మీ శరీరంలో ఈ 3 పార్ట్స్ లో నొప్పి వస్తోందా..? అయితే అది గుండె నొప్పికి సంకేతమే.. జాగ్రత్తపడండి..!

మీ శరీరంలో ఈ 3 పార్ట్స్ లో నొప్పి వస్తోందా..? అయితే అది గుండె నొప్పికి సంకేతమే.. జాగ్రత్తపడండి..!

by Anudeep

Ads

ఈ మధ్యకాలంలో హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువైపోయాయి. హఠాత్తుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్లు కూడా కుప్పకూలి పోతుంటారు. ఏమైందో తెలిసేలోగా మరణించారని అంటారు.

Video Advertisement

ఇలా మరణించడానికి కారణం గుండెపోటు. అయితే గుండెపోటుకు సంబంధించి కొన్ని లక్షణాలు మాత్రం ముందుగానే కనబడుతూ ఉంటాయి. మనకి గుండె పోటు రాబోతోంది అని చెప్పడానికి మన శరీరం కొన్ని సంకేతాలను పంపిస్తూ ఉంటుంది.

ఇటీవల కాలంలో గుండెపోటుకు గురి అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే మరణాల రేటు ఎక్కువ అవ్వడానికి కూడా గుండెపోటు సమస్యలే ఎక్కువగా కారణం అవుతున్నాయి. ఇప్పటివరకు నమోదు అవుతున్న మరణాలలో 32 శాతం మరణాలు గుండెపోటు వలనే నమోదు అవుతున్నాయని అంచనా. అసలు వ్యాయామం చేయకపోవడం, అధిక వ్యాయామం, అనారోగ్య ఆహారపు అలవాట్లు గుండెపోటుకు దారి తీయడానికి ముఖ్య కారణాలు.

అయితే.. గుండెపోటు రాబోతోంది అని చెప్పడానికి సంకేతంగా మీ శరీరం ముందుగానే అలెర్ట్ చేస్తుంది. మీ శరీరంలో కొన్ని భాగాలలో మీకు నొప్పి వస్తూ ఉంటె.. మీకు గుండెపోటు రాబోతోందని అర్ధం. మీకు ఎక్కువగా ఛాతీ చుట్టూ నొప్పి వస్తోందా..? ఇది ముఖ్య లక్షణం. ఇలా తరచూ వస్తోందంటే మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అని అర్ధం. ఈ లక్షణం చాలా కాలం పాటు తీవ్రమైన ఒత్తిడిని కలుగ చేస్తూ ఉంటుంది.

ఇక చాల మందికి వెన్ను నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఛాతీనొప్పి గుండెపోటు లక్షణమే. వెన్ను నొప్పి కూడా ముందస్తు సంకేతంగా వస్తూ ఉంటుంది. ఎక్కువగా స్త్రీలలో ఇది కనిపిస్తూ ఉంటుంది. మరికొంతమందికి దవడ వద్ద నొప్పి వస్తూ ఉంటుంది. దవడ వద్ద కండరాలలో నొప్పి, ఛాతీ లో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వికారం, చెమటలు పట్టడం కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తూ ఉంటె.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.


End of Article

You may also like