కిడ్నీ సమస్యలు ఉంటే మాంసాహారం తీసుకోకూడదు.. ఎందుకంటే..?

కిడ్నీ సమస్యలు ఉంటే మాంసాహారం తీసుకోకూడదు.. ఎందుకంటే..?

by Mounika Singaluri

చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువ మంది ఎదుర్కొనే వాటిలో కిడ్నీ సమస్యలు కూడా ఒకటి. కిడ్నీ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా కిడ్నీ సమస్యలతో సతమతమవుతూ ఉండాల్సి వస్తుంది. కిడ్నీ సమస్యలు కాలేయ సమస్యలతో బాధపడే వాళ్ళలో యూరిక్ యాసిడ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

Video Advertisement

సరైన చికిత్స ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు అవుతుంది. ఉన్నదానికంటే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు రావచ్చు. అయితే మాంసాహార కి యూరిక్ యాసిడ్ కి మధ్య లింక్ ఉందట ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

kidney 1

మాంసాహారానికి యూరిక్ యాసిడ్ కి మధ్య సంబంధం ఏమిటి..?

మాంసాహారం తినే వాళ్ళలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కాబట్టి ఈ విషయం పై జాగ్రత్తగా శ్రద్ధ పెట్టాలి. కిడ్నీ సమస్యలు వచ్చినా సరే యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది.

అసలు యూరిక్ యాసిడ్ ఎంత ఉండాలి..?

యూరిక్ యాసిడ్ ఎంత ఉండాలి అనే విషయానికి వస్తే.. పురుషులలో 4 నుండి 6.5 mg/dl వరకు ఉండొచ్చు. స్త్రీలలో అయితే 3.5 నుండి 6 mg/dl ఉండాలి.

kidney

యూరిక్ యాసిడ్ పెరిగిందా లేదా అనేది ఎలా చెక్ చేయాలి..?

యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని చెప్పేందుకు ఎటువంటి లక్షణాలు కనపడవు. కేవలం బ్లడ్ టెస్ట్ ద్వారానే మనం కనుగొనడానికి అవుతుంది.

యూరిక్ యాసిడ్ లిమిట్ దాటిందంటే మాంసాహారం తినకూడదా..?

#1. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతూ ఉన్నట్లయితే రెడ్ మీట్ కి నాన్ వెజ్ కి దూరంగా ఉండాలి.
#2. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోకూడదు.
#3. శారీరిక శ్రమ వ్యాయామం వలన కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోకుండా చూసుకోవచ్చు ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.


You may also like

Leave a Comment