ఎన్ని రకాల జోక్స్ వచ్చినా కూడా, భార్య భర్తల మీద వచ్చే జోక్స్ మాత్రం ఎప్పటికీ కామెడీగానే అనిపిస్తాయి. ఆరోగ్యకరమైన కామెడీతో వచ్చే జోక్స్ ని చూసి అందరూ నవ్వుకుంటారు. అందుకే, ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ అయిపోయింది. ఏ భాషలో అయినా భార్య భర్తల మీద జోక్స్ వస్తాయి. అవన్నీ అందరికీ వర్తించేటట్టుగానే ఉంటాయి. అప్పట్లో జోక్స్ పేపర్లలో వచ్చేవి. లేదా టీవీలో చెప్పేవారు.

ఇప్పుడు సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయిన కారణంగా జోక్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలోనే కనిపిస్తున్నాయి. ఈ జోక్స్ ని షేర్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు. ఇలా ఒక జోక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఒకరోజు అర్ధరాత్రి భర్త నిద్రపోతున్నాడు. సమయం 2 అవుతోంది. భార్య ఆ సమయంలో భర్తని నిద్రలేపింది. భర్తకి అర్థం కాక అయోమయంగా భార్య వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు భార్య కొన్ని ప్రశ్నలు అడగడం మొదలు పెడుతుంది.
భార్య : ఈగ సినిమాలో సమంత పేరేంటి?
భర్త : బిందు. ఈ టైంలో నిద్ర లేపి ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావ్?
భార్య : బాహుబలి సినిమాలో హీరోయిన్ ఎవరు?
భర్త : అనుష్క, తమన్నా. ఇంక నేను పడుకుంటున్నాను.
భార్య : అప్పుడే కాదు.
భర్త : పని పాట లేదా నీకు? అర్ధరాత్రి లేపి ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్ లు ఎందుకు అడుగుతున్నావ్?
భార్య : ఇంకొక రెండు ప్రశ్నలకు సమాధానం చెప్తే విషయం నీకే అర్థం అవుతుంది.
భర్త : అబ్బా. సరే అడుగు.
భార్య : 2003 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మీద సచిన్ ఎన్ని పరుగులు చేశాడు?
భర్త : 98 పరుగులు.
భార్య : మన పక్కింట్లో ఉండే సరోజ వాళ్లు ఇక్కడికి వచ్చి ఎంత కాలం అయ్యింది.
భర్త : నిన్నటితో 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు చెప్పు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావ్?
భార్య : నిన్న నా పుట్టినరోజు. అడ్డమైనవన్నీ గుర్తుంటాయి కానీ, అసలు విషయం మాత్రం గుర్తులేదు నీకు.
కోపంగా చూస్తున్న భార్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అయోమయంగా ఆలోచించాడు భర్త.





దుల్కర్ సల్మాన్ సీతా రామం వంటి ప్రేమ కథ తరువాత థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కిన ‘చుప్’ మూవీ ద్వారా ఆడియెన్స్ ను పలకరించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ముంబైలో వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి. హిందీ చిత్రాలకు తక్కువ రేటింగ్ ఇస్తూ రివ్యూలు రాసే క్రిటిక్స్‌ను లక్ష్యం చేసుకుని, వారు రివ్యూను ఏ స్టైల్లో రాశారో, ఒక సీరియల్ కిల్లర్ అదే స్టైల్లో వారిని హత్య చేస్తుంటాడు.
దాంతో క్రిటిక్స్ ఆ సీరియల్ కిల్లర్ ను చంపేవరకు రివ్యూలు రాయమని అని చెప్పడంతో, కిల్లర్ ను పట్టుకోవడానికి పోలిస్ ఆఫీసర్ సన్నీ డియోల్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నారా? లేదా అనేది మిగిలిన కథ. సినిమాలకు రివ్యూలు రాసే క్రిటిక్స్ ను చంపడం, వాళ్ళ నుదుటి పై స్టార్స్ రేటింగ్ వేసే కిల్లర్ కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఆర్ బాల్కీ కథ ఐడియా విషయంలో తన ప్రత్యేకత చాటుకున్నారు. అయితే దానిని మూవీ మొత్తం చూపించలేకపోయారు.
సినిమాటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకుంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత హంతకుడు ఎవరు అనే విషయం తెలిసిన తరువాత కథనం స్లోగా సాగుతుంది. సగటు థ్రిల్లర్ చిత్రాల తరహాలోనే ఈ మూవీ సాగింది. తిరిగి క్లైమాక్స్ లో ఇంట్రెస్ట్ వస్తుంది. దుల్కర్ సల్మాన్ ఈ మూవీలో మరోసారి అద్భుతమైన నటనతో పాత్రకు జీవం పోశారు. దుల్కర్ లేకపోతే మూవీ నిలబడేది కాదు. దుల్కర్ క్యారెక్టర్ లో మరొకరిని ఊహించలేము. శ్రేయా ధన్వంతరి, సన్నీ డియోల్ చక్కగా నటించారు. అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ లో ఒక్క సీన్ లో కనిపించారు. దుల్కర్ నటన కోసం చూడాల్సిన మూవీ ఇది.






