బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరి వారంలోకి అడుగు పెట్టింది. గత వారం ఎలిమినేషన్ లో మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి వచ్చారు. ఇప్పుడు అభిజిత్, అరియానా, సోహెల్, అఖిల్, హారిక టాప్ ఫైవ్ ఫైనలిస్ట్స్ గా నిలిచారు. వచ్చే ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫినాలే జరగనుంది. మొదట్లో మోనాల్ తెలుగు రాక కొంచెం ఇబ్బంది పడినా కూడా తర్వాత తెలుగు నేర్చుకున్నారు.
అంతే కాకుండా టాస్క్ విషయంలో కూడా చాలా మంది మోనాల్ వీక్ అని అన్నారు. కానీ తర్వాత టాస్క్ విషయంలో కూడా మోనాల్ మెల్లగా డెవలప్ అయ్యారు. అన్నిటికీ కొంచెం ఎమోషనల్ అయినా కూడా గేమ్ లో మాత్రం పోటీపడి ఆడారు. కింగ్ నాగార్జున కూడా మోనాల్ తెలుగు నేర్చుకోవడం, టాస్క్ లో బాగా ఆడడం చూసి చాలా సార్లు మెచ్చుకున్నారు.
గ్రాండ్ ఫినాలేకి ఇంకా వారం రోజులు ఉన్నప్పుడు, టాప్ సిక్స్త్ కంటెస్టెంట్ గా మోనాల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేశారు. అయితే ఫైనల్స్ కి కొంచెం దూరంలో ఎలిమినేట్ అయిన మోనాల్ తీసుకున్న రెమ్యూనరేషన్ విషయంపై ప్రస్తుతం రూమర్స్ వినిపిస్తున్నాయి. సమయం కథనం ప్రకారం మోనాల్ ఒక వారానికి 2 నుండి 2.5 లక్షల రూపాయల వరకు పారితోషకం అందుకున్నారట.
హౌస్ లో ఉన్న 14 వారాలకి కలిపి మోనాల్ దాదాపు 30 లక్షల రూపాయలు అందుకున్నారు అని సమాచారం. ఈ సీజన్ లో అందరి కంటే ఎక్కువగా వారానికి మూడు లక్షలకు పైగా పారితోషకం లాస్య, తర్వాత అవినాష్ అందుకున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.