మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, మహేష్ బాబు వంటి అందరి స్టార్ హీరోలకి మంచి మంచి పాటలు అందించారు మణిశర్మ. ప్రతి ఒక్క స్టార్ హీరో కెరీర్ లోని మణిశర్మ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చిరంజీవి సినిమాలలో మణిశర్మ సాంగ్స్ అయితే ఇప్పటికీ అందరూ వింటూనే ఉంటారు. అలాంటి మణిశర్మ 2010 తర్వాత నుంచి ఇండస్ట్రీలో కొంచెం వెనుకబడ్డారు. తన సాంగ్స్ అంతలా అందరినీ మెప్పించలేకపోతున్నాయి.

మధ్యలో ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఊపు అందుకున్నా, అది తన కంబ్యాక్ కు అంత సహాయం చేయలేదు. ఇప్పుడు మణిశర్మ చిన్నాచితకా హీరోలకి మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. దీని గురించి మణిశర్మ మొన్న ఇంటర్వ్యూలో ఏమైనా బాధ కలిగే విషయాలు ఉన్నాయా అని యాంకర్ అడగగా, స్టార్ హీరోలు తలుచుకుంటే ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ తోని పని చేయొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వచ్చు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక రెండు సినిమాలు తమన్ తో, రెండు దేవిశ్రీప్రసాద్ తో కనీసం ఒకటైన నాతో చేస్తే, వినేవాళ్ళకి రీఫ్రెష్మెంట్ అనేది వస్తుంది.
మ్యూజిక్ లో కొత్తదనం కూడా కనిపిస్తుంది. నాకు ఇవ్వమని నేను చెప్పట్లేదు అలాగని వాళ్ళకి చెప్పలేను కూడా అని అన్నారు. ఒకప్పుడు పెద్దపెద్ద స్టార్ హీరోలకి మ్యూజిక్ డైరెక్ట్ చేసిన మణిశర్మ ఇప్పుడు ఇలా అవకాశాలు లేక ఉంటున్నారంటే వినడానికి చాలా బాధగా ఉంది. మళ్లీ మణిశర్మ ఫామ్ లోకి వస్తారా అంటే ఏమో? పెద్ద పెద్ద స్టార్ హీరోలు మళ్ళీ మణిశర్మకు ఛాన్స్ ఇవ్వడం కష్టమే.
ఎందుకంటే ఈ మధ్య దేవి శ్రీ ప్రసాద్, తమన్ లతోపాటు కొత్త కొత్త యువ మ్యూజిక్ డైరెక్టర్లకి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి, వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్లకి కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. అవి వినడానికి కూడా అందరూ ఆసక్తి చూపుతున్నారు. మణిశర్మ మళ్లీ ఈ జనరేషన్ కి తగ్గట్టు మ్యూజిక్ వినిపిస్తే వెలుగులోకి తిరిగి వస్తారేమో. ఎందుకంటే మణిశర్మ మ్యూజిక్ పాత జనరేషన్ కి తగ్గట్టు ఉంటాయి. ఈ జనరేషన్ కి మారితే ఆ చేంజ్ కనిపించి ఛాన్సెస్ రావచ్చు.


















రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిశాలోని రాయరంగ్‌పూర్ లో సాధారణ సంతాల్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఒడిశా ప్రభుత్వంలో నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆమె రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో సమగ్ర విద్యా కేంద్రంలో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలు.
ద్రౌపది ముర్ము శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పలు నివేదికల ప్రకారం, ఆమె కుమారులలో పెద్దవాడు లక్ష్మణ్ ముర్ము 25 ఏళ్ళ వయసులో 2009లో మరణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రెండవ కుమారుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రెండు ఏళ్ళ తరువాత, ముర్ము భర్త గుండెపోటు కారణంగా మరణించారు. 2009-2015 మధ్య కేవలం ఆరేళ్లలో ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులు, తల్లి మరియు సోదరుడిని కోల్పోయింది.
ఆమె కూతురు ఇతిశ్రీ ప్రస్తుతం ఒడిశాలోని యూకో బ్యాంకులో పనిచేస్తోంది. ఆమె 2015లో రగ్బీ ప్లేయర్ గణేష్ హెంబ్రామ్ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. 2015లో మే 18న జార్ఖండ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ముర్ము ఒడిశాలోని బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్, దేశంలో గవర్నర్‌గా పనిచేసిన మొదటి మహిళా గిరిజన నాయకురాలు.