2023 వన్డే ప్రపంచ కప్ లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ ల లోనూ నెగ్గి సెమీస్ కి చేరి టేబుల్ లో టాప్ ప్లేస్ లో నిలబడింది. అయితే ఇప్పుడు ఆసక్తికర పోరుకు భారత్ టీమ్ సిద్ధమైంది. భారత్ కి ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగా వీటిలో ఓడిన పెద్ద నష్టం ఉండదు. కాకపోతే టేబుల్ టాపర్ గా కొనసాగాలంటే మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ లలో భారత్ గెలవాల్సి ఉంది.
ఈ క్రమంలో భారత్ నవంబర్ 5న సౌత్ ఆఫ్రికా తో తలపడనుంది. ఈ క్రమంలో టీమిండియాలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.పెద్ద పెద్ద మార్పులు లేకుండా ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లను ఆడింది. దాంతో పలువురు ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చి బెంచ్ ను పరీక్షరించాలనే ఆలోచనలో రోహిత్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదే జరిగితే సౌత్ ఆఫ్రికా తో జరిగే పోరులో బూమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ ని కూడా పక్కనపెట్టి అతని స్థానంలో ఇషాన్ కిషన్ కు స్థానం కల్పించే అవకాశం ఉంది. బూమ్రా స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను తుది జట్టులోకి తీసుకుంటారనే మాట వినబడుతుంది.ఒకవేళ సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇద్దరికీ ప్లేయింగ్ 11లో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం రోహిత్ శర్మ రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. గతంలో జరిగిన సిరీస్ లో రోహిత్ శర్మ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
అదే జరిగితే అప్పుడు కేల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో అతడు మిగిలిన రెండు లీగ్ మ్యాచ్ లకి దూరంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా సెమిస్ పై కన్నేసింది. భారత్ పైన ఎక్కితే సౌత్ ఆఫ్రికా అధికారికంగా సెమీఫైనల్ కు చేరుతుంది. దాంతో విజయమే లక్ష్యంగా ఆ జట్టు ప్రాక్టీస్ లో దిగింది.
Also Read:ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా గెలిస్తే పాకిస్తాన్ ఎందుకు ఆనందపడుతోంది..? కారణం ఏంటంటే..?









సినిమా విడుదలను అడ్డుకోలేదని అన్నారు. ఈ సినిమాలో ఎవర్ని కించపరిచే సన్నివేశాలు లేవని తనకు కనిపించింది అనిపించింది తీసాను అని పేర్కొన్నారు. ట్విట్టర్‌ను తనకు ఇష్టం వచ్చినట్లు వాడే రాంగోపాల్ వర్మ దీనికి సంబంధించి ఒక పోస్ట్ చేశారు. అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యుని ఆపలేరని, తన వ్యూహం సినిమాను కూడా ఎవరు అడ్డుకోలేరని అన్నారు.











దీంతో నందు ఫోన్ లాగేసుకుంటాడు, ప్లీజ్ అంకుల్ నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. తులసి ఆంటీ తో మాట్లాడాలి నువ్వు మోసగాడివి అని అరుస్తుంది.ఆ మాటతో నందు రాక్షసుడిలా మారతాడు హనీ పైకి చెయ్యి లేపుతాడు. చెంప పగిలిపోతుంది బుద్ధిగా చెప్పినట్టు విను, నన్ను రాక్షసుడును చేయకు నా కోపం నీపై కాదు, మీ తులసి ఆంటీ పై నిప్పులు కుంపటి తెచ్చి ఇంట్లో పెట్టింది. ఇల్లు తగలబడి పోతున్న పట్టించుకోవడం లేదు.