సోషల్ మీడియా ఒకరిని బాగా ఫేమస్ చేస్తే ఒకరు సోషల్ మీడియా వల్ల బాగా ఇబ్బందులు పడుతుంటారు. సోషల్ మీడియా వల్ల మంచి ఉంది చెడు ఉంది. అసలు ఏటువంటి గుర్తింపు లేని వారికి మంచి గుర్తింపు తీసుకువస్తుంది. ఒక్కోసారి ఆ గుర్తింపు బాగా ఇబ్బందుల్లోకి నేడుతుంది. దీనికి ప్రత్యేక ఉదాహరణ కుమారి ఆంటీ. ప్రస్తుతం ఈమె గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
హైదరాబాదులో రోడ్డు సైడ్ ఫుడ్ బిజినెస్ పెట్టుకుని బాగా పాపులర్ అయింది. ఇంస్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ వీడియోస్ లో ఎక్కడ చూసినా ఈమే గురించే కనిపిస్తుంది.ఈమె బాగా ఫేమస్ అవడంతో ఈమె ఫుడ్ స్టాల్ వద్దకి జనం ఎక్కువైపోయారు. ఆమె వద్ద తినేవారికన్నా చూడడానికి వచ్చేవారు, యూట్యూబర్ లు ఎక్కువగా రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు ఆమె ఫుడ్ స్టాల్ ను మూయించేశారు. పాపం ఇప్పుడు ఈమె జీవనోపాధికి గండి పడింది.
Not Fair at all..Just when she was turning out be a inspiration to many Women to start their own bussiness to support their family…was one of the Strongest Female empowerment examples I have seen in the recent past ..
My Team and I are getting in touch with her to do what Best… https://t.co/HJexa3bhNd— Sundeep Kishan (@sundeepkishan) January 30, 2024
గతవారం ఈమె వద్దకి ఊరి పేరు భైరవకోన మూవీ టీం కూడా ప్రమోషన్స్ కి వెళ్ళింది. ఇప్పుడు ఈ విషయం హీరో సందీప్ కిషన్ వద్దకు చేరింది. దీనిపైన ఆయన స్పందించారు. ఈమె ఎంతో మందికి స్ఫూర్తి… తన కాళ్ళ మీద తాను నిలబడి వ్యాపారం చేసుకుంటుంది…. ఈమెను ఎలా ఎందుకు చేశారు. ఆమెతో నా టీం టచ్ లో ఉంది వీలైనంత సహాయం చేస్తాను అంటూ పోస్ట్ పెట్టారు. సందీప్ కిషన్ స్పందించిన తీరుకి సోషల్ మీడియాలో పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.
Also read: ఫేమస్ అవ్వడమే ఈమెకు పెద్ద కష్టం తెచ్చిపెట్టిందిగా.? తప్పు ఎవరిది.?