ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సాయి రాజేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమా 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఈ మూవీలో నటించిన నటినటులందరికి గుర్తింపు లభిస్తోంది. యూట్యూబ్ స్టార్ అయిన వైష్ణవి చైతన్యకు మంచి గుర్తింపు వచ్చింది. నెగటివ్ క్యారెక్టర్ లో నటించినప్పటికీ ఆమె నటన పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆనంద్ తల్లిగా నటినంచిన నటికి ఎవరో ఇప్పుడు చూద్దాం..
‘బేబీ’ మూవీ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ కల్ట్ లవ్ స్టోరీ కి యూత్ బాగా కనెక్ట్ అవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ హిట్ అవడంతో చాలా మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్యకు మంచిపేరు వచ్చింది. కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ స్నేహితులుగా నటించినవారికి కూడా మంచి గుర్తింపు లభించింది.
ఈ మూవీతో సాయి రాజేశ్ దర్శకుడిగా మరో మెట్టు ఎక్కారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తల్లి పాత్రలో నటించిన నటి కూడా చాలా బాగా చేశారనే పేరు వచ్చింది. ఆమె పేరు ప్రభావతి వర్మ. ఎన్నో సినిమాలలో నటించిన ఆమెకు ఈ మూవీతో గుర్తింపు లభించింది. మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీలో హీరోయిన్ తల్లిగా నటించింది.
ఇటీవల జరిగిన బేబీ సక్సెస్ మీట్ లో ప్రభావతి వర్మ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు అయినట్లు తెలిపారు. ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలు చేసినప్పటికీ ఈ మూవీలో నటించిన తల్లి పాత్ర చాలా స్పెషల్ అని అన్నారు. ఎందుకంటే ఈ మూవీ ద్వారా ఆనంద్ తనకు కొడుకుగా లభించాడని, అది ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ప్రభావతి వర్మ వెల్లడించారు.
Also Read: గుంటూరు కారం నుంచి తమన్ అవుట్ అన్న వార్తలలో నిజం ఎంత…?



తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమాతో రీమా సేన్ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టారు. 2000 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ తరువాత వరుస అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారారు. తెలుగులో నటిస్తూనే గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘మిన్నలే’ అనే మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తెలుగులో ‘చెలి’ పేరుతో రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ హిట్ అవడంతో కోలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసింది. హిందీలో కూడా పలు సినిమాలు చేసింది. వల్లభ, యుగానికి ఒక్కడు వంటి సినిమాలలో నెగెటివ్ పాత్రల్లో నటించి, విమర్శకుల ప్రశంసలతో పాటు, అవార్డ్స్ అందుకున్నారు. ఆమె 2012లో ఢిల్లీ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2013 లో ఈ రీమాసేన్ బాబుకు జన్మనిచ్చింది. అతని పేరు రుధ్రవీర్.
రీమాసేన్ సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ, ఆమె ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో తరచుగా అభిమనులతో పంచుకుంటుంది. ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అదేవిధంగా, రీమాసేన్ తన భర్త, కుమారుడు మరియు స్నేహితులతో గడిపిన స్నాప్షాట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
చాలా రోజుల నుండి ఐపీఎల్ నుండి ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి ధోని ఈ సంవత్సరమే తప్పుకోవాల్సింది. కానీ తదుపరి జట్టు కెప్టెన్ ఎవరు అనే విషయం పై స్పష్టత రాకపోవడంతో ధోనీ తన రిటైర్మెంట్ ను వాయిదా వేసుకున్నారని, అది ఇప్పుడు పూర్తి అయ్యిందని, అందువల్ల ధోని ఎప్పుడైనా తప్పుకోవచ్చు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అంబటి రాయుడు, సిఎస్కే నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూనే, యువ క్రికెటర్ పై ప్రశంసలు కురిపించి, పరోక్షంగా అతనే తదుపరి కెప్టెన్ అని తెలిపాడు. యంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ పై రాయుడు ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ ధోనీలా ప్రశాంతంగా ఉంటాడని అన్నారు. అతనిలో లీడర్ షిప్ లక్షణాలు దాగున్నాయని, ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ల సహాయంతో రుతురాజ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎక్కువ కాలం సేవలు అందించగలడని వెల్లడించారు.
ఆసియన్ గేమ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ భారత పురుషుల టీమ్ కు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమ్ ఇండియా ప్రదర్శన మీదనే రుతురాజ్ సీఎస్కే కెప్టెన్సీ ఆధారపడి ఉంటుంది. టీమిండియా ఒకవేళ స్వర్ణం సాధించినట్లయితే సిఎస్కే నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు జవాబు దొరికినట్లే.
ప్రభాస్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ టైటిల్ ప్రకటనకు ముందు చిత్ర యూనిట్ ‘ప్రాజెక్ట్ – K’ అంటే ఏంటి? అని ఆడియెన్స్ కి పజిల్ విసిరింది. దాంతో K అంటే కల్కి, కాలచక్ర, కలియుగ్ అంటూ పలు పేర్లు వినిపించాయి. కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ – K లో K అంటే కల్కి అని, మూవీ టైటిల్ ను ‘కల్కి 2898 ఏడీ’ అని ప్రకటించారు. ఈ గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
‘లోకం అంతా చీకటిలో కూరుకుపోయినప్పుడు, ఆ చీకటిని, అందుకు కారణం అయిన వారిని పారదోలడానికి ఒక శక్తి ఉదయిస్తుందని, ఆ శక్తి కథనే ‘కల్కి’ అని క్లుప్తంగా గ్లింప్స్ తెలియజేశారు. దీంతో ప్రభాస్ శ్రీమహావిష్ణువు అవతారాలలో పదవ అవతారమైన ‘కల్కి’ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ప్రభాస్ కన్నా ముందుగా తెలుగులో మరో హీరో ‘కల్కి’ గా నటించాడు. ఆ హీరో మరెవరో కాదు. రైటర్ కమ్ డైరెక్టర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్.
అడివి శేష్ మొదటి మూవీ ‘సొంతం’. అందులో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తరువాత తానే రచయితగా, దర్శకుడిగా మారి తానే హీరోగా ‘కర్మ’ అనే చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం 2010లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ‘దేవ్’ అనే పాత్రలో నటించిన శేషు, మూవీ మొదట్లోనే ఎండింగ్ ను ఊహించి చెప్తాడు. సరైన ప్రమోషన్ లేకపోవడంతో ఆడియెన్స్ కి ఈ మూవీ గురించి పెద్దగా తెలియలేదు. 13 సంవత్సరాల క్రితమే అడివి శేష్ ‘కల్కి’గా నటించాడు.
1. అంబటి రాయుడు:
2. కరుణ్ నాయర్:
3. వసీం జాఫర్:
4. ఇర్ఫాన్ పఠాన్:
5 . దినేష్ కార్తీక్:
అప్పటికే జట్టులో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. దాంతో కార్తీక్ ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇక ధోనీ ఉండడం వల్ల అతను వికెట్ కీపర్‌గాను రెండవ స్థానంలో ఉండేవాడు. ఎంతో ప్రతిభ ఉన్నా దినేష్ కార్తీక్ భారత అత్యంత దురదృష్టకర క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు.
మరణించిన వారు బ్రతికి ఉన్నప్పుడు ఎంత సంపాదించినప్పటికీ, చనిపోయిన తరువాత వారు ఒక్క రూపాయిని కూడా తీసుకెళ్లలేరు అని చెప్పడానికే ఇలా డబ్బులు చల్లుతారు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే కాబట్టి న్యాయంగా, ధర్మంగా జీవించమని చెప్పడానికి కూడా ఇలా చేస్తారని కొందరు చెబుతారు. ఏ ప్రశ్నకైనా జవాబు దొరికే కోరాలో
“చనిపోయినవారి అంతిమయాత్రలో డబ్బులు చల్లటం అనేది పది, పదిహేను సంవత్సరాల నుంచే చూస్తున్నాం. ఇలా చల్లిన డబ్బులను ఎక్కువగా యాచకులు, చిన్నపిల్లలు ఏరుకుంటారు. ఈ విధంగా చేస్తే, నిరుపేదలకు మరణించిన వారి పేరు మీదుగా సహాయం చేశామనే తృప్తి వారి కుటుంబసభ్యులకు వుంటుంది. శవ యాత్రలో పూలు, పేలాలు చల్లటం వంటివి చాలా కాలం నుండి వుంది.
పూలు చల్లడం అంటే మరణించిన వారిని గౌరవించడం, దేవునిగా భావించడం కావచ్చు. పేలాలు చల్లడం వల్ల పక్షులు, క్రిమి కీటకాలకు ఆహారం వేసినట్టు భావన. ఇవి మనుషులకు కాదు అనడానికి గుర్తుగా ‘ హాస్యబ్రహ్మ ‘ జంధ్యాల గారు ఓ సినిమాలో ” శవం మీద పేలాలు ఏరుకుని తినే మొహం” అంటూ ఓ తిట్టు చేర్చారు!” అని వెంకట్ రమణ సూరంపూడి తెలిపారు.
ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. యూట్యూబ్ స్టార్‌గా పాపులర్ అయిన వైష్ణవి ఈ మూవీలో తన నటనలోని మరో కోణాన్ని తెరపై ఆవిష్కరించింది. వైష్ణవి నటనకు యువత ఎంతగా కనెక్ట్ అయ్యారంటే, మూవీ చూసిన వారు ఆమె క్యారెక్టర్ ని దారుణంగా తిడుతున్నారు. అద్భుతమైన నటనతో ఆనంద్ దేవరకొండ ఆడియెన్స్ కి కన్నీళ్లు తెప్పించాడు.
వీరిద్దరికీ కొంచెం కూడా తగ్గకుండా విరాజ్ అశ్విన్ తన నటనతో మెప్పించాడు. దాంతో 2 రోజులకే బ్రేక్ ఈవెన్ అయ్యి, ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి రూ.23.07 కోట్లు షేర్ ను సాధించింది. బ్రేక్ ఈవెన్ అవడమే కాకుండా ఈ మూవీ రూ.16.87 కోట్ల లాభాలను రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా అయ్యింది. ఇంతగా ఆకట్టుకున్న వీరికి ఇచ్చిన పారితోషికం గురించి తెలిసి, ఇంత తక్కువా? అని నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు.
దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో బేబీ మూవీని తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండకు దాదాపు రూ.80 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. హీరోయిన వైష్ణవికి రూ.30 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్‌గా ఇచ్చారని, ఇక విరాజ్ అశ్విన్‌కు కేవలం రూ.20 లక్షలు ఇచ్చారని నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. అయితే డైరెక్టర్ సాయి రాజేష్ కోటికి పైగా తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.