కరోనా సమయంలో జాబ్ పోయింది…ఇప్పుడు సైకిల్ పై టీ అమ్ముతూ ఎంత సంపాదిస్తున్నారో తెలుసా.?

కరోనా సమయంలో జాబ్ పోయింది…ఇప్పుడు సైకిల్ పై టీ అమ్ముతూ ఎంత సంపాదిస్తున్నారో తెలుసా.?

by Mohana Priya

Ads

కరోనా సమయంలో ఎంత మంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యల తర్వాత ప్రజలు అంతగా ఇబ్బంది పడింది ఆర్థిక సమస్యల కారణంగానే. ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. ఎన్నో సంస్థలు ఆర్ధికంగా వెనకబడ్డాయి. ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు ఉండేది.

Video Advertisement

ఈ కారణాల వల్ల ఎంతో మంది తమ మానసిక ప్రశాంతతకు దూరమయ్యారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వారిలో మహేంద్ర వర్మ ఒకరు. జాబ్ కోల్పోవడంతో మహేంద్ర వర్మకి రెండు, మూడు నెలలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దాంతో టీ అమ్మకాల రూపంలో తన ఉపాధిని ఏర్పరచుకున్నారు మహేంద్ర వర్మ. ఢిల్లీలోని టికరీ బార్డర్ ప్రాంతంలో పాత సైకిల్ వెనుక ఒక ట్రే ఏర్పాటు చేసి, వాటిలో టీ ఫ్లాస్క్ లు పెట్టి ఐదు రూపాయలుకి టీ, పది రూపాయలకి కాఫీ విక్రయిస్తున్నారు. ఇది చలికాలం కావడంతో టీ, కాఫీ తాగే వారి సంఖ్య కూడా పెరిగింది. దాంతో విక్రయాలు కూడా పెరిగాయి.

దీనిపై మహేంద్ర వర్మ మాట్లాడుతూ 10 గంటల పాటు ఉద్యోగం చేస్తే నెలకి 12000 జీతం వచ్చేది అని, అదే ఇప్పుడు సైకిల్ పై టీ అమ్మితే నెలకు 40000 వస్తున్నాయని, ఉద్యోగం పోయినా కూడా టీ అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నాను అని గర్వంగా చెప్పుకుంటున్నారు మహేంద్ర వర్మ. మనం ఏ పని చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు, మనం మన పనిని ఎంత గౌరవిస్తున్నాం అనేది మాత్రమే ముఖ్యం అనే దానికి ఉదాహరణగా నిలిచారు మహేంద్ర వర్మ.


End of Article

You may also like