ద్రౌపది ముర్ము భర్త ఎలా చనిపోయారో తెలుసా..? వీరి పిల్లలు కూడా చనిపోయారా… ఎలా అంటే..?

ద్రౌపది ముర్ము భర్త ఎలా చనిపోయారో తెలుసా..? వీరి పిల్లలు కూడా చనిపోయారా… ఎలా అంటే..?

by kavitha

Ads

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి అయిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు. 2022లో జరగిన భారత రాష్ట్రపతి ఎలెక్షన్స్ లో ఎన్డీఏ క్యాండిడేట్ గా పోటీ చేసి విజయం సాధించారు.

Video Advertisement

రాష్ట్రపతి పదవిని చేపట్టిన ద్రౌపది ముర్ము తన జీవితంలో చాలా వ్యక్తిగత విషాదాలను అధిగమించి, నేడు ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు. ఆమె భర్త, పిల్లలు, కుటుంబం  గురించి ఇప్పుడు చూద్దాం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిశాలోని రాయరంగ్‌పూర్‌ లో సాధారణ సంతాల్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె  భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఒడిశా ప్రభుత్వంలో నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆమె రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో సమగ్ర విద్యా కేంద్రంలో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలు.
ద్రౌపది ముర్ము శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు.  వారికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పలు నివేదికల ప్రకారం, ఆమె కుమారులలో పెద్దవాడు లక్ష్మణ్ ముర్ము  25 ఏళ్ళ వయసులో 2009లో మరణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రెండవ కుమారుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రెండు ఏళ్ళ తరువాత, ముర్ము భర్త గుండెపోటు కారణంగా మరణించారు. 2009-2015 మధ్య కేవలం ఆరేళ్లలో ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులు, తల్లి మరియు సోదరుడిని కోల్పోయింది.
ఆమె కూతురు ఇతిశ్రీ ప్రస్తుతం ఒడిశాలోని యూకో బ్యాంకులో పనిచేస్తోంది. ఆమె 2015లో రగ్బీ ప్లేయర్ గణేష్ హెంబ్రామ్‌ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. 2015లో మే 18న  జార్ఖండ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ముర్ము ఒడిశాలోని బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్, దేశంలో గవర్నర్‌గా పనిచేసిన మొదటి మహిళా గిరిజన నాయకురాలు.

Also Read: యశస్విని రెడ్డి భర్త అమెరికాలో ఏ ఉద్యోగం చేస్తారో తెలుసా..?

 


End of Article

You may also like