జార్ఖండ్‌ రాజకీయాల్లో ట్విస్ట్… సీఎం హేమంత్ స్థానంలో సోరెన్ భార్య.! సోరెన్‌పై కేసు ఏంటి.?

జార్ఖండ్‌ రాజకీయాల్లో ట్విస్ట్… సీఎం హేమంత్ స్థానంలో సోరెన్ భార్య.! సోరెన్‌పై కేసు ఏంటి.?

by Mounika Singaluri

Ads

జార్ఖండ్ లో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న హేమంత్ సోరేన్ మనీ ల్యాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

Video Advertisement

ఈ కేసు విషయంలో ఒకవేళ ముఖ్యమంత్రి హేమంత్ రాజీనామా చేస్తే ఝార్ఖండ్ కి తదుపరి ముఖ్యమంత్రి ఏది ఎవరు అంటూ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. అయితే అనూహ్యంగా ఒకరి పేరు తెరపైకి వచ్చింది.

అక్రమ మైనింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు కింద హేమంత్ సోరెన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో డిసెంబర్ 30న ఈడీ ఆయనకు సమన్లు పంపింది. మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు అందుబాటులో ఉండే సమయం చెప్పాలని ఈడీ ఆయనను కోరింది. ఈ కేసులో ఈడీ ఆయనకు ఇప్పటికీ ఏడు సార్లు సమాన్లు పంపింది. అయితే ఇంతవరకూ ఆయన ఈడీ ముందు హాజరుకాలేదు.

ఆగస్టు 14న ఈడీ తొలి నోటీసు ఇవ్వగా ఈడీ చర్యల నుంచి ప్రొటక్షన్ కోరుతూ సుప్రీంకోర్టు ముందు, ఆ తర్వాత జార్ఖండ్ హైకోర్టు ముందు ఆయన పిటిషన్ వేశారు. అయితే ఆయన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. తప్పుడు అభియోగాలు, ఉద్దేశాలతో తనకు సమన్లు పంపారని, జార్ఖండ్‌లో అనిశ్చితి సృష్టించడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని సోరెన్ అంటున్నారు. ఈ కేసులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా గతంలో పనిచేసిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఛావి రంజన్‌తో సహా 14 మందిని ఈడీ అరెస్టు చేసింది.

అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ సీఎం పదవికి హేమంత్ రాజీనామా చేస్తే నెక్స్ట్ సీఎం గా హేమంత్ భార్య కల్పన సోరేన్ ను కూర్చోబెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని బిజెపి ఎంపీ నిషికాంత్ దొబే సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం పైన ఆయన ఒక ట్విట్ చేశారు.జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారని, దానిని సీఎం ఆమోదించారని తెలిపారు. సోరెన్ సైతం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారని, ఆయన భార్య కల్పన సోరెన్ జార్ఖండ్ తదుపరి సీఎం కానున్నారని అందులో పేర్కొన్నారు.


End of Article

You may also like