మేరిని న్యూయార్క్ సముద్ర తీరం శివురలో నార్త్ బ్రదర్ దీవిలో బందించారు. 1910లో డాక్టర్ రిపోర్ట్ వచ్చింది.. అందులో ఉన్న సారాంశం ఏంటంటే మేరిలో ఎలాంటి బ్యాక్టిరియా లేదు అని.దాంతో  ఆ రిపోర్ట్ ఆధారంగా మేరి న్యూయార్క్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్‌కు కూడా ఫిర్యాదు చేసింది. మేరీ వాదనలో నిజం ఉందని గ్రహించి, తాను మరెక్కడా వంట చేయకూడదనే షరతు మీద విడుదల చేసింది కోర్టు.

కోర్టు నిర్ణయం ప్రకారం మేరీ వంట పని మానేసి ఒక లాండ్రీలో పనికి కుదిరింది. కాని అక్కడ వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో పేరు మార్చుకుని ఒక హాస్పిటల్లో వంట మనిషిగా చేరింది. అక్కడ మేరి వంట తిన్న వారిలో 22 మంది డాక్టర్లు , నర్సులు  టైఫాయిడ్ బారిన పడ్డారు, ఇద్దరు చనిపోయారు. దాంతో మళ్లీ మేరిని మనుషుల్లేని దీవిలో బంధించారు పోలీసులు..ఇది జరిగింది 1915లో..మేరి మారు పేరు స్లోనే..

ఆ దీవికి అధికారులు నిత్యావసర వస్తువులు పంపేవారు, అలా ముఫ్పై ఏళ్లు ఆ దీవిలోనే జీవించింది. చనిపోవడానికి ఆరేళ్ల ముందు పక్షవాతానికి గురైన మేరీ నవంబరు 1938, నవంబరు 11న 69 ఏళ్ల వయస్సులో న్యుమోనియాతో చనిపోయింది . అసలు టైఫాయిడ్ కి గురికాకుండా అంతమందికి ఎలా అంటించింది అనేది ఇప్పటికి సమాధానం దొరకని ప్రశ్నే.. చేతులు కడుక్కోకుండా వంట చేసేది అనేది చాలామంది వాదన, ఆ వాదన ఎంత వరకు నిజమో మనకి తెలీదు..మనకే కాదు ప్రపంచానికే తెలీని మిస్టరీ టైఫాయిడ్ మేరీ..


End of Article

You may also like