యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎనర్జీకి మారుపేరుగా ఉండేవారు. డ్యాన్స్, ఫైట్లలో అతని హుషారే వేరు. సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. పిల్లా నువ్వు లేని జీవితం వంటి సినిమాలలో సాయి ధరమ్ తేజ్ వేసిన డ్యాన్స్, స్టైల్‌కు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులందరు ఫిదా అయ్యారు.
సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’. ఈ మూవీ జులై 28న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతున్న సమయంలో అతని మాట తడబడింది. దాంతో నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తాజాగా జరిగిన ‘బ్రో’ ప్రి రిలీజ్ వేడుకలో సాయిధరమ్ తేజ్ ప్రసంగిస్తూ ఫ్యాన్స్ కు థ్యాంక్ యు చెప్పబోతుండగా, సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఇది చూసిన కొందరు తేజ్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మందు కొట్టి వచ్చడేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే యాక్సిడెంట్ నుండి కోలుకున్న తరువాత సాయిధరమ్ తేజ్ మాట్లాడే విషయంలో ఇబ్బంది పడుతున్నాడు.
ఇంతకుముందులా అతను క్లారిటీగా, గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. రెండేళ్ల క్రితం సాయిధరమ్ తేజ్ రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. కోమలోకి వెళ్ళినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని నెలల పాటు హాస్పటల్ లో ఉన్నాడు. తర్వాత ఇంటికి వచ్చినా కొన్ని నెలల పాటు బయటికి రాలేదు. ఆ తర్వాత కోలుకుని చిత్రాలు చేస్తున్నప్పటికీ తేజులో మునపటి జోష్ లేదు.
స్వయంగా సాయిధరమ్ తేజ్ మునపటిలా, పూర్తి ఆరోగ్యంతో లేనని పలు ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా చెప్పాడు. ఆ విషయం తెలిసినప్పటికి కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు సాయిధరమ్ తేజ్ సపోర్ట్ గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీస్ ఫర్ యూ అనే ఇన్ స్టా పేజీలో ఒక క్లిపింగ్ షేర్ చేసి, ‘అన్నకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి సరిగ్గా మాట్లాడలేక పోతున్నాడు. దాన్ని పట్టుకుని తాగేసివచ్చాడు అని అంటారెంటిరా?’ అని రాసుకొచ్చారు.
watch video :
https://www.instagram.com/reel/CvIVvukJs8D/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: హీరో నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు..! ఎందుకంటే..?

ఎంఎస్ ధోనీ 1981లో జూలై 7న రాంచిలో పాన్ సింగ్, దేవకీ దేవిలకు జన్మించాడు. ధోనీకి అక్క జయంతి గుప్తా మరియు అన్న నరేంద్ర సింగ్ ధోని కలరు. ధోని తండ్రి పాన్ సింగ్ చిన్న ప్రభుత్వోద్యోగిగా పని చేశారు. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉండే కష్టాలన్నీ వారు అనుభవించారు. ధోనికి టికెట్ కలెక్టర్‌గా జాబ్ వచ్చినా, ధోనికి చిన్నతనం నుండే క్రికెటర్ కావాలని, ఎప్పటి కైనా దేశం కోసం ఆడాలని బలంగా కోరుకునేవాడు. ఈ విషయం తన తండ్రికితో చెప్తే, ఇవి మనకు సాధ్యం కావని వెనుకడుగు వేశారట.
అలాంటి సమయంలో తమ్ముడు ధోనీకి జయంతి గుప్తా అండగా నిలిచింది. వారి తల్లిదండ్రులకు తమ్ముడి ఆశయం గురించి నచ్చజెప్పి, వాళ్లకు అర్ధమయ్యే విధంగా చేసింది. ధోనికి ఎటువంటి సహాయం అవసరమైన ఆమె ముందుండేది. అలా ఇంట్లో వాళ్లందరిని ఒప్పించి, ధోని క్రికెటర్ గా ప్రయాణం ప్రారంభించిన సమయంలో జయంతి గుప్తా అతనికి ఆర్థికంగా, నైతికంగానూ అండగా నిలిచింది. అలా కెరీర్ మొదలు పెట్టిన ధోనీ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెటర్లలో ఒకరిగా ఉన్నారు.
ధోనీ ఆస్తి విలువ 1000 కోట్ల పైగా ఉన్నప్పటికీ, జయంతి గుప్తా మాత్రం తక్కువ ప్రొఫైల్‌ను మెయింటెన్ చేస్తూ, మీడియాకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఆమె ప్రస్తుతం రాంచీలోని ఒక గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నారని నేషనల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. జయంతి గుప్తా ధోని ప్రాణ మిత్రుల్లో ఒకరైన గౌతం గుప్తాను పెళ్లి చేసుకుంది. జయంతితో పాటు గౌతం కూడా దేశవాళీ క్రికెట్ ఆడే సమయంలో ధోనికి అండగా నిలచినట్లు కొన్ని వార్తా కథనాలు వెల్లడించాయి. ధోని బయోపిక్ మూవీలో కూడా జయంతి గుప్తా క్యారెక్టర్ ఉన్న విషయం తెలిసిందే.
మరీ ఎత్తుగా లేకుండా, తక్కువ ఎత్తులో ఉండే తలగడను ఎంచుకోవాలి. పెద్ద తలగడ పెట్టుకోవడం వల్ల ప్రారంభంలో ఏమి తెలియకున్న కొద్ది రోజులు గడిచిన తరువాత మెడ నొప్పి మొదలవుతుంది. దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే దీర్ఘకాలికంగా ఈ నొప్పి బాధించే అవకాశం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే వెన్ను నొప్పిగా అనిపిస్తే వెంటనే దిండు తీసేసి నిద్రపోవాలని చెబుతున్నారు. ఎత్తుగా ఉండే తలగడ ఉపయోగించడం వల్ల వెన్నెముక వంగిపోయి ప్రమాదం ఉందని అంటున్నారు.
అలా జరిగినపుడు డిస్క్‌ల మధ్య దూరం పెరిగిపోతుంది. దాంతో వెన్నునొప్పి వస్తుందట. చాలా మంది నిద్ర పోయేటప్పుడు దిండులో ముఖాన్ని పెట్టుకుని నిద్రపోతారు. దీనివల్ల శ్వాసకు ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ చర్మం ఉపరితలం పై రంధ్రాలలో గాలికి ప్రవేశం ఉండదు. దాంతో ముఖం పై జిడ్డు ఏర్పడుతుంది. అది బ్లాక్ హెడ్స్ కి దారి తీస్తుంది.
ఎత్తయిన తలగడ పెట్టుకోవడం వల్ల తలకి రక్త ప్రసరణ సరిగ్గా జరగదని, ఫలితంగా జుట్టుకు అవసరమైన పోషణ లభించదట. దానివల్ల జుట్టు రాలే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా బాడిలోని కొన్ని భాగాలకి రక్త ప్రసరణ సరిగ్గా జరుగక వారికి తరచుగా తిమ్మిర్ల సమస్యలు వస్తాయని అంటున్నారు. అందువల్ల తక్కువ ఎత్తుగా, మెత్తగా ఉండే తలగడను ఉపయోగించాలి. ఇలా చేయడంతో నిద్ర చక్కగా పడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
ఇటీవలే ఏడవ సీజన్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ షో అభిమానులు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో మొదట్లో వచ్చిన సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. కానీ ఆ తర్వాత ఈ రియాల్టీ షో పై విమర్శలు ఎక్కువయ్యాయి.
సీపీఐ లీడర్ నారాయణ ‘బిగ్ బాస్’ షో పై పలుమార్లు కౌంటర్స్ కూడా వేశారు. ఈ షో వల్ల యువత, పిల్లలు, చెడిపోతున్నారని ఆరోపించారు. హౌస్ లో పోటీదారుల మధ్య అశ్లీలత, అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని కోర్టులో నారాయణ పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ తో హైకోర్టు బిగ్ బాస్ షోని ఆపేయాలని తీర్పు ఇచ్చింది.
గతంలో వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే హోస్ట్ నాగార్జునకు మరియు షో ప్రసారం అవుతున్న ఛానెల్‌కి కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే ఈ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని వెల్లడించింది. ఈ కేసు నెక్స్ట్ విచారణని నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే గతంలో చాలాసార్లు ఈ షో పై ఇటువంటి పిటిషన్స్ కోర్టులో దాఖలు అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి అడ్డంకి లేకుండా బిగ్ బాస్ షో కొనసాగింది.
యోగా ప్రకారంగా, స్త్రీలు బొట్టు పెట్టుకునే స్థలాన్ని అజ్ఞా చక్రం అని అంటారు. ఈ చక్రాన్ని మనిషి శరీరంలో 6వ, మరియు అత్యంత శక్తివంతమైన చక్రం. బొట్టు పెట్టుకునే సమయంలో ఈ పాయింట్‌ను రోజుకు అనేక సార్లు ప్రెస్ చేస్తుంటారు. శరీరంలో వేల సంఖ్యలో నాడులు ఉంటాయి. ఈ నాడులన్నిటికి కేంద్ర స్థానమే ఈ అజ్ఞా చక్రం. ఈ స్థానంలో కళ్లు, తల, పిట్యూటరీ గ్రంధి, మెదడుకి సంబంధించిన నాడులు ఉంటాయి.
మహిళలు బొట్టు పెట్టుకునేప్పుడు లేదా స్టిక్కర్ పెట్టుకునే సమయంలో ప్రెస్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆజ్ఞా చక్రం పై ఒత్తిడి పడుతుంది. అప్పుడు నాడులు అన్నీ ఉత్తేజం అవుతాయి. ఇక పురుషులు బొట్టు పెట్టుకోరు. అందువల్ల వారు ఆ స్థానంలో కుంకుమను ధరించినా, లేదా వంద సార్లు ఆ స్థానాన్ని ప్రెస్ చేసినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ దీక్షా తెలిపారు. ఆ ప్రయోజనాలు ఏమిటంటే..
1. తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
తరుణ్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘అశ్విన్స్’. ఈ మూవీని విరూపాక్ష ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై నిర్మించాడు. ఈ మూవీ కథ విషయానికి వస్తే అర్జున్ (వసంత్ రవి), రీతూ (సరస్వతి మీనన్) ఇద్దరు భార్యభర్తలు. వీరు ముగ్గురు ఫ్రెండ్స్ రాహుల్, వరుణ్, గ్రేస్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతుంటారు. ఈ ఐదుగురు యూట్యూబర్స్ డార్క్ టూరిజం పైన ఒక ఎపిసోడ్‌ను షూట్ చేయడం కోసం లండన్‌లో ఒక దీవిలో ఉండే బంగ్లాలోకి వెళ్తారు.
ఆ బంగ్లాలో ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అయిన ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ ఉందని, అక్కడి వెళ్లిన 15 మందిని చంపిందనే ప్రచారం ఉంటుంది. అర్జున్ టీమ్, ఆ బంగ్లాలో తిరిగే ఆత్మలను, అరుపులను కెమెరాలో బంధించడానికి ప్రయత్నిస్తారు. వారికి ఆ బంగ్లాలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు ఏంటి? ఆర్తి రాజగోపాల్ ఎలా మరణించింది? అసలు ఆ బంగ్లాలో ఏముంది? అశ్వినీ దేవతలు ప్రసాదించిన బొమ్మలు కనుగొన్న ఆర్తి రాజగోపాల్ కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనవాళ్లను రక్షించుకోవడం కోసం అర్జున్ ఏం చేశాడు? అనేది ‘ఆశ్విన్స్’ కథ.
మంచి, చెడు రెండింటినీ నియంత్రించే శక్తి మనిషికి మాత్రమే ఉందనే మెసేజ్ ను ఈ మూవీ ద్వారా దర్శకుడు చూపించారు. దర్శకుడు తరుణ్ తేజ సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, దానిని స్క్రీన్ పై చూపించడంలో కాస్త తడబడ్డాడు. అశ్విన్స్ మూవీ హారర్ మరియు మైథాలజీ కలిపి తెరకెక్కించిన ఒక డిఫరెంట్ సినిమా. హారర్ సినిమాలను ఇష్టపడేవారిని ఈ మూవీ ఆకట్టుకుంటుంది.
ధోని పేరుతో ఉన్న ఒక ఓల్డ్ అపాయింట్మెంట్ లెటర్ తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది 2012కు సంబంధించిన లెటర్. ఇండియన్ సిమెంట్స్ సంస్థలో ధోనిని వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు సెలెక్ట్ చేసినట్లుగా ఆ లెటర్లో ఉంది. ఈ పోస్టుకి నెలకు శాలరీ రూ. 43వేలు (రూ.12,650-47,650)గా ఉంది.
జీతంతో పాటుగా స్పెషల్ పే రూ 20వేలు అని, ఫిక్స్డ్ అలెవెన్స్ రూ. 21,970 అని ఉంది. ఇవీ మాత్రమే కాకుండా హౌస్ రెంటల్ అలెవెన్స్ కి రూ.20,400, ప్రత్యేక హౌస్ రెంట్ అలెవెన్స్ కి రూ.8,400 (సబ్ ప్లాంట్స్‌లో వరక చేసినట్లయితే అదనంగా మరో రూ.8 వేలు) వార్తా పత్రిక ఖర్చులకు గాను 175 రూపాయలు, బెనిఫిట్స్ లేని ప్రత్యేక అలెవెన్స్ కి గాను 60వేల రూపాయలు ఇవ్వనున్నట్లు అపాయింట్మెంట్ లెటర్లో తెలిపారు.
మొత్తంగా చూస్తే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కి గాను ధోని దాదాపు లక్షా 60వేల రూపాయలకు పైగా నెల జీతంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఈ లెటర్‌ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఆ సమయానికి వేల కోట్లు ఆర్జిస్తున్న ధోని ఈ ఉద్యోగం చేశాడా లేదా అన్న విషయాన్ని పక్కన బెడితే, ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ గా ధోని బ్రాండ్ వాల్యూను ఈ లెటర్ తెలియచేస్తోంది. ఇండియా సిమెంట్స్ అనేది చెన్నై సూపర్‌కింగ్స్‌కు అనుబంధ సంస్థ.
తెలుగు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు పడుతున్నప్పటికీ బేబీ మూవీ థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ యాబై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇందులో హీరోగా అనంద్‌తో పాటు విరాజ్ అశ్విన్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ‘బేబి’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఫిదా అవుతున్నారు.
ఈ మూవీలో నటించిన యాక్టర్స్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ వంటి సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేష్ ఒక ఇంటర్వ్యూలో తాజాగా సినిమాకి సంబంధించిన పలు విషయాలను తెలిపారు. సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ వైష్ణవి చైతన్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తారు.
హీరో ఆనంద్ హీరోయిన్ గురించిన ఆలోచనలతో తాగుతూ అలాగే ఉండిపోయినట్లు దర్శకుడు చూపించాడు. కానీ రెండవ హీరోగా నటించిన విరాజ్‌ను చూపించలేదు. ఆ విషయం గూర్చి అడుగగా, ‘క్లైమాక్స్‌లో విరాజ్ సన్నివేశాన్ని తీశాం. కానీ నిడివి పరంగా ఆ సీన్ ను తొలగించాల్సి వచ్చింది’ అని తెలిపారు. ఆ విధంగా చాలా సన్నివేశాలు కట్ చేశామని, వాటిని ఓటీటీలో చూపిస్తామని వెల్లడించారు.
కన్నడ సినిమా స్థాయి ఏమిటనేది కేజీఎఫ్ తో వెలుగులోకి వచ్చింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యష్ కేజీఎఫ్ 2 మూవీతో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు, మేకర్స్ దృష్టి కన్నడ చిత్రాల వైపు మరలింది. కేజీఎఫ్ చిత్రాలతో పాటుగా కాంతార, విక్రాంత్ రోణ, కిరిక్ పార్టీ, చార్లీ 777, వంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ స్థాయిని మరింతగా పెంచాయి. వాటి ద్వారా కన్నడ ఇండస్ట్రీ పేరు మార్మోగింది. అయితే ఆ తర్వాత ఆ రేంజ్ లో హిట్ పడలేదు.
చాలా రోజుల తర్వాత ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ సినిమాతో కన్నడ ప్రేక్షకులు ఊరట పొందారు. జూలై 21న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా యువతకి ఈ మూవీ కాన్సెప్ట్ కనెక్ట్ కావడంతో యూత్ ఎగబడి సినిమాని చూస్తున్నారు. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీతో నితిన్ కృష్ణమూర్తి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. హీరో రక్షిత్ శెట్టి, ఒకప్పటి హీరోయిన్ రమ్య, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిలు అతిథి పాత్రలలో నటించారు. ‘కాంతార’ మ్యూజిక్ డైరక్టర్ అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీని తన సంగీతంతో నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాడు.
ఇక ఈ కథ విషయనికి వస్తే, హాస్టల్ లో ఉండే యువకుల మధ్య సాగే కథ ఇది. అయిదుగురు కుర్రాళ్ళు హాస్టల్ లో ఒకే గదిలో ఉంటారు. అయితే అందులో ఒకరికి షార్ట్ ఫిల్మ్ ను తీయాలని అనుకుంటాడు. కానీ వారికి ఎగ్జామ్స్ ఉండటంతో మిగిలిన నలుగురు అందుకు ఒప్పుకోరు. ఆ టైమ్ లోనే హాస్టల్ వార్డెన్ మరణిస్తాడు. కానీ తన చావుకు ఈ అయిదుగురు కుర్రాళ్ళే కారణం అని ఒక లెటర్ రాసిపెట్టి చనిపోతాడు.
ఈ విషయం తెలిసి షాక్ అయ్యి, అందులో నుండి బయటపడడానికి సీనియర్ ను సాయం అడుగుతారు. ఆ తరువాత ఏం జరిగింది? అందులో నుండి అయిదుగురు కుర్రాళ్ళు బయటపడ్డారా? ఆ వార్డెన్ లెటర్ లో వీళ్ళే కారణం అని ఎందుకు రాశాడు? అనేది మిగతా కథ. దర్శకుడు ఈ మూవీ స్క్రీన్ ప్లేను సరదాగా నడిపించారు.
ఈ మూవీలోని ఒక అభ్యంతరకర సన్నివేశంలో సైంటిస్ట్ ఓపెన్‌హైమర్ భగవద్గీతలోని ఒక శ్లోకం చదువుతారు. అదే వివాదానికి దారి తీసింది. హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథం అయిన భగవద్గీతలోని శ్లోకాన్ని అభ్యంతరకర సన్నివేశంలో చదవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సైంటిస్ట్ ఓపెన్‌హైమర్ తనకు ఇష్టమైన పుస్తకాలలో భగవద్గీత ఒకటని చెప్పారు. భగవద్గీతను చదవడం కోసమే ఆయన సంస్కృతం నేర్చుకున్నారని ఒక సందర్భంలో తెలిపారు. న్యూ మెక్సికోలోని ఎడారిలో తొలిసారి 1945లో జులై నెలలో అణుబాంబును పేల్చడానికి 2 రోజుల ముందు ఓపెన్‌హైమర్ భగవద్గీతలోని శ్లోకాన్ని చదివారట.
కొన్నేళ్లకు ముందు శాస్త్రవేత్త ఓపెన్హైమర్కు బర్క్లీలోని ఒక టీచర్ సంస్కృత భాషని పరిచయం చేశారు. ఆ తరువాత సంస్కృతంలోని భగవద్గీత ఓపెన్హైమర్కు పరిచయమైంది. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలుంటాయి. భగవద్గీతను వరల్డ్ లోనే అత్యంత దీర్ఘ కవితగా పరిగణిస్తారు. అలాంటి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఓపెన్‌హైమర్ ప్రపంచ చరిత్రను మార్చే ఒక ఘట్టం మొదలుపెట్టడానికి చదివి తనపై ఉన్న తీవ్రమైన ఒత్తిడిని తొలగించుకున్నాడని తెలుస్తోంది.