మలయాళ సినిమాలలో ఒక సింపుల్ పాయింట్ ను తీసుకుని, దానిని తెరపై బలంగా చూపిస్తుంటారు. ఫీల్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ, తక్కువ పాత్రల మధ్య ఎమోషన్స్ ను ఎక్కువగా పండిస్తుంటారు. అలాంటి కంటెంట్ తో ఈ ఏడాది మే 12న థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రమే ‘జానకి జానే’.
ఈ చిత్రం మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 11న ప్రముఖ ఓటీటీ ‘హాట్ స్టార్’ లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా కంటెంట్ ఏమిటి? ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల వచ్చిన ‘గుడ్ నైట్’ సినిమాలో హీరోకు ‘గురక’ సమస్య ఉన్నట్టే, ‘జానకి జానే’ మూవీలో హీరోయిన్ కు ‘భయం’ అనే మానసిక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో ఈ మూవీలో చూపించారు. సైజు కురుప్, నవ్య నాయర్ ప్రధాన పాత్రలలో నటించగా, జానీ ఆంటోనీ, కొట్టాయం నజీర్, జార్జ్ కోరా, అనార్కలి మరికర్, షరఫ్ వంటివారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయనికి వస్తే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి జానకి (నవ్య నాయర్), చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఫ్యామిలీ భారం ఆమె పైనే పడుతుంది. అమ్మతో ఉంటూ ఒక ప్రెస్ లో వర్క్ చేస్తుంటుంది. అయితే జానకికి భయం ఎక్కువగా ఉంటుంది. గట్టిగా ఎవరైనా మాట్లాడినా, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలన్నా, చీకటిగా ఉన్న చాలా భయపడుతుంది. ఒకసారి భయంతో జానకి స్పృహ తప్పి పడిపోగా, రోడ్ కాంట్రాక్టర్ అయిన ఉన్ని ముకుందన్ (సైజు కురుప్) రక్షించి, ఇంటికి తీసుకెళ్తాడు.
జానకిని ప్రేమించిన ఉన్ని ముకుందన్ వారి పెద్దలను ఒప్పించి మరి జానకిని పెళ్లి చేసుకుంటాడు. సంతోషంగా సాగుతున్న వీరి లైఫ్ లో ఎదురైన అనుకోని సంఘటన ఏమిటి ? దాన్ని రాజకీయ ప్రత్యర్థులు అయిన షాజీ (కొట్టాయం నజీర్), మార్టిన్ (జార్జ్ కోరా) ఎలా ఉపయోగించుకున్నారు? దానివల్ల ఉన్ని, జానకి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఆఖరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

ఈ మూవీలో భార్యకు ఉన్న భయం అనే బలహీనత కారణంగా ఆ భార్యాభర్తల మధ్య, వారి కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు వచ్చేయనేదే ఈ మూవీ స్టోరీ. సాధారణంగా అందరికీ భయం అనేది ఉంటుంది. కానీ ఆ భయం యొక్క తీవ్రత పెరిగి, అది వేరేవారికి అవకాశంగా మారితే ఎలాంటి ఇబ్బందులలోకి నెడుతుందనేది చక్కగా చూపించారు. కొన్ని చోట్ల కొంచెం బోర్ ఫిల్ అయిన, అందమైన లొకేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
Also Read: బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 కంటెస్టెంట్స్ వీళ్లేనా..? లిస్ట్ మామూలుగా లేదు..!

ఇన్నాళ్లూ ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులని అలరించిన బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా, ఇప్పుడు ఒక ట్వీట్‌తో అనే కంటే ట్వీట్లోని రాసిన పదంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరో వైపు ఆ ట్వీట్ కి సంతోషంతో కూడా కామెంట్లు పెడుతున్నారు. బ్రో మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ యూనిట్ కు విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది.
ట్రోల్ చేసేంతగా ఆ ట్వీట్ లో ఏముంది అంటే “మా చిత్రం #BroTheAvatar రేపు 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం @పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ స్పేస్‌ను చేసుకోవడం సంతోషంగా ఉంది. మరణించిన తర్వాత తన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక వ్యక్తి సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనేదే ఈ కథ.’’ అని ఊర్వశి రౌతేలా రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అని అనడంతో నెటిజన్లు, ప్రత్యర్ధి పార్టీల ఫ్యాన్స్ మాత్రం ఊర్వశిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కల్కి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా కల్కి 2898 ఏడీ సినిమాకి సీక్వెల్ ఉంటుందని వినిపిస్తోంది. ఈ విషయం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అలాగే మూవీలో ప్రభాస్‌ను ఎందుకు తీసుకున్నారనే విషయం గురించి కూడా మాట్లాడారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ గురించి ఇప్పుడు తాను ఆలోచించడం లేదని నాగ్ అశ్విన్ అన్నారు. అలాగే ఈ మూవీ ఫ్రాంచైజీ గురించి కూడా ఇంత వరకు ఏం ప్లాన్ చేయలేదని చెప్పారు.
ఇక ‘కల్కి 2898 ఏడీ’ స్టోరీ రాసుకునే సమయంలో ఎవరు హీరో అయితే బాగుంటుందని ఆలోచించానని అన్నారు. ఆ సమయంలో ఆ క్యారెక్టర్ లో ప్రభాస్‌ను ఊహించుకునే ఈ స్టోరీ రాసుకున్నానని తెలిపారు. ఈ స్టోరీ కోసం తన ఆలోచనలో ప్రభాస్ మాత్రమే ఉన్నాడని, అందుకే ప్రభాస్ నే ఈ మూవీకి హీరోగా ఎంచుకున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు.
వల్లిపురం వసంతన్ ను నామ్ డి గెర్రే కెప్టెన్ మిల్లర్ అని పిలుస్తారు. శ్రీలంకలోని వేర్పాటువాద తమిళ మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) లో వసంతన్ సభ్యుడు. అతనే LTTE మొట్ట మొదటి బ్లాక్ టైగర్ గా పిలవబడ్డాడు. మిల్లర్ 1966లో జనవరి1న శ్రీలంకలో జన్మించాడు. అతను తున్నలైకి చెందిన వ్యక్తి. అతని తండ్రి బ్యాంక్ మేనేజర్, అతనికి ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వసంతన్ పాయింట్ పెడ్రోలోని హార్ట్లీ కాలేజీలో చదువుకున్నాడు.
బ్లాక్ జులై తమిళ వ్యతిరేక అల్లర్ల వల్ల బాధితులయినవారి బాధలను చూసి తీవ్రంగా ప్రభావితమైన వసంతన్ 1983లో LTTEలో డ్రైవర్‌గా చేరాడు. ఒక సంవత్సరం తర్వాత అతను LTTE సభ్యుడుగా మారాడు. అప్పుడే అతనికి నామ్ డి గెర్రే మిల్లర్ (మిల్లర్) అనే పేరు వచ్చింది. వడమరచ్చి ఆపరేషన్ (ఆపరేషన్ లిబరేషన్) టైమ్ లో శ్రీలంక ఆర్మీ నెల్లియాడి మధ్య మహా విద్యాలయాన్ని స్వాధీనం చేసుకుని సైనిక స్థావరంగా మార్చింది. భారీగా పటిష్టపరచబడిన ఆ స్థావరాన్ని స్వాధీనం చేసుకోవాలని LTTE నిర్ణయించింది.
దాని కోసం బాంబులతో నింపిన వాహనాన్ని ఆ స్థావరం మధ్యలోకి తీసుకెళ్లాడానికి మిల్లర్ తనకు తానే ముందుకు వచ్చాడు. దానికి ముందుగా మిల్లెర్ 1987లో జూన్29 కుటుంబాన్ని, స్నేహితులను కలిశాడు. అదే ఏడాది జూలై 5న LTTE ఒక ట్రక్కులో బాంబులను నింపారు. ఆ తరువాత మిల్లర్ ఆ ట్రక్కును నడుపుకుంటూ నెల్లియాడి మధ్య మహా విద్యాలయంలో ఉన్న ఆర్మీ క్యాంపులోకి తీసుకెళ్ళాడు. సైనికులు కాల్పులు జరపడంతో మిల్లర్ చనిపోయాడు. కాని ట్రక్ వెళ్తూ ప్రధాన భవనంలోకి దూసుకెళ్లి అక్కడ పేలిపోయింది.
పేలుడుతో బస్సు అంత పరిమాణంలో పెద్ద బిలం ఏర్పడింది. మిల్లర్ ట్రక్కును అనుసరిస్తూ వెళ్ళిన ఇతర LTTE కార్యకర్తలు ఆర్మీ శిబిరం మీద దాడి చేసి, స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎంతో మంది సైనికులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఈ సంఘటన అంతా వీడియో తీయబడింది. మిల్లర్ చనిపోయిన తరువాత కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు. మిల్లర్ LTTEలో గౌరవనీయమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అంతేకాకుండా LTTE ఆత్మాహుతి విభాగం బ్లాక్ టైగర్స్ చిహ్నం పై మిల్లర్ ముఖ చిత్రాన్ని పెట్టారు.
జూలై 5ను బ్లాక్ టైగర్స్ డే గా మార్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు బ్లాక్ టైగర్ అమరవీరులందరిని స్మరించుకునే రోజు. నెల్లియాడి మధ్య మహా విద్యాలయంలో మిల్లర్ బంగారు విగ్రహంతో పాటు ఒక మందిరాన్ని కూడా నిర్మించారు. అయితే 1996లో శ్రీలంక సైన్యం వడమరచ్చి ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత మిల్లర్ మందిరాన్ని ధ్వంసం చేశారు. కానీ స్థానికులు మిల్లర్ విగ్రహాన్ని దాచిపెట్టారు.
2002లో నార్వేజియన్ మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సమయంలో కొత్త స్మారక ఫలకంను మరియు మిల్లర్ విగ్రహంను తిరిగి స్థాపించారు. యుద్ధం మళ్ళీ ప్రారంభమైన తర్వాత, 2006లో ఆగస్టు23న మిల్లర్ విగ్రహం పై దాడి చేసి ధ్వంసం చేశారు. అలాగే మందిరం యొక్క అవశేషాలను, మిల్లర్ విగ్రహం ఉన్న వేదిక, రాతి స్మారక ఫలకంను కూడా సైన్యం ధ్వంసం చేసింది.
రామిరెడ్డి టాలీవుడ్ లో అంకుశం సినిమా ద్వారా నట జీవితాన్ని మొదలుపెట్టారు. ఈ మూవీలో ‘స్పాట్ పెడుతా’ అనే ఒక్క డైలాగ్‌తో ఆడియెన్స్ భయపడేలా చేశారు. దాంతో ఆయన పేరు అంకుశం రామిరెడ్డిగా మారింది. అసలు పేరు గంగసాని రామిరెడ్డి, ఆ మూవీ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో అప్పట్లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించారు. రామి రెడ్డి ఇండియాలోని అన్ని భాషల సినిమాలలో నటించారు.
1959లో జనవరి 1న జన్మించిన రామిరెడ్డి కెరీర్ మొదట్లో సినిమాల వైపు దృష్టి సారించలేదు. జర్నలిస్ట్ కావాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేశారు. అది పూర్తి కాగానే ఒక వార్తాపత్రికలో జర్నలిస్ట్‌గా చేరారు. అందులో భాగంగా సినీ సెలెబ్రెటీల ఇంటర్వ్యూలను రామిరెడ్డి తీసుకునేవారు. ఆ క్రమంలో రామిరెడ్డి ఒకసారి ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఇంటర్వ్యూ కోసం వెళ్లారు. అప్పుడు రామిరెడ్డి ప్రతిభను చూసి ముగ్ధుడైన కోడి రామకృష్ణ తను తీయబోయే సినిమాలో రామిరెడ్డికి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు.
అలా వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీనే అంకుశం. ఈ మూవీ రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీనే రామిరెడ్డి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ మూవినే బాలీవుడ్ లో ప్రతిబంధ్ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. ఆ మూవీలో కూడా విలన్ గా రామిరెడ్డి నటించాడు. అక్కడ ప్రతిబంద్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో చిరంజీవి కంటే విలన్ గా నటించిన రామిరెడ్డి యాక్టింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఫిదా అయింది. దాంతో బాలీవుడ్ లో రామిరెడ్డి భారీగా అవకాశాలు వచ్చాయి.
90వ దశకంలో, బాలీవుడ్లో రామిరెడ్డి పాపులర్ ఫేస్‌గా నిలిచారు. తెలుగు, హిందీలో నటిస్తూనే రామిరెడ్డి ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించారు. అలా ఆయన కెరీర్ మొత్తంలో దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్రిష్ పూరి, ప్రేమ్ చోప్రా, డానీ డెంజోంగ్పా,అమ్జాద్ ఖాన్, గుల్షన్ గ్రోవర్ వంటి విలన్లకు ఏ విధంగా తీసిపోని అరుదైన యాక్టర్ అయిన రామిరెడ్డి జీవితం మాత్రం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
రామిరెడ్డి చివరి వరకు తన నటనతో ఆడియెన్స్ ని అలరించాలని కోరుకున్నారు. కానీ 2010లో ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కాలేయ క్యాన్సర్‌తో ఉందని వైద్యులు గుర్తించి, రామిరెడ్డికి తెలిపారు. రోజురోజుకు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆఖరి రోజుల్లో అయితే రామిరెడ్డి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. చివరికి 2011 లో ఏప్రిల్ 14న 52 ఏళ్ల వయసులో రామిరెడ్డి కన్నుమూశారు.
చనిపోయే కొద్ది రోజుల ముందు నుండే భార్య, పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో ఆయన నరకం అనుభవించారని రామిరెడ్డి సన్నిహితులు చెబుతుంటారు. రామిరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలుస్తోంది. ఆయన కుమారుడు ప్రస్తుతం తండ్రి రామిరెడ్డి పేరుతో స్వీట్ షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నారని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే అభిమానులు ఎలా సంబరాలు జరుపుకుంటారో తెలిసిందే. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ జాతర చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ సంబరాలు ప్రారంభం అయ్యాయి.
పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ మూవీ తమిళ హిట్ సినిమా వినోదయ సిత్తంకు రీమేక్ గా తెరకెక్కింది. ఒరిజినల్ మూవీతో పోలిస్తే తెలుగు నెటీవీటికి తగ్గట్టుగా చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్, రోహిణి కీలక పాత్రలలో నటించారు.
ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని మీమ్స్ శాసిస్తున్నాయి. గతంలో వెస్ట్రన్ కంట్రీస్ లోనే ఈ ట్రెండ్ ఉండేది. ప్రస్తుతం ఇండియాలో కూడా మీమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే చిత్రాల పై కూడా ఫన్నీ మీమ్స్ చేసి నెటిజన్లు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన బ్రో మూవీ రిలీజ్ పై కూడా నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
ఈ షో తొలి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ కి హీరో నానిలు హోస్ట్ గా చేశారు. ఆ తరువాత సీజన్స్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తికాగా, ఏడవ సీజన్ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఏడవ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ అని సోషల్ మీడియాలో ఒక వార్త షికారు చేస్తోంది.
ఆ లిస్ట్ ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 7 లో ఈటివి ప్రభాకర్, యాంకర్ నిఖిల్, ఢీ కొరియోగ్రాఫర్ పండు, సింగర్ మోహన భోగరాజు, టిక్ టాక్ దుర్గారావు జంట, హీరో సాయిరోనక్, యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ వర్ష, సీరియల్ నటి శోభా శెట్టి లతో ఇప్పటికే ఒప్పందాలు జరిగినట్లుగా సమాచారం. మొత్తం 21 కంటెస్టెంట్స్ లో లీక్ అయ్యింది ఈ పది పేర్లు మాత్రమే.
మిగిలిన కంటెస్టెంట్స్ పేర్లు మరికొన్ని రోజుల్లో రివీల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అగ్రిమెంట్ల విషయంలో కొంత జాప్యం జరుగుతున్నందున స్టార్ మా ఛానెల్ కూడా షో ఎప్పటి నుంచి మొదలుపెడతారనే విషయం చెప్పడం లేదు. ప్రస్తుతానికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇటీవలే బిగ్ బాస్ టీమ్ కి ఏపీ హై కోర్టు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
1. స్పైడర్:
2. డియర్ కామ్రేడ్:
3. నాని వి:
4. అమిగోస్:
5. డిస్కో రాజా:
6. సవ్యసాచి:
7. నా పేరు సూర్య:
8. ఎంత మంచివాడవురా:
9. అంతరిక్షం:
10. ఆరెంజ్:
ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో వస్తే చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.
చదువు అనేది ప్రస్తుతం ఉన్న ఆడపిల్లలను ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వల్ల జీవితాన్ని నిలబెట్టుకుంటూ, తల్లిదండ్రుల తమ కోసం పడిన కష్టాన్ని అర్ధం చేసుకుని, ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు. అదే సమయంలో ఆర్ధికంగా నిలబడి తల్లిదండ్రులకు చాలా ఊతం ఇస్తున్నారు.
ఇది కాయిన్ కు ఒక వైపు. కానీ మరో వైపు బాధ్యత లేనటువంటి ఆడపిల్లలు నేను బాగా చదువుకున్నాను. నేను డిగ్రీ హోల్డర్ ని, నాకేంటి, ఎలాగైనా బ్రతికేస్తా అనే వైఖరి కనిపిస్తోంది. బాధ్యత లేని ఆడపిల్లలు ఒక విధనమైన ఇగో లేదా పొగరును చూపిస్తున్నారు. చేతిలో డిగ్రీ ఉందని, తామే గొప్పవారమనే భావనలో బయటికి వచ్చి, చేతిలో డిగ్రీ ఉందని, ఫాల్స్ థింకింగ్ లో ఉండిపోతున్నారు. ఎక్కడికెళ్ళినా, వీళ్ళు మాట్లాడిన మాటే జరగాలి అనే మొండితనంతో ప్రవర్తిస్తున్నారు.
ఈ మొండితనంను చిన్నతనం నుండే గమనించాల్సి ఉంటుంది. ఆ లక్షణాన్ని గమనించినపుడే వారికి నేర్పాల్సి ఉంటుంది. ఇగో అనేది ఆడపిలల్లకు పుట్టింట్లోనే చిన్నతనం నుండే ఎదిగేటపుడు వారితో పాటు ఎదుగుతూ వస్తుంది. ఇంట్లో వాళ్ళదే పై చేయిగా ఉండాలని, పెత్తనం చేయాలని చూస్తుంటారు. వాళ్ళకి జీవితం విలువ తెలియదు. అలాంటి వాళ్ళకి డబ్బు కూడా తెలియదని చెపుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్రింది వీడియోను చూడండి..
దేవుళ్ల పై చిత్రాలు తెరకెక్కించేటపుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఏం జరుగుతుందో ‘ఆదిపురుష్’ సినిమా ఫలితాన్ని చూస్తే తెలుస్తుంది. ఆ మూవీ ఎన్నో విమర్శలు, వివాదాల మధ్య డిజాస్టర్ గా నిలిచింది. ఆ మూవీ పై పీటీషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఆ ఎఫెక్ట్ వల్ల అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తోన్న ‘ఓఎంజీ 2’ సినిమా పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలు తెలిపినట్లు టాక్. ఆదిపురుష్ సినిమా సమయంలో చేసిన మిస్టేక్ ను ఈ మూవీ విషయంలో రిపీట్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే సెన్సార్ కన్నా ముందు, ఈ సినిమాలో ఆడియెన్స్ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఏమైనా డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయో పరిశీలించాలని సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీకి సూచించినట్లు సమాచారం. ఆ కమిటీ డిసిషన్ తర్వాత ఈ సినిమాకి సర్టిపికెట్ మంజూరు చేయడం కానీ, ఏమైనా మార్పులు సూచించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ పరిశీలించిన ఆనంతరమే సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది. మూవీ రిలీజ్ ను అప్పటి వరకు నిలిపివేయాలని కోరినట్లు టాక్ వినిపిస్తోంది.
కానీ చిత్రబృందం మాత్రం ఈ విషయన్ని కొట్టిపడేశారు. ఓఎంజీ 2 సెన్సార్ రిపోర్ట్ విషయంలో CBFC ఇంతవరకు తమకు ఎటువంటి అభ్యంతరాలు తెలుపలేదని వెల్లడించారు. ఓఎంజీ 2 సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటుగా పంజక్ త్రిపాఠి, అరుణ్ గోవిల్, యామీ గౌతమ్, గోవింద్ నమ్‌దేవ్ కీలక పాత్రలలో నటించారు. అమిత్ రాయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం మంగేశ్ దక్డే అందిస్తున్నాడు.