అమెరికాలో ఒక తెలుగు యువతి ఆత్మహత్య కి పాల్పడ్డ ఒక సంఘటన చర్చలకు దారి తీసింది. న్యూస్ 18 కథనం ప్రకారం చిత్తూరులోని పోలీస్ కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. పూతలపట్టు మండలం బందార్లపల్లె గ్రామానికి చెందిన మురళి కొడుకు భరత్ అమెరికా లో ఉద్యోగం చేస్తున్నారు.
వారిద్దరి కుటుంబ సభ్యులు చర్చించుకొని వారికి పెళ్లి ఖాయం చేశారు. మార్చి 3వ తేదీన అంటే గురువారం తెల్లవారు మూడు గంటలకి వారికి వివాహం నిశ్చయించారు. శుభలేఖలు ముద్రించారు. పెళ్లి ఏర్పాట్లు కూడా జరిగాయి. వారం రోజుల క్రితం భరత్ ఈ వివాహానికి నిరాకరించారు. ఈ విషయంపై సుష్మా కి భరత్ కి మధ్య చర్చ జరిగింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. అంతా సర్దుకుంటుంది అనుకున్నారు. కానీ సుష్మా ఆత్మహత్య వార్త విని బాధకి గురయ్యారు.