“ఇంటింటి గృహలక్ష్మి” సీరియల్ లో నందు రాక్షసుడిలా ఎందుకు మారాడు..? పాపం హనీ…!

“ఇంటింటి గృహలక్ష్మి” సీరియల్ లో నందు రాక్షసుడిలా ఎందుకు మారాడు..? పాపం హనీ…!

by Mounika Singaluri

Ads

మాటీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి క్రేజ్ తో రన్ అవుతుంది. ఆడియన్స్ అయితే ఈ సీరియల్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ సీరియల్ వచ్చే సమయానికి అన్ని పనులు వదులుకున్న టీవీ ముందు కూర్చుంటున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లో నందు రాక్షసుడిలా మారి అని ఏడిపించే సీన్ అందర్నీ గుండెలు పిండేస్తుంది. అసలు ఇంతకీ నందు  ఎందుకు రాక్షసుడిలా మారాడు..

Video Advertisement

ఎట్టి పరిస్థితుల్లోనూ హనీని రత్నప్రభ కి అప్పగించను అని మొండి పట్టు పడుతుంది తులసి. ఇంతలో పరంధామయ్య ఉంటే తులసికి కాల్ వస్తుంది. ఫోన్ తీసి తులసి దారిలోనే ఉన్నాను మావయ్య. దివ్య క్షేమంగా ఉంది. ఇంతకీ హనీ ఏం చేస్తుంది ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటుంది. ఇవ్వడానికి హాని ఇంట్లో లేదమ్మా నందు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళింట్లో అప్పగించడానికి అయ్యుంటుంది మా కళ్ళు కప్పి తీసుకుపోయాడు అని బాంబు పేల్చుతాడు పరంధామయ్య.


ఆ మాట విని తులసి కుప్పకూలిపోతుంది. హనీని వాళ్ళకి అప్పగిస్తే నా శ్రమ అంత వృధా అవుతుంది హనీ జీవితం నాశనమైనట్టే అని తులసి తలబాదుకుంటుంది. వెంటనే నందు కి ఫోన్ చేయగా తను లిఫ్ట్ చేయడు తర్వాత హానికి కాల్ చేస్తుంది. అంకుల్ తులసి ఆంటీ కాల్ చేస్తుందని చెప్పగానే, లిఫ్ట్ చేయొద్దమ్మా తులసి ఆంటీ వస్తే మనం ఫ్రీగా ఎంజాయ్ చేయలేము అని ప్రతిదానికి అడ్డం పడుతుంది అని అంటాడు.నిజమే అని నమ్మిన హనీ తులసి కాల్ కట్ చేస్తుంది. మరోవైపు తులసీ రత్నప్రభలు నందు హనీల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో నందు హనీనీ తీసుకు రానే వస్తాడు. కారు ఆగేసరికి హనీకి గుండె ఆగినంత పనవుతుంది.

అంకుల్ సర్ప్రైజ్ అన్నారు కదా ఇక్కడికి తీసుకు వచ్చారేంటి అని అమాయకంగా అడుగుతుంది. ఆ మాటతో నందు నీకిది సర్ప్రైజ్ నే… ఈరోజు నుండి నువ్వు ఇక్కడే ఉండాలి అని కఠినంగా మాట్లాడతాడు. మీరు చాలా బాడ్ నాకు అబద్ధం చెప్పారు. మోసం చేశారంటూ హనీ ఏడుస్తుంది. అవును నిన్ను మోసం చేశాను నాలో మీ తులసి ఆంటీ కి ఉన్న మంచితనం లేదు నా కూతుర్ని నేను రక్షించుకోవాలి అందుకోసం ఏమైనా చేస్తాను అంటాడు నందు. ఆ మాటతో హాని ప్లీజ్ అంకుల్ కొత్త ఆంటీ వాళ్ళు నన్ను చంపేస్తారు వాళ్లకు అప్పగించొద్దు నేను ఇప్పుడే తులసి ఆంటీ కి కాల్ చేస్తాను అని ఫోన్ తీస్తుంది.

దీంతో నందు ఫోన్ లాగేసుకుంటాడు, ప్లీజ్ అంకుల్ నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. తులసి ఆంటీ తో మాట్లాడాలి నువ్వు మోసగాడివి అని అరుస్తుంది.ఆ మాటతో నందు రాక్షసుడిలా మారతాడు హనీ పైకి చెయ్యి లేపుతాడు. చెంప పగిలిపోతుంది బుద్ధిగా చెప్పినట్టు విను, నన్ను రాక్షసుడును చేయకు నా కోపం నీపై కాదు, మీ తులసి ఆంటీ పై నిప్పులు కుంపటి తెచ్చి ఇంట్లో పెట్టింది. ఇల్లు తగలబడి పోతున్న పట్టించుకోవడం లేదు.

నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు ఇక్కడ. కారు దిగమని బలవంతంగా లాక్కొస్తాడు… ప్లీజ్ అంకుల్ నన్ను వదలండి అంకుల్ మనం తులసి ఆంటీ దగ్గరికి వెళ్లి పోదాం అంకుల్ అంటూ హనీ నందుని బ్రతిమాలుడుతుంది…ఈ సీన్ చూడగానే నందు రాక్షసుడుల ప్రవర్తించడం.. హనీ ఏడవడం చూసి ప్రేక్షకులు గుండె తరుక్కుపోతుంది. ఇంత ఎమోషనల్ గా రన్ అవుతుంది కాబట్టి ఈ సీరియల్ కి అభిమానులు ఎక్కువగా ఉన్నారు.

 

Also Read:మళ్లీ అదే హీరోతో అనిల్ రావిపూడి సినిమా…! ఇంతకీ ఎవరా హీరో…!


End of Article

You may also like