నటుడు డి ఎం డి కె అధినేత విజయ్ కాంత్ డిసెంబర్ 28న కన్ను మూశారు. ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్ తర్వాత పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైలో ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు అయితే ఆయనకు కరోనా కూడా సోకటంతో వెంటి లేటర్ పై ఉంచి చికిత్స అందించారు.
అయితే మరణంతో పోరాడిన విజయకాంత్ చివరికి చావు చేతిలో ఓడిపోక తప్పలేదు. అయితే ఈయన మరణం కోలీవుడ్ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. కడసారి చూపు కోసం పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు అందరూ వచ్చారు. ఇప్పటికకీ ఈయన సమాధి వద్దకు వందలాది మంది అభిమానులు వచ్చి దర్శించుకుంటున్నారు. అయితే ఈ విషాద సంఘటన నుంచి విజయ్ కాంత్ కుటుంబం ఇంకా బయటపడలేదనే చెప్పాలి.

ఈ క్రమంలో విజయకాంత్ పట్ల తన భార్య ప్రేమలత తనకు ఉన్నటువంటి ప్రేమని మరొకసారి బయటపెట్టారు. తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఈమె తన భర్త ప్రేమకు గుర్తుగా తన చేతిపై తన భర్త ఫోటోని టాటూగా వేయించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భర్తను మర్చిపోలేక ఈమె ఇలా టాటూ వేయించుకున్నారని తెలుస్తుంది ఇక విజయకాంత్, ప్రేమలత వివాహం 1990 సంవత్సరంలో జరిగింది.

వీరికి ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు షణ్ముఖ పాండియన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 90 లలో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకటిగా విజయ్ కాంత్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా విజయ్ కాంత్ తెలుగు వాళ్ళకి కూడా పరిచయమే. అయితే తర్వాత కాలంలో రాజకీయాలలో ప్రవేశించిన విజయ్ కాంత్ అనుకున్నంత సక్సెస్ ని సాధించలేకపోయాడు.
https://www.instagram.com/reel/C27INCFP8Fo/?utm_source=ig_embed&ig_rid=2d58d77d-73f2-4475-b48a-b64b81051d0c















ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ మూవీకి ఆడియెన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ‘తొలి ప్రేమ’ అనే కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ సినిమా హిట్ అవడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన హీరో ఆనంద్ దేవరకొండ, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్‌లకు ఈ మూవీతో మరో మెట్టు ఎక్కారని చెప్పవచ్చు. వీరితో పాటుగా హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన కుసుమ డెగల మర్రికి గుర్తింపు దక్కింది. ఇలా ఈ మూవీలో నటించిన వారందరికీ బేబీ మూవీ ఊహించనంత గుర్తింపును తీసుకొచ్చింది.
అయితే అందరూ ఆ బేబీ హీరోయిన్ వైష్ణవి గురించే కాకుండా హీరోయిన్ కాలేజీ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గురించి నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె పేరే ‘కిర్రాక్ సీత’. ఇప్పటికే ఆమె యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది. తెలుగు వెబ్ సిరీస్‌లలో నటించింది. షార్ట్ ఫిల్మ్‌లు ద్వారా సీత మంచి పేరు తెచ్చుకుంది. ఆమె 21 వెడ్స్ 30, పెళ్లికూతురు పార్టీ, సరయు, మూడు చేపల కథ వంటి వాటిలో నటించి ఆకట్టుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు.