Ads
మనదేశంలో ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఐపీఎల్ సీజన్ మొదలైతే మిగిలిన షోస్ అన్ని ఒకవైపు, ఐపీఎల్ ఇంకొకవైపు అన్నట్టు ఉంటుంది. చాలా ఇళ్ళల్లో ఐపీఎల్ కోసం బానే డిస్కషన్స్ జరుగుతాయి. ఈ సంవత్సరం ఐపీఎల్ మొదలయ్యే షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9వ తేదీ నుండి ఐపీఎల్ మొదలవబోతోంది.
Video Advertisement
మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మధ్య జరుగుతుంది. మే 30 తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. కానీ ఈ సారి హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ జరగడం లేదు. ముంబైలో కరోనా కేసులు ఎక్కువ ఉన్న కారణంగా హైదరాబాద్ లో మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి అని అందరూ అనుకున్నారు.
కానీ ముంబైలో మ్యాచ్ నిర్వహించడానికి బీసీసీఐ మొగ్గు చూపింది. గత సంవత్సరం కరోనా కారణంగా లైవ్ ఆడియన్స్ లేకుండా ఐపీఎల్ జరిగింది. కానీ ఈసారి మాత్రం అన్నీ జాగ్రత్తలతో ఆడియన్స్ ని స్టేడియంలోకి రావడానికి అనుమతిచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఈసారి కూడా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్ విడుదల అవ్వడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12
End of Article