యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, తనదైన యాక్టింగ్ తో తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆసినిమాల తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ తాజాగా నటించిన ‘ఆదిపురుష్’మూవీతో జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం విజువల్ వండర్ గా రూపొందింది. టీజర్ తో ఈ సినిమా పై విమర్శలు వచ్చినప్పటికీ,ట్రైలర్ రిలీజ్ తో ఈ చిత్రం పై భారీ అంచనాల ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ చిత్రంకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సంచలన రికార్డు సృష్టించాడు. ఆ రికార్డ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన ఏపీ, తెలంగాణలో అన్ని ఏరియాల హక్కుల కోసం భారీగా పోటీ ఏర్పడింది. దీని ఫలితంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ప్రభాస్ కెరీర్ లోనే ఎక్కువ బిజినెస్ చేసిన సినిమాలలో 3వ స్థానానికి చేరింది. ఈ చిత్రం కంటే ముందు బాహుబలి 2 సినిమా 122 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.
ఆదిపురుష్ మాత్రమేకాకుండా ప్రభాస్ గత 4 సినిమాలకు కూడా ఏపీ, తెలంగాణలో వంద కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. బాహుబలి 2 సినిమాకి రూ.122 కోట్లు, సాహో సినిమాకి రూ.121.60 కోట్లు, రాధే శ్యామ్ సినిమాకు రూ.105.20 కోట్లు, ఆదిపురుష్ సినిమాకి రూ.120 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ విధంగా ప్రభాస్ గత 4 సినిమాలకు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలోమొత్తం రూ. 468.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీగా బిజినెస్ చేసిన ఒకే ఒక హీరోగా ప్రభాస్ రికార్డును క్రియేట్ చేశాడు.
Also Read: “ఏమి రాకుండానే ఇంత పెద్ద స్టార్ అయ్యాడా..?” అంటూ… “ప్రభాస్” ఫ్యాన్స్ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

‘ఆదిపురుష్’ చిత్రం రీలీజ్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రీరాముడిగా తమ అభిమాన స్టార్ ను వెండితెర పై వీక్షించాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు ఈ చిత్రం పై అంచనాలను అమాంతం పెంచాయి. డైరెక్టర్ ఓం రౌత్ రామాయణ మహాకావ్యాన్ని కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. రామాయణ కథ అందరికి తెలిసిన స్టోరీనే అయినా ఓం రౌత్ టేకింగ్, గ్రాఫిక్స్ ఎలా ఉండనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో విమర్శలు, వివాదాలు వచ్చాయి. కొన్ని ఇంకా కొనగుతున్నాయి. వీటి మధ్యే జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తనకు తానే ఓవర్సీస్ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ఈ చిత్రం పై నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు.
‘ఆదిపురుష్’ టార్చర్ అని, ప్రభాస్, కృతి సనన్ బ్యాడ్‌లక్ బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతుందని ట్వీట్ చేశాడు. ‘పెద్ద స్టార్స్, భారీ బడ్జె్, వీఎఫ్ఎక్స్ ఉన్న భారీ చిత్రం. కానీ ఈ మూవీలో సోల్ లేదు. నటీనటులందరు వరెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రభాస్ మీకు యాక్టింగ్ క్లాసులు అవసరం’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. ప్రభాస్ కి ఏమి రాకుండానే ఇంత పెద్ద స్టార్ అయ్యాడా? ఈ రేంజ్ కి వచ్చారు అంటే అంత స్కిల్ ఉండబట్టే కదా? అని కామెంట్స్ చేస్తున్నారు. మూవీ చూడకుండా రివ్యూ ఏంటని అని తిడుతున్నారు.
ఒకప్పడు హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన శరత్‌కుమార్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస చిత్రాలలో బిజీగా ఉన్నారు. ఇటీవలే వారసుడు, పీఎస్ 2 సినిమాల ద్వారా ఆడియెన్స్ ను పలకరించారు. శరత్ కుమార్ డిఫరెంట్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా ఆయన ప్రధాన పత్రలో నటించిన తమిళ చిత్రం ‘పోర్ థోజిల్’ విడుదల అయ్యింది. ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. రిలీజ్ అయినప్పటి నుండి పాజిటివ్ తెచ్చుకున్న ఈ మూవీ, కోలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే తిరుచ్చి అనే ఊరులో ఒక సైకో అమ్మయిలను వరుసగా చంపేస్తుంటాడు. ఆ సైకో ఎవరు? అతను అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు. కొత్తగా పోలీస్ జాబ్ లో చేరిన ప్రకాష్ (అశోక్ సెల్వన్) ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా కథ. ఇలాంటి చిత్రాలు గతంలో ఎన్నో వచ్చాయి. కానీ ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే ఎంగేజింగ్ గా, గ్రిప్పింగ్ గా ఉండడంతో ఆడియెన్స్ ని స్టోరీతో పాటు ప్రయాణించేలా చేస్తుంది.
కొత్త దర్శకుడు అయినప్పటికీ విఘ్నేష్ రాజా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. కొత్తగా పోలీసు డిపార్ట్మెంట్ లో చేరిన వ్యక్తిగా అశోక్ సెల్వన్, సీనియర్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య ఉండే ఇగో, సీన్స్ చాలా బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.
హీరోయిన్ గా టాలీవుడ్ మూవీ ఉయ్యాల జంపాల ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్, ఆ తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి, తాను నేను, సినిమా చూపిస్తా మావ, రాజు గారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యింది. హిందీ సీరియల్స్ నటిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్లో ఆమె నటించిన 1920:హార్రర్ ఆఫ్ ద హార్ట్ మూవీ రిలీజ్ కాబోతుంది.
ఈక్రమంలో అవికా గోర్ ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది. దీనిలో ఆమె సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. “దక్షిణాది ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ. అక్కడ స్టార్ హీరోల పైనే ఇండస్ట్రీ నడుస్తోంది. అక్కడి ఆడియెన్స్ కూడా స్టార్స్ చిత్రాలనే చూస్తారని, టాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువ.” అని అవికా గోర్ కామెంట్స్ చేసింది. నెటిజెన్లు అవికా గోర్ కామెంట్స్ పై మండిపడుతున్నారు. తెలుగు చిత్రాలలో నటించి, గుర్తింపు వచ్చిన తరువాత అదే ఇండస్ట్రీ పై ఇలాంటి కామెంట్లు చేయడం సరి కాదని అంటున్నారు.
రణబీర్ కపూర్,సందీప్ రెడ్డి వంగా వంటి క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ‘యానిమల్’ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ టి సీరీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 11న 5 భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది.
ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా యానిమల్ ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. టీజర్ లో స్కల్ మాస్క్ పెట్టుకొన్న ఒక గ్యాంగ్ హీరో రణబీర్ కపూర్ పై అటాక్ చేయడం, రణబీర్ వారిపై అటాక్ చేయడంతో ఆ గ్యాంగ్ భయంతో పరుగులు తీస్తారు. ఈ టీజర్ రక్తపాతాన్ని తలపించింది.
అయితే ఇందులో చూపించిన యాక్షన్ సీన్స్ 2003లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ ‘ఓల్డ్ బాయ్’నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి కాపీ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది మాత్రమే కాకుండా ఈ మూవీ కూడా స్క్వాడ్ గేమ్స్, ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్, ఓల్డ్ బాయ్ లాంటి కొరియన్ సినిమలను మిక్స్ చేసి, తీశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ టీజర్ రిలీజ్ తరువాత సందీప్ రెడ్డి వంగాను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
పూర్ణ, రవిబాబు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం అసలు. ఈ చిత్రానికి సురేష్, ఉదయ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీని డైరెక్ట్‌గా ఈటీవీ వారి విన్ ఓటీటీలో ఏప్రిల్ 14న విడుదల చేశారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్. రవిబాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూనే ఈ మూవీని నిర్మించారు.
కామెడీ, క్రైమ్ సస్పెన్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబుకు మంచి పేరుంది. అనసూయ, అవును లాంటి చిత్రాలతో విజయం సాధించారు. చాలా గ్యాప్ తరువాత ‘అసలు’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సీన్ లో డాక్టర్ ఒక పేషంట్ బ్రెయిన్ లో స్టోర్ అయిన ఇమేజ్ లు అంటూ హీరోయిన్ పూర్ణకు చూపిస్తుంది. ఆ పేషంట్ కాన్షియస్ గా చివరిసారి చూసిన విజువల్స్ అని చెప్తుంది. వాటి ద్వారా ఆమె షాక్ లోకి ఎందుకు వెళ్లిందో తెలుస్తుందని చెప్తుంది. పూర్ణ వాటిని చూసి ఆ ఫోటోలోని వ్యక్తిని గుర్తు పడుతుంది. ఇక ఈ సీన్ చూసినవారు బ్రెయిన్ ఇలా కూడా పనిచేస్తుందా అంటూ ఈ మూవీని ట్రోల్ చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, తన ప్రతిభతో ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుని స్టార్ హీరోగా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో అనేక హిట్ సినిమాలు ఉన్నప్పటికీ, ఆయన హీరోగా నటించిన ‘బృందావనం’ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఎన్టీఆర్ అప్పటి దాకా మాస్ చిత్రాలను మాత్రమే చేస్తూ మాస్ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు.
మాస్ హీరోగా అయిన ఎన్టీఆర్ ను కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసిన చిత్రం బృందావనం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మించాడు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, శ్రీహరి ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ మూవీ 2010లో అక్టోబర్ 14న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ చిత్రంలో చేసిన ఒక మిస్టేక్ పై నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక సన్నివేశంలో పడుకున్న ఎన్టీఆర్ ను నటి ప్రగతి నిద్రలేపుతుంది. అయితే ఆ సీన్ లో బెడ్ పక్కనే ఉన్న పెద్ద అద్దంలో కెమెరామెన్, పక్కనే ఉన్న మరో ఇద్దరు కనిపిస్తున్నారు. ఈ సీన్ చూసినవారు డైరెక్టర్ గారు దీనిని ఎలా మిస్ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్ విడుదల కోసం అభిమనులతో పాటుగా దేశవ్యాప్తంగా అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రకటించినపుడే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ పోస్టర్, టీజర్ రిలీజ్ అయ్యాక, తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దాంతో మేకర్స్ గ్రాఫిక్స్ విషయంలో మరింత వర్క్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేశారు. టీజర్ కన్నా బెటర్ గా ఉండడంతో మూవీ పై అంచనాలు పెరిగాయి.
పోస్టర్ రీలజ్ తో మొదలయిన వివాదాలు ఇప్పటి వరకు కొనగుతూనే ఉన్నాయి. కొందరు రాముడికి మీసాలు పెట్టడం పై విమర్శిస్తే, కొందరు రావణుడు లుక్ పై విమర్శించారు. ఇటీవల ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక, రాముడికి ఆనవాలు కోసం హనుమాన్ కి సీతాదేవి చూడామణికి బదులుగా గాజులు ఇవ్వడం, రావణుడు సీతను ఎత్తుకెళ్ళే విధానం పై ఇలా చాలా విషయాలు వివాదస్పదంగా మారాయి. వీటన్నిటి మధ్య జూన్ 16న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
ఇదిలా ఉంటే ఈమధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో రూపొందించిన ఫోటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏఐ రూపొందించిన ఆదిపురుష్ ఫోటోలు వైరల్ అయ్యాయి. వీటిని చూసినవారు మూవీ కన్నా ఇవే బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోలను మీరు చూడండి.
2.
3.
5.
6.
7.
8.
9.
విరూపాక్ష సినిమా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యాక్సిడెంట్ వల్ల చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ కు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇచ్చింది. గోల్డెన్ బ్యూటీగా పాపులర్ అయిన సంయుక్తమీనన్ ఈ మూవీతో మరోసారి ప్రశంసలు అందుకుంది.
ఈ క్రమంలోనే దర్శకుడు కార్తిక్ వర్మ ఈ సినిమాని తెరకెక్కించడానికి కారణం వివరించారు. తనకు చిన్నప్పటి నుండి హారర్ చిత్రాలు అంటే ఎక్కువ ఆసక్తి ఉండేదని చెప్పారు. 2016-17 సంవత్సరంలో వార్తా పత్రికలో వచ్చిన ఒక క్రైమ్ న్యూస్ చదివిన తరువాత ఈ మూవీని రూపొందించాలనే ఆలోచన వచ్చిందని అన్నారు. ఉత్తరాదిలో ఒక పల్లెటూరులో ఒక మహిళ ఆమె భర్త మరణించడంతో ఊరి చివరలో నివస్తుండేది. అదే టైంలో ఊర్లోని ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. దాంతో గ్రామంలోని వారంతా ఆ మహిళను సందేహించి, క్రూరంగా చంపేశారు.
ఈ న్యూస్ చదివిన అనంతరం విరూపాక్ష కథ రాయాలనిపించింది. తాను రాసిన స్టోరీలో పార్వతి పాత్ర చేసిన శ్యామల విలన్. ఆమె తల్లిదండ్రులు మరణించిన తరువాత ఆ ఊరు నుండి వెళ్ళిపోయి, తిరిగి అదే ఊరుకి కోడలిగా వచ్చి ఆ గ్రామం పై పగ తీర్చుకుంటుంది. అయితే సుకుమార్ సర్, కథను మార్చి హీరోయిన్ సంయుక్త మీనన్ ను విలన్ చేశారు. దానికి తగ్గట్టు మార్పులు చేయాడం కోసం 7 నెలలు పట్టింది అని చెప్పారు.
శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ముందు డైరెక్టర్ ఓం రౌత్, ‘ఆదిపురుష్’ లో సీతాదేవిగా నటించిన కృతి సనన్ తో ప్రవర్తించిన తీరుకు అటు మీడియాలోను, ఇటు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు. అది మరవక ముందే ఇలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ సినిమా ‘గదర్ 2‘ షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ గా అమీషా పటేల్ నటిస్తోంది. అయితే ‘గదర్ 2‘ మూవీ షూట్ తాజాగా గురుద్వార్ లో జరుగుతోంది. అయితే అక్కడ కౌగిలింతలు, ముద్దు సీన్స్ ను చిత్రీకరించారు. ఆ షూట్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘గురుద్వార్’ సిక్కులకు పరమ పవిత్రమైన స్థలం.
అలాంటి చోట దేవుడికి నమస్కరించే సీన్స్ తీస్తామని మూవీ యూనిట్ అనుమతి తీసుకుని, ఈ సీన్స్ ను షూట్ చేశారంట. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ గురుద్వారా ప్రాంగణంలో ఇలాంటి సీన్స్ చిత్రీకరించడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గురుద్వార్ నిర్వాహకులతో పాటుగా, సిక్కు మతస్థులు మండి పడుతున్నారు. నెటిజెన్లు ‘ఇక మీరు మారరా’ అని బాలీవుడ్ సెలబ్రిటీల పై కామెంట్లు చేస్తున్నారు.