ఎన్నో అద్భుతమైన ఎవర్ గ్రీన్ పాటలని అందించి, అందరినీ తన్మయత్వానికి గురి చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పక్కన ఉన్న ఆ చిన్న పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా??
ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడు కూడా పెరిగి పెద్దయ్యి ఎన్నో సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేసి, సూపర్ హిట్ పాటలనినందించాడు గుర్తుపట్టారా? ఇతను చాలా పెద్ద ఫేమస్ యాక్టర్స్ ఫ్యామిలీకి చెందినవాడు. అతను కజిన్ ఒక డైరెక్టర్. అతని కజిన్ భర్త, తండ్రి కూడా చాలా గొప్ప పేరు తెచ్చుకున్న, ఫేమస్ యాక్టర్స్, గుర్తుపట్టారా??

తాజాగా అతను మ్యూజిక్ కంపోజ్ చేసిన సాంగ్ ప్యాన్ ఇండియా లెవెల్లో క్లిక్ అయ్యి… తెగ వైరల్ అయిపోయింది. ఇంతకీ ఆ చిన్న పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా?? అది అతను ఇండియన్ మ్యూజికల్ కంపోజర్, మొదటి సారి వై దిస్ కొలవెరి పాటతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అనిరుధ్ రవిచందర్. అతను పాత కంపోజ్ చేస్తే కొన్ని రోజుల వరకు అందరి కాలర్ ట్యూన్స్, రింగ్టోన్స్ అవే ఉంటాయి. ముఖ్యంగా ధనుష్, శృతిహాసన్ నటించిన 3 మూవీలో పాటలు అయితే ఇప్పటికీ అభిమానులు ఎంతో పిచ్చిగా వింటుంటారు. ఇప్పటివరకు, విజయ్ అవార్డ్స్, మ్యూజిక్ మిర్చి అవార్డ్స్, ఐఐఎఫ్ఏ అవార్డ్స్, ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ ఎన్నో పొంది, కెరీర్ లో మంచి సక్సెస్ తో దూసుకుపోతున్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.


మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్ మూవీ సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీని సొంత ప్రొడక్షన్ హౌజ్ లో మమ్ముట్టి నిర్మించారు. ఈ యాక్షన్-మిస్టరీ థ్రిల్లర్ మూవీకి రాబి వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు. రిలీజ్ అయిన మొదటి షో నుండే ఈ మూవీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆడియెన్స్ డిమాండ్ మేరకు 25 కొత్త కేంద్రాలలో 70 అదనపు షోలను ప్రారంభించారు.
ఇక కథ విషయాని వస్తే, ఇక ఒక రాజకీయ నాయకుడి ఇంట్లోవారిని హత్య చేసి, ఇంట్లోని నగలు డబ్బును కొందరు దోచుకుని వెళ్తారు. ఈ కేసును చేధించడానికి కన్నూర్ స్క్వాడ్ ను నియమిస్తారు. ఈ స్క్వాడ్ ఏఎస్ఐ జార్జ్(మమ్ముట్టి ) నేతృత్వంలోని నలుగురు సభ్యుల ప్రత్యేక పోలీసుల దర్యాప్తు బృందం. ఏఎస్ఐ జార్జ్, అతని టీమ్ ఈ కేసును ఎలా చేధించారు అనేది మిగిలిన కథ.
సినిమాటోగ్రాఫర్ రాబీ వర్గీస్ రాజ్ ఈ మూవీతో దర్శకుడిగా మారారు. సినిమా కథనం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు, సినిమా వేగం పుంజుకుంటుంది. ఈ చిత్రం సెకండాఫ్ శరవేగంగా సాగుతూ, ఆశ్చర్యం కలిగిస్తుంది. మమ్ముట్టి ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నారు. మమ్ముట్టి చెప్పే ‘మాస్’ డైలాగ్‌లు ఆడియెన్స్ ను అలరిస్తాయి.


బాబూరావు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. పాఠశాల చదువు పూర్తి అయిన తరువాత ఏదైనా సాధించాలని హైదరాబాద్‌కు వచ్చారు. అయితే నగరానికి వచ్చిన తొలి రోజుల్లో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై కూడా పడుకున్నాడు. మొదట్లో బట్టల షాప్ లో పనిచేశారు. కొన్ని చిన్న ఉద్యోగాలను చేశాడు. హోటల్ లో పనిచేస్తే కనీసం తినడానికి ఆహారం లభిస్తుందనే ఉద్దేశ్యంతో కేఫ్‌లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
అలా కేఫ్‌లో క్లీనర్‌గా పనిచేయం ప్రారంభించిన బాబూరావు వెయిటర్‌గా ప్రమోషన్ పొందాడు. ఆ తరువాత బిస్కెట్లు, టీ తయారు చేశాడు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ 1978 నాటికి బాబురావు కేఫ్‌ను నడిపే స్థితి వచ్చాడు. కేఫ్ నడిపే కాంట్రాక్ట్ పై సంతకం చేశారు. మొదట్లో లాభాలు వచ్చినప్పటికీ, బాబూరావు కేఫ్ యాజమాన్యానికి ప్రతి నెలా నిర్ణీత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కష్టపడుతూ 1993 సంవత్సరం నాటికి కేఫ్‌ను సొంతం చేసుకోవడానికి అవసరం అయిన డబ్బును సంపాదించాడు. అప్పటి నుండి బాబూరావు ఓనర్ గా మారి, కేఫ్ ను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నాడు. మూడు అవుట్లెట్ల యజమానిగా మారిన బాబూ రావు తన మూలాలను మర్చిపోలేదు.
ఈ కేఫ్ ద్వారా పేదవారికి సాయం చేస్తూ ఉంటారు. ప్రతి రోజూ షాపులో మిగిలిన బిస్కెట్లను, బ్రెడ్లను పేద వారికి పంచుతుంటారు. ఆయన తండ్రి కోరిక మేరకు 25 ఏళ్ల నుంచి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిలోఫర్ హాస్పిటల్ మరియు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి చుట్టూ ఉన్న పేషంట్లకు, పేదవారికి ఆహారం అందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు ఐదు వందల మందికి అల్పాహారం, మూడు వందల మందికి భోజనం అందిస్తున్నారు.
