నటన మీద కొందరి నటులకు ఉన్న శ్రద్ధ, తపన చూస్తే వీళ్లు నటన కోసమే పుట్టారు అనిపిస్తుంది. ఒక రేంజ్ లో ఉన్న హీరోలని చూసి చాలామంది వాళ్లకి అదృష్టం కలిసి వచ్చింది అంటారు కానీ నిజానికి వాళ్ల డెడికేషన్ వాళ్ళని ఆ స్థాయిలో నిలబెడుతుందని అనుకోరు.
సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తమ బాడీని ఎలా మలుచుకోవటానికైనా సిద్ధంగా ఉంటారు ఇలాంటి నటులు. కమల్ హాసన్, విక్రమ్, విజయ్ ఆంటోనీ ఇలాంటి వాళ్ళందరూ సినిమా కోసం శరీరాన్ని హింసించుకున్న వాళ్లే. వాళ్ల తపన వాళ్ళని స్టార్ హీరోని చేసింది.
అలాగే ఇప్పుడు మరొక నటుడు పాత్ర కోసం 15 కేజీలు బరువు తగ్గి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. పై ఫోటోలో డీ గ్లామరైజ్ గా కనిపిస్తున్న ఈ హీరోని గుర్తుపట్టారా ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటుంది ఈ హీరో గురించే. వెర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇతను ఏ పాత్ర ఇచ్చిన అందులో ఇమిడిపోతాడు. ఇతను కేవలం నటుడే కాదు మంచి నిర్మాత అలాగే మంచి సింగర్ కూడా.
ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా అయితేనేనండి మలయాళ స్టార్ హీరో టొవినో థామస్. మిన్నల్ మురళి, తుళ్ళుమాల,2018 సినిమాలతో తెలుగు వాళ్ళకి కూడా దగ్గర అయ్యాడు ఈ నటుడు. 2018 సినిమాలో అయితే ఇతని నటన చూసి అందరూ కన్నీరు పెట్టుకున్న వారే. కథలో కంటెంట్ హీరో నటన కలిపి ఈ సినిమాని ఆస్కార్ బరి లో నిలిపింది.

ఇప్పుడు తాజాగా ఈ హీరో నటించిన అదృశ్య జలకంగళ్ వాటర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో నవంబర్ 24 న ధియేటర్లలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ తో రికార్డుల వర్షం కురిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా కోసం టొమినో తన శరీరాన్ని 15 కేజీల వరకు తగ్గించాడు. ఇది డెడికేషన్ అంటూ అతనిని తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్స్.







తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డీనరీ బస్సులలో మహిళలు తెలంగాణలో ఎక్కడి నుండి మరెక్కడికైనా ఉచితంగా జర్నీ చేయవచ్చు. దీంతో మహిళలు ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణం చేయడం లేదు. దీంతో ఆటోలు, క్యాబ్ లు నడుపుకుని జీవనం సాగించేవారు విలపిస్తున్నారు. ఫ్రీ జర్నీ కావడంతో చిన్న పనికి కూడా మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నారు.
బస్సులలో డబ్బులు చెల్లించి ప్రయాణం చేసే వారికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక వ్యక్తి ఆందోళన చేశాడు. మగవారికి బస్సులో ఒక్క సీటు కూడా దొరకడం లేదంటూ మండిపడ్డాడు. సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తే మేమేలా ప్రయాణం చేయాలంటూ ప్రశ్నించాడు. అంతే కాకుండా బస్సు వెళ్ళకుండా అడ్డుగా నిలబడి తన నిరసన తెలిపాడు. తాజాగా ఓ యువతి బస్టాండ్ లో ఏడుస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. జగిత్యాలకు చెందిన ఆ యువతి కాలేజ్ లో చదువుతుంది. కాలేజీకి ఆమె బస్సులో వెళ్తుంది.
ఫ్రీ జర్నీ వల్ల తనకు రోజు సీటు దొరకట్లేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కాలేజీకి వెళ్ళేటపుడు 40 నిమిషాలు, తిరిగి ఇంటికి వచ్చేప్పుడు 40 నిమిషాలు పడుతుంది. రోజు బస్సులో సీటు దొరకక గంటకు పైన నిలబడాల్సి వస్తుందని వెక్కి వెక్కి ఏడ్చింది. రోజూ టైమ్ కి కాలేజీకి వెళ్లలేకపోతున్నామని చెప్పింది. ‘బస్సులో ఉచిత ప్రయాణం చేసి నాలాంటి వాళ్లు జర్నీ చేయకుండా చేస్తున్నారు. ఇదే మా ఊరికి చివరి బస్సు, కొత్త బస్సు మాకు కావాలి’ అంటూ ఏడ్చింది. ఆ యువతి ఎక్కే బస్సు పూర్తిగా నిండిపోయి మహిళలు కూడా ఫుడ్ బోర్డ్ పై జర్నీ చేస్తున్నారు.

