కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలిస్తే ఇంకెప్పుడు అలా చేయరు..!

కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలిస్తే ఇంకెప్పుడు అలా చేయరు..!

by kavitha

Ads

ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే నా కాలు మీద నా కాలు వేసుకుంటిని అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఆ డైలాగ్ లో చెప్పినట్టే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూన్నరా? అయితే అలా కూర్చోవడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, కాలు మీద కాలు వేసి కూర్చునేవారిలో 62 శాతం మంది తమ కాళ్ళను కుడి వైపు క్రాస్ చేసి కూర్చుంటారు. 26 శాతం మంది ఎడమ వైపు క్రాస్ చేసి కూర్చుంటారు. 12 శతం మంది ఎటు వైపు వీలయితే అటువైపు క్రాస్ చేస్తుంటారు.
Cross-Legged-Sittingసాధరణంగా అయితే అందరు రెండు రకాల విధానాలలో కుర్చీలో కూర్చుని కాళ్ళను ఒకదాని మీద మరొకటి వేస్తుంటాము. మోకాలి పై మరొక మోకాలిని క్రాస్ చేయడం, చీల మండల దగ్గర క్రాస్ చేసి కూర్చోవడం చేస్తుంటాం. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల హిప్స్ అమరికలో తేడాలు వస్తాయి. ఒకదానితో పోలిస్తే మరొకటి పెద్దగా అవుతుంది. అంతేకాదు కాలు, మోకాలు, పాదం వంటి శరీరంలోని క్రింది భాగాలకి రక్తప్రసరణలో మార్పులు వస్తాయి.
చీల మండలం దగ్గర క్రాస్ చేసి కూర్చోవడం కంటే మోకాలి పై మోకాలు వేసుకుని కూర్చోవడం అత్యంత ప్రమాదకరం అని చాలా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇలా కూర్చోవడం వల్ల సిరలలో రక్త ప్రసరణ వేగం తగ్గి రక్తపోటు అధికం అవుతుంది. కాలు మీద కాలు వేసుకుని సుధీర్ఘకాలం తరచు కూర్చుంటే కండరాలు పొడవు, పెల్విక్ బోన్స్ అమరికలో ధీర్ఘకాలీక మార్పులు వస్తుంటాయి. ముందుకు వంగిపోయే గుణం, భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. మెడ ఎముకలలో మార్పులు రావడంతో తల భాగం అమరికలో మార్పులు వస్తుంటాయి.
దాంతో మెడకు కూడా ప్రభావితం అవుతుంది. పొత్తికడుపు కాండరాల్లో, వెన్నుముక కింద భాగంలో కూడా మార్పులు రావచ్చు. ఒక వైపు పిరుదులు, కండరాలపైనే ఎక్కువ సమయం పాటు భారం పడడం వల్ల పొత్తికడుపు కూడా తన సర్దుబాటు లక్షణాలను కోల్పోయి బలహీనంగా మారుతుంది. గూని వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో భాగాలు అసాధారణమైన ఆకారంలో మారే ప్రమాదం ఉంది.
క్రాస్ లెగ్స్ వల్ల ఫైబులర్ నారాలుగా పిలిచే పెరోనియల్ నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి గురి అయిన వ్యక్తి తన కాలి వేళ్ళను, ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేరు. అయితే చాలా వరకు ఇది స్వల్పకాలికమే. కొన్ని నిముషాల తరువాత సాధారణ స్థితికి వస్తాయి. కాలు మీద కాలు వేసుకుని కూర్చోడం వల్ల సంతాన ఉత్పత్తి పై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఆ సమస్య కూడా వస్తుంది.

Also Read: మీ శరీరంలో ఈ 3 పార్ట్స్ లో నొప్పి వస్తోందా..? అయితే అది గుండె నొప్పికి సంకేతమే.. జాగ్రత్తపడండి..!

 

 


End of Article

You may also like