సినీ రంగంలో నెగ్గుకు రావాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడవ్వాల్సిందే. ఎంత ప్రతిభ ఉన్న అదృష్టం కలిసి రాకపోతే ఒకటి, రెండు సినిమాలకే కనుమరుగైపోతారు.
ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సినిమాకు నెగటివ్ టాక్ రావడంతోనే ఆ నెపం హీరోయిన్లపై వేస్తుండటం మనం తరచూ చూస్తూ ఉంటాం. అలాగే ప్రతిసినిమా విషయంలో కొందరు కొన్ని సెంటిమెంట్లు కూడా ఫాలో అవుతూ ఉంటారు.
ఈ విషయాలు పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఒక సెంటిమెంట్ నడుస్తుంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పవన్ తో నటించిన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు సినిమాలకు దూరమయ్యారు. కొంతమంది హీరోయిన్లకు అయితే మొదటి సినిమానే చివరి సినిమాగా మారింది. ఆ హీరోయిన్లు ఎవరో మీరూ చూడండి.
1 .సుప్రియ యార్ల గడ్డ

అక్కినేని వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుప్రియ, పవన్ కళ్యాణ్ మొదటి సినిమా “అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి” లో హీరోయిన్గా నటించారు. తర్వాత సినిమాలకు దూరమైనా ఆమె మొన్నామధ్య అడవి శేష్ నటించిన “గూఢచారి” సినిమాలో కీలక పాత్ర పోషించారు.
2 .ప్రీతి జింగానియా

“తమ్ముడు” చిత్రం లో పవన్ తో జత కట్టిన ఈమె, తర్వాత “నరసింహ నాయుడు”, “అధిపతి” చిత్రాల్లో నటించి నటనకు గుడ్ బాయ్ చెప్పేసారు.
౩. అదితి గోవిత్రికర్

” తమ్ముడు” చిత్రంలో ‘లవ్లీ’ పాత్రతో మనల్ని అలరించిన అదితి తర్వాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు.
4 . దేవయాని

“సుస్వాగతం” చిత్రంలో హీరోయిన్ గా నటించిన దేవయాని తర్వాత రెండు, మూడు చిత్రాల్లో నటించారు. అనంతరం సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు.
5 .కీర్తి రెడ్డి

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ అయిన “తొలిప్రేమ” సినిమాతో కీర్తి రెడ్డి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ సినిమా ఘన విజయంతో కీర్తి మరిన్ని చిత్రాలతో ప్రేక్షకులకు చేరువ అవుతుంది అనుకున్నారంతా. కానీ ఆ ఆలోచనలు తల్లకిందులు చేస్తూ “అర్జున్” సినిమాలో మహేష్ కు అక్కగా నటించి అనంతరం సినిమాలకు దూరమయ్యారు.
6 .రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ తో బద్రి, జానీ సినిమాల్లో జతకట్టిన రేణు దేశాయ్, తర్వాత ఏ సినిమాల్లోనూ నటించలేదు.
7 . మీరా చోప్రా

పవన్ కళ్యాణ్ “బంగారం” సినిమాతో ఈమె టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసి కనుమరుగైంది.
8 .నేహా ఒబెరాయ్

“బాలు” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమె తర్వాత జగపతిబాబుతో ఒక చిత్రంలో నటించి సినిమాలకు ప్యాక్ అప్ చెప్పేసింది.
9 .నికీషా పటేల్

ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన “కొమరం పులి” చిత్రం తో ఈమె తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తర్వాత కళ్యాణ్ రామ్ తో మరొక చిత్రం చేసింది.
10 .సారా జేన్ దియాస్

పవన్ కళ్యాణ్ “పంజా” చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈమె తర్వాత టాలీవుడ్ కు దూరమైంది.



































ఇక ఈ సినిమా స్టోరి ఏమిటంటే కాశీపురం అనే ఊరిలో మామన్నన్ (వడివేలు) ఎమ్మెల్యేగా కొనసాగుతుంటాడు. మామన్నన్ కుమారుడు అయిన ఆదివీరన్ (ఉదయనిధి స్టాలిన్) అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి. పేద విద్యార్థుల కోసం లీల (కీర్తి సురేష్) ఉచిత కోచింగ్ సెంటర్ ను నడుపుతూ ఉంటుంది. రూలింగ్ పార్టీ లీడర్ రత్నవేలు (ఫహద్ ఫాజిల్) వల్ల లీలకు సమస్యలు ఏర్పడతాయి. ఆ సమయంలో లీలకు అండగా ఆదివీరన్, మామన్నన్ లు ఉంటారు. వాళ్ళిద్దరు రత్నవేల్ ని ఎలా అడ్డుకున్నారు అనేది మిగతా కథ.
దర్శకుడు మారి సెల్వరాజ్ చిత్రాలన్ని దాదాపు పేద ధనిక అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతాయి. మామన్నన్ సినిమా కూడా అలాంటి స్టోరీతోనే వచ్చింది. ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చాడు. ప్రధమార్ధంలో క్యారెక్టర్ల పరిచయం, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.
ఇక ద్వితీయార్ధం రొటీన్ ఫీల్ ను కలగచేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. ద్వితీయార్ధం ఇంకొంచెం బెటర్ గా తీసి ఉంటే మూవీ ఫలితం మరో రేంజ్ లో ఉండేది. రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. ఫహద్ ఫాజిల్, వడివేలు నటన ఆకట్టుకుంటుంది. తెలుగులో నాయకుడు పేరుతో ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది. అందులో చూసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని పొగుడుతున్నారు.