ఒక్క కామెంట్ తో రితికకి చాలా హైప్ వచ్చేసిందిగా.? నీలా అనుష్క ఏడవలేదు అంటూ కోహ్లీ ఫాన్స్.!

ఒక్క కామెంట్ తో రితికకి చాలా హైప్ వచ్చేసిందిగా.? నీలా అనుష్క ఏడవలేదు అంటూ కోహ్లీ ఫాన్స్.!

by Harika

విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయని అప్పుడప్పుడు బయటపడుతు ఉంటాయి.వాటిని ఇరువురి అభిమానులు పర్సనల్ గా తీసుకుని కౌంటర్స్ వేస్తూ ఉంటారు.అయితే తాజాగా అభిమానుల మధ్య మరోసారి సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దానికి తెరలేచింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుండి రోహిత్ శర్మను తప్పించడాన్నీ తప్పుబడుతూ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దూమారం రేపుతున్నాయి.

Video Advertisement

తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడానికి గల కారణాలను వివరించాడు. ఇది కేవలం క్రికెట్ కోసం తీసుకున్న నిర్ణయమే అని వ్యక్తిగత కారణాలు ఏమీ లేవని చెప్పుకొచ్చాడు. ఈ నిర్ణయాన్ని రోహిత్ అభిమానులు అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పుకొచ్చాడు. దీనిపైన రోహిత్ భార్యా రితీక స్పందిస్తూ…
ఈ నిర్ణయంలో చాలా తప్పులు ఉన్నాయంటూ నిర్మొహమాటంగా కామెంట్ చేసింది. ఇప్పుడు రితిక కామెంట్లు ముంబై ఇండియన్స్ వర్సెస్ రోహిత్ అభిమానుల మధ్య పోరు రేపాయి. మరోపక్క కోహ్లీ అభిమానులు రితీక కామెంట్లను తప్పుపడుతున్నారు.టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి కూడా విరాట్ కోహ్లీని ఇలానే అనవసరంగా తప్పించారని గుర్తు చేశారు.

ఆ సమయంలో అనుష్క శర్మ.. రితికాలా? ఏడ్వలేదని, ఒక్క పోస్ట్ కూడా చేయలేదని గుర్తు చేస్తూ రితికాపై విమర్శలు గుప్పించారు. కోహ్లీ అభిమానుల కామెంట్లకు రోహిత్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. అప్పుడు కోహ్లీ ఫామ్ లో లేకపోవడంతో అనుష్క శర్మ మద్దతు తెలిపిందని, రితిక ఇప్పుడు కేవలం తన అభిప్రాయాన్ని తెలిపిందని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో రోహిత్ భార్య రితీక,కోహ్లీ భార్య అనుష్క ట్రెండింగ్లోకి వెళ్లారు.


You may also like

Leave a Comment