ఐపీఎల్ 2024 కి అంత సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టీం లన్ని కూడా రిలీజ్ చేసిన ప్లేయర్లు, తమతో అంటిపెట్టుకున్న ప్లేయర్ల జాబితాలను ప్రకటించాయి. ఇంకా కొన్ని టీం అయితే క్యాష్ ట్రేడింగ్ ద్వారా ప్లేయర్లను తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దుబాయ్ లో జరిగే మినీ వేలంలో వరల్డ్ కప్ లో ప్రతిభ చాటిన ప్లేయర్లను కొనేందుకు ప్రతి టీం దాదాపు ప్రయత్నిస్తుంది. అయితే తాజాగా యూరోపియన్ టీ10 లీగ్‌లో ఓ బ్యాట్స్ మెన్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు.కేవలం 43 బాల్స్‌లో దాదాపు డబుల్ సెంచరీ చేసినంత పని చేశాడు.
కాటలున్యా జాగ్వార్ టీం తరపున ఆడుతున్న హంజా సలీమ్ దార్ ప్రతి బాల్‌ను బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 43 బాల్స్‌లో 193 పరుగులు చేసి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీ10 మ్యాచ్ లలో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు.టీ20ల్లో కూడా ఈ స్థాయిలో వ్యక్తిగత స్కోరు నమోదు కాలేదు. ఇప్పటివరకు టీ10 క్రికెట్లో అత్యధిక స్కోరుగా ఉన్న 163 పరుగుల రికార్డును హంజా సలీమ్ దార్ బ్రేక్ చేశాడు.

కాగా డిసెంబర్ 5న జరిగిన మ్యాచ్ లో సోహల్ హాస్పటల్టెట్ జట్టుపై అతడు స్కోరు చేసిన 193 పరుగుల్లో 22 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. 43 బాల్స్‌లో 36 బాల్స్‌ను బౌండరీలకు తరలించడం విశేషం.బౌలింగ్‌లోనూ హంజా సలీమ్ దార్ మూడు వికెట్లు పడగొట్టాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు ఈ రికార్డు సృష్టించిన ప్లేయర్ పైన ఐపీఎల్ టీమ్ లు దృష్టి సారిస్తాయేమో చూడాలి. ఎందుకంటే పొట్టి ఫార్మేట్ లలో ఇలా దూకుడుగా ఆడే ప్లేయర్లే కావాలి కాబట్టి.

















బాలనటిగా శ్వేత బసు మొదటి హిందీ సినిమా ‘మక్డీ’ లో డబుల్ రోల్ చేసి అలరించిడమే కాక, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో శ్వేత బసుకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అప్పట్లో అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అది జరిగిన తరువాత ఆమె బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడే ఉంటూ హిందీలో సీరియల్స్ లో నటిస్తూ, ఇంకో వైపు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసింది. శ్వేత బసు డిసెంబర్ 2018 లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ని వివాహం చేసుకుంది.కానీ ఏం జరిగిందో కానీ ఏడాదికే విడిపోయారు.
అయితే ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుంది. అందుకేనేమో ఇటీవల హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ, ఇన్‌స్టాలో హీట్ పెంచుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించింది. తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్లిన శ్వేత బసు బీచ్‌లో సందడి చేసింది. ‘ఇండియా లాక్డౌన్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మరియు ప్రమోషన్స్‌లోనూ అందాల ఆరబోతతో రచ్చ లేపింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్వేత బసును ఇన్‌స్టాగ్రామ్‌లో 440K ఫాలో అవుతున్నారు.
