మహిళలకు, బంగారంకు మధ్య విడదీయరాని బంధం ఉందని అంటారు. వివాహాలు, శుభకార్యాలు, వేడుకలు, పండగలు ఇలా ఏదైనా ప్రత్యేక సందర్భాలలో బంగారం కొనుగోలు చేయాలని మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
పెద్దలు కూడా సురక్షితమైన పెట్టుబడి అంటే బంగారమే అని చెబుతుంటారు. అయితే బంగారం కొనుగోలు విషయంలో చాలా మంది నాణ్యత విషయంలో మోసపోతుంటారు. దాని కోసం భారత ప్రభుత్వం హాల్‌మార్కింగ్ ను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ కొందరు మోసం చేస్తున్నారు. హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
బంగారం ఖరీదు ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. ఎంత రేటు పెరిగినప్పటికీ, బంగారం కొనుగోళ్లు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. బంగారం నాణ్యత విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మోసపోవాల్సి ఉంటుంది. బంగారం నాణ్యతను హాల్‌మార్క్ ద్వారా గుర్తించవచ్చు. హాల్ మార్క్ అంటే, ధృవీకరించబడిన బంగారం. విలువైన లోహంతో తయారుచేసిన వస్తువులో ఆ లోహం అనేది ఎంత శాతం ఉందో ఖచ్చితంగా నిర్ధారించిన తరువాత, అధికారికంగా స్టాంప్ వేయడాన్నే హాల్‌మార్కింగ్ అని అంటారు.
ఇది బంగారానికి సైతం వర్తిస్తుంది. హాల్ మార్కింగ్ విలువైన లోహపు వస్తువుల స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (BIS) బంగారు వస్తువు యొక్క స్వచ్ఛతను మరియు క్వాలిటీని ధృవీకరించడానికి హాల్‌మార్క్ లైసెన్స్ ఇస్తుంది. 22 క్యారెట్ల అయితే 22K916, 18 క్యారెట్ల అయితే 19K750, 14 క్యారెట్ల అయితే 14K585 గుర్తులు ఉంటాయి. హాల్ మార్కింగ్ పై బంగారం స్వచ్ఛత నంబర్, తయారీ సంవత్సరం కూడా ఉంటాయి.
అలా ఇచ్చినప్పటికి కొందరు మోసం చేస్తూనే ఉన్నారు. అలాంటి అప్పుడు బంగారం నాణ్యమైనదో కాదో ఎలా తెలుసుకోవాలి అంటే బీఎస్ఐ కేర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని, దానిలో హాల్‌మార్క్ నెంబర్ ఎంటర్ చేసినపుడు ఆ వస్తువు ఎన్ని క్యారెట్స్ అనేది చూపిస్తుంది. దాని ద్వారా మీరు కొన్నబంగారు వస్తువు నాణ్యత ఏమిటో తెలుస్తుంది.
Also Read: టెలికాం దిగ్గజం అయిన BSNL ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి..? ఇలా చేసి ఉండకపోతే..?

‘ఓపెన్ హైమర్’ మూవీకి విడుదలకి ముందు ఇండియాలో వచ్చిన హైప్ మామూలుగా లేదు. ఈ మూవీ రిలీజ్ రోజు ప్రాంతీయ భాషల్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా, భారతీయ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘ఓపెన్ హైమర్’ కే నంబర్ వన్ గా నిలిచింది. ఆ మూవీకి కొన్ని రోజుల ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఓపెనింగ్స్ విషయంలోనూ ‘ఓపెన్ హైమర్’ నంబర్ వన్ మూవీగా నిలిచింది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజెన్లు హీరో మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన సినిమా ‘రాకెట్రీ’ ని పోలుస్తున్నారు. ఈ మూవీ ప్రముఖ భారతీయ ఎయిరోస్సేస్ శాస్త్రవేత్త, పద్మభూషణ్ నంబీ నారాయణ్ లైఫ్ ఆధారంగా తెరకెక్కింది. ఇస్రో పరిశోధనలకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ ను వేరే దేశానికి లీక్ చేశాడనే కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. కానీ సీబీఐ దర్యాప్తులోను, సుప్రీంకోర్టు విచారణలోను తనకు తాను నిర్దోషిగా నంబి నారాయణ్ నిరూపించుకొన్నారు.
ఈ మూవీ గత ఏడాది మే 19న రిలీజ్ అయ్యి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియయల్ గా హిట్ అందుకోలేదు. ‘ఓపెన్హీమర్’ మూవీని చూడటానికి థియేటర్లకు వచ్చిన యువతలో 30% మంది అయినా భారతీయ గొప్ప సైంటిస్ట్ హృదయ విదారక కథతో తెరకెక్కిన ‘రాకెట్రీ’ ని థియేటర్లలో చూసి ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ తరువాత ఏ చిత్రాన్ని పూర్తి చేయలేదు. ఈ మూవీ పూర్తి కాకముందే త్రివిక్రమ్ తో మూవీని అనౌన్స్ చేశాడు. కానీ ఈ మూవీ చాలా అడ్డంకుల మధ్య జనవరిలో ప్రారంభం అయ్యింది. అయితే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తరువాత వాయిదా పడింది. మళ్ళీ ఇటీవలే చిత్రీకరణ మొదలు పెట్టి ఒక నెల షూటింగ్ జరగగానే మళ్ళీ విరామం తీసుకున్నారు.
‘గుంటూరు కారం’ మూవీని త్రివిక్రమ్ మాస్ మసాలా స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక మూవీ గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ గా మారుతోంది. తాజాగా ఈ మూవీ స్టోరీ లీక్ అయినట్టు ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వైరల్ అయిన న్యూస్ ప్రకారం ఈ ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంలో అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారని, అయితే ఇద్దరి తండ్రి ఒక్కరే, కానీ తల్లులు వేరని తెలుస్తోంది.
దాంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంటుందని, వీరిద్దరి మధ్య మహేష్ బాబు క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో స్టోరీ సాగుతుందని, త్రివిక్రమ్ ఫ్యామిలీ సెంటిమెంట్ ను సైతం బలంగా చూపిస్తారని తెలుస్తోంది.
వినీత్ శ్రీనివాసన్ హీరోగా తెరకెక్కిన ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’ మలయాళంలో భారీ విజయాన్ని సాధించింది. క్రైమ్ కామెడీ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ముకుందన్ ఉన్ని (వినీత్ శ్రీనివాసన్) లాయర్. కేసుల కోసం అతను చేసే ఏ ప్రయత్నాలు కూడా ఫలించవు. మరోవైపు లాయర్ వేణు (సూరజ్) యాక్సిడెంట్ అయిన వ్యక్తులకు నకిలీ పత్రాలతో ఇన్సురెన్స్ క్లెయిమ్ చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తుంటాడు. ముకుందన్ కూడా వేణులానే మనీ సంపాదించేందుకు ప్రయత్నిస్తాడు.
వేణు యాక్సిడెంట్ కేసులను క్లెయిమ్ చేసే మెర్క్యూరీ హాస్సిటల్ నే ముకుందన్ కూడా ఎంచుకుంటాడు. వేణుతో పోటీని తట్టుకోవడం కష్టం కావడంతో ఒక ప్లాన్ వేసి వేణుని ముకుందన్ చంపేస్తాడు? వేణు చనిపోయిన తర్వాత ఏమైంది? లాయర్‌గా డబ్బు, పేరు సంపాదించడం కోసం చెడు దారిని ఎంచుకున్న ముకుందన్‌కు ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? జీవితంలో సక్సెస్ కావాలనే ముకుందన్ కల నెరవేరిందా? తాను ప్రేమించిన మీనాక్షిని( ఆర్ష చాందిని) ముకుందన్ వివాహం చేసుకున్నాడా? అనేది మిగిలిన కథ.
ఈ మూవీలో హీరో మరియు విలన్ రెండు వినీత్ శ్రీనివాసన్. ముకుందన్ ఉన్ని క్యారెక్టర్ లో వినీత్ జీవించాడు. అర్ష చాందిని మీనాక్షిగా పాత్రకు తగినట్టుగా చేసింది. హీరోతో పాటు మూవీలోని ప్రతి పాత్ర నెగెటివ్ షేడ్స్ లోనే ఉంటుంది. ఎదుటివారి వీక్ పాయింట్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కొందరు లైఫ్ లో ఎలా పైకి వస్తారనేది ఈ మూవీలో ఆలోచనాత్మకంగా చూపించారు.
ప్రస్తుతం ‘కల్కి 2898 ‘ అంటే అర్ధం ఏమిటనే చర్చ ప్రారంభం అయ్యింది. ఇక ఈ టైటిల్ పెట్టడం వెనుక పెద్ద కథ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఈ మూవీ కథ ఎలా ఉండబోతుందనే విషయాన్ని నాగ్ అశ్విన్ తెలిపారు. తాను పురాణాలను మరియు సైన్స్ ఫిక్షన్ ను ఇష్టపడతానని, మహాభారతం మరియు స్టార్ వార్స్ ను చూస్తూ పెరిగానని అన్నారు. ఈ 2 ప్రపంచాలను కలిపి ఒక మూవీగా చేయడం అనేది గొప్పగా అనిపించిందని, ఆ విధంగా ‘కల్కి 2989 AD’ వచ్చిందని చెప్పారు.
కల్కి 2898 AD స్టోరీ యుగాంతం బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని సమాచారం. 2898లో అంటే ఫుచర్ లో రాబోయే యుగాంతం ఆధారంగా నాగ్ అశ్విన్ ఈ స్టోరీని రాసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మూవీని సైన్స్ ఫిక్షన్, టైమ్ మిషన్ నేపథ్యంలో నిర్మిస్తున్నారని తెలుస్తోంది.
ఈ స్టోరీ గురించి సోషల్ మీడియాలో నెటిజెన్లు సైతం తమ అభిప్రాయాలను చెప్తున్నారు. 18 వ శతాబ్దంలో కొంత, 28 వ శతాబ్దంలో కొంత స్టోరీ జరుగుతుందని, చివరి 20 నిముషాల్లో విలన్ కీలకపాత్ర వహిస్తాడని అంటున్నారు. మరొకరు గ్లింప్స్ ఆధారంగా అమితాబ్ దాచిన వస్తువును కోసం ఒక రోబో 18వ శతాబ్దానికి ప్రయాణిస్తుందని కామెంట్ చేశారు.
‘బేబీ’ మూవీ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ కల్ట్ లవ్ స్టోరీ కి యూత్ బాగా కనెక్ట్ అవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ హిట్ అవడంతో చాలా మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్యకు మంచిపేరు వచ్చింది. కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ స్నేహితులుగా నటించినవారికి కూడా మంచి గుర్తింపు లభించింది.
ఈ మూవీతో సాయి రాజేశ్ దర్శకుడిగా మరో మెట్టు ఎక్కారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తల్లి పాత్రలో నటించిన నటి కూడా చాలా బాగా చేశారనే పేరు వచ్చింది. ఆమె పేరు ప్రభావతి వర్మ. ఎన్నో సినిమాలలో నటించిన ఆమెకు ఈ మూవీతో గుర్తింపు లభించింది. మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీలో హీరోయిన్ తల్లిగా నటించింది.
ఇటీవల జరిగిన బేబీ సక్సెస్ మీట్ లో ప్రభావతి వర్మ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు అయినట్లు తెలిపారు. ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలు చేసినప్పటికీ ఈ మూవీలో నటించిన తల్లి పాత్ర చాలా స్పెషల్ అని అన్నారు. ఎందుకంటే ఈ మూవీ ద్వారా ఆనంద్ తనకు కొడుకుగా లభించాడని, అది ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ప్రభావతి వర్మ వెల్లడించారు.

తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమాతో రీమా సేన్ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టారు. 2000 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ తరువాత వరుస అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారారు. తెలుగులో నటిస్తూనే గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘మిన్నలే’ అనే మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తెలుగులో ‘చెలి’ పేరుతో రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ హిట్ అవడంతో కోలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసింది. హిందీలో కూడా పలు సినిమాలు చేసింది. వల్లభ, యుగానికి ఒక్కడు వంటి సినిమాలలో నెగెటివ్ పాత్రల్లో నటించి, విమర్శకుల ప్రశంసలతో పాటు, అవార్డ్స్ అందుకున్నారు. ఆమె 2012లో ఢిల్లీ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2013 లో ఈ రీమాసేన్ బాబుకు జన్మనిచ్చింది. అతని పేరు రుధ్రవీర్.
రీమాసేన్ సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ, ఆమె ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో తరచుగా అభిమనులతో పంచుకుంటుంది. ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అదేవిధంగా, రీమాసేన్ తన భర్త, కుమారుడు మరియు స్నేహితులతో గడిపిన స్నాప్షాట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చాలా రోజుల నుండి ఐపీఎల్ నుండి ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి ధోని ఈ సంవత్సరమే తప్పుకోవాల్సింది. కానీ తదుపరి జట్టు కెప్టెన్ ఎవరు అనే విషయం పై స్పష్టత రాకపోవడంతో ధోనీ తన రిటైర్మెంట్ ను వాయిదా వేసుకున్నారని, అది ఇప్పుడు పూర్తి అయ్యిందని, అందువల్ల ధోని ఎప్పుడైనా తప్పుకోవచ్చు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అంబటి రాయుడు, సిఎస్కే నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూనే, యువ క్రికెటర్ పై ప్రశంసలు కురిపించి, పరోక్షంగా అతనే తదుపరి కెప్టెన్ అని తెలిపాడు. యంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ పై రాయుడు ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ ధోనీలా ప్రశాంతంగా ఉంటాడని అన్నారు. అతనిలో లీడర్ షిప్ లక్షణాలు దాగున్నాయని, ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ల సహాయంతో రుతురాజ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎక్కువ కాలం సేవలు అందించగలడని వెల్లడించారు.
ఆసియన్ గేమ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ భారత పురుషుల టీమ్ కు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమ్ ఇండియా ప్రదర్శన మీదనే రుతురాజ్ సీఎస్కే కెప్టెన్సీ ఆధారపడి ఉంటుంది. టీమిండియా ఒకవేళ స్వర్ణం సాధించినట్లయితే సిఎస్కే నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు జవాబు దొరికినట్లే.
ప్రభాస్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ టైటిల్ ప్రకటనకు ముందు చిత్ర యూనిట్ ‘ప్రాజెక్ట్ – K’ అంటే ఏంటి? అని ఆడియెన్స్ కి పజిల్ విసిరింది. దాంతో K అంటే కల్కి, కాలచక్ర, కలియుగ్ అంటూ పలు పేర్లు వినిపించాయి. కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ – K లో K అంటే కల్కి అని, మూవీ టైటిల్ ను ‘కల్కి 2898 ఏడీ’ అని ప్రకటించారు. ఈ గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
‘లోకం అంతా చీకటిలో కూరుకుపోయినప్పుడు, ఆ చీకటిని, అందుకు కారణం అయిన వారిని పారదోలడానికి ఒక శక్తి ఉదయిస్తుందని, ఆ శక్తి కథనే ‘కల్కి’ అని క్లుప్తంగా గ్లింప్స్ తెలియజేశారు. దీంతో ప్రభాస్ శ్రీమహావిష్ణువు అవతారాలలో పదవ అవతారమైన ‘కల్కి’ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ప్రభాస్ కన్నా ముందుగా తెలుగులో మరో హీరో ‘కల్కి’ గా నటించాడు. ఆ హీరో మరెవరో కాదు. రైటర్ కమ్ డైరెక్టర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్.
అడివి శేష్ మొదటి మూవీ ‘సొంతం’. అందులో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తరువాత తానే రచయితగా, దర్శకుడిగా మారి తానే హీరోగా ‘కర్మ’ అనే చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం 2010లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ‘దేవ్’ అనే పాత్రలో నటించిన శేషు, మూవీ మొదట్లోనే ఎండింగ్ ను ఊహించి చెప్తాడు. సరైన ప్రమోషన్ లేకపోవడంతో ఆడియెన్స్ కి ఈ మూవీ గురించి పెద్దగా తెలియలేదు. 13 సంవత్సరాల క్రితమే అడివి శేష్ ‘కల్కి’గా నటించాడు.