సినిమా చూసినంతసేపు తరువాత వచ్చే సన్నివేశం ఎలా ఉంటుందో అనే ఆసక్తి కలిగించకపోతే ఆ మూవీ విజయం సాధించలేదు. అదే విధంగా క్లైమాక్స్ ఊహించినట్లు ఉన్నా, ఏ మాత్రం ఆసక్తిగా లేకపోయినా, ఆ సినిమా ప్లాప్ అయినట్లే.
అందువల్ల సాధ్యమైనంత వరకు క్లైమాక్స్ లో శుభం కార్డు పడే ముందు ప్రేక్షకులని ఆశ్చర్యపరచడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో చాలామంది డైరెక్టర్లు విజయం సాధించారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కొన్ని చిత్రాలను విజయం సాధించేలా చేశాయి. ట్విస్ట్ తో ముగిసిన సినిమాలలో టాప్ 13 సినిమాలను ఇప్పుడు చూద్దాం..
1. పోకిరి:
తెలుగు సినిమా ప్రేక్షకులకు కదిలించిన క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాలలో ముందుగా ఉండేది పోకిరి మూవీ. కృష్ణమనోహర్ IPS అనే మాట ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.
2. అ మూవీ:
“అ” సినిమాలోని అన్నీ పాత్రలు, వాళ్ల కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ లో ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ట్విస్ట్ అందరికి షాక్ ఇచ్చింది.
3. రంగస్థలం:
అప్పటి వరకు ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి ఏ అస్సలు విలన్ అని అనుకునే ఆడియన్స్ కి అతను కాదు ఇంకో విలన్ ఉన్నాడు అని రివీల్ చేసే ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది.
4. బాహుబలి: ద బిగినింగ్:
ఈ మూవీలో క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ రెండవ పార్ట్ రిలీజ్ అయ్యేవరకు ప్రశ్నగానే మిగిలింది. అమరేంద్ర బాహుబలిని ఎవరు చంపారని శివుడు ప్రశ్నించగా, తానే బాహుబలిని చంపానని కట్టప్ప చెప్పడంతో మొదటి భాగం ముగుస్తుంది.
5. అనుకోకుండా ఒక రోజు:
మత్తులో ఉన్న హీరోయిన్ ఆ రోజు ఏం చేసింది అనేది క్లైమాక్స్ లో జగపతి బాబు రివీల్ చేస్తారు.
6. క్షణం:
అన్నసూయ మెయిన్ విలన్ అనే ట్విస్ట్ సరిపోలేదు, చివర్లో మరో ట్విస్ట్ ఇచ్చారు. సత్యదేవ్ అసలైన విలన్ అని రివీల్ చేస్తారు.
7. గూఢచారి:
చివర్లో హీరో తండ్రి మరణించలేదని అతనే ఉగ్రవాదులకు సాయం చేస్తున్నాడనే విషయం కథను మలుపు తిప్పుతుంది.
8. కేర్ అఫ్ కంచెరపాలెం:
ఇక కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీలో ప్రతి క్యారెక్టర్ మరియు పోరాట ప్రతి కథకి ఇట్టే కనెక్ట్ అవుతాయి. కానీ క్లైమాక్స్‌లో దర్శకుడు ఆ క్యారెక్టర్స్ అన్నీ ఒక్కరే అని ఇచ్చిన ట్విస్ట్ ఊహించనిది.
9. కుమారి 21F:
జైలు నుండి వచ్చిన హీరో కుమారిని పెళ్ళి చేసుకుంటాడు. పోలీసులు వెతుకుతున్న అతని ముగ్గురు ఫ్రెండ్స్ ను పట్టుకోలేక పొలీసులు కేసుని ముసివెయ్యాలని చుస్తారు. కానీ వారిని 3 ఏళ్లుగా హీరోనే సంకెళ్ళతో బంధించి ఉంచాడని క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తారు.
10. ప్రస్థానం:
సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ నటించిన ఈ మూవీ క్లైమాక్స్ కారణంగా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
11. మిస్సమ్మ:
భూమిక మిస్సమ్మగా అందరిని ఆకట్టుకుంది. చివరి వరకు ఒక శాడిస్టిగా చూపించి, క్లైమాక్స్ లో ఆమె అనారోగ్యాన్ని చెప్పిన తీరు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
12. నేనొక్కడినే:
నాజర్ రోల్ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి పాజిటివ్ గా చూపించి క్లైమాక్స్ లో అసలైన విలన్ గా చూపించడం అనే ట్విస్ట్ ఆశ్చర్య పరుస్తుంది.
13. జెంటిల్ మెన్:
ఈ మూవీలో చివరి వరకు నాని నే విలన్ గా కనిపించగా, క్లైమాక్స్ లో అతను విలన్ కాదని, వంశీ అని ట్విస్ట్ ఇస్తారు.
Also Read: “అంటే అది..!” అంటూ… “బాహుబలి ప్రొడ్యూసర్” ఇచ్చిన కౌంటర్ కి రాజమౌళి రిప్లై..! ఏం అన్నారంటే..?

ఈ మూవీ కథ విషయనికి వస్తే, జీవితంలో ఎన్నో కష్టాలు పడి, ఉన్నత స్థానానికి ఎదిగిన కోటీశ్వరరావు(సాయికుమార్) సడెన్ గా చనిపోవాలని అనుకుంటాడు. ఆ టైంలో కోటీశ్వరరావు ఉండే గ్రామానికి వచ్చిన ఒక స్వామిజీ అతని కష్టాన్ని విని ఒక వరమిస్తాడు. అయితే ఆ విషయం ఎవరికి చెప్పవద్దని అంటాడు. స్వామిజీ కోటేశ్వరరావుకు ఇచ్చిన వరం ఏమిటి? వరం పొందిన తరువాత కోటేశ్వరరావు జీవితంలో కష్టాలు పోయాయా? కోటేశ్వరరావు జీవితంలో నాగలక్ష్మీ (దీపాళీ), దీప (ఐశ్వర్య) ఎవరు అనేవాటికి సమాధానమే మిగిలిన కథ.
మనిషి అనే దానికన్నా డబ్బు మీదే ఆధారపడి జీవితం నడుస్తోంది అనే కథతో తెరకెక్కిన సినిమా. 20, 40, 60 వయసు స్టేజ్ ల వారీగా సాగిన ఈ స్టోరీలో సాయికుమార్, సాయి శ్రీనివాస్, ఆదిత్యా ఓం, పాత్రలను మలచిన తీరు బావుంది. ఆ సీన్స్ ను దర్శకుడు నడిపించిన విధానం బాగుంది. మంచి చేసినపుడు అది ఎక్కడికి పోదు అనే విషయాన్ని చక్కగా చూపించారు. కోటీశ్వరుడిగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. సాయికుమార్ డైలాగ్‌లు బాగున్నాయి.
ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన వ్యక్తిగా ఆదిత్య ఓం, బ్రేకప్ అయిన యువకుడిగా సాయి శ్రీనివాస్ చక్కగా నటించారు. రాజీవ్ కనకాల, సీవీఎల్ నరసింహరావు బాగా నటించారు. సాయి శ్రీనివాస్, ఐశ్వర్య క్యారెక్టర్లు యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. తొలిసారి డైరెక్షన్ చేసిన శాంతి కుమార్ స్టోరీనే బాగా రాశారు. కానీ తెరపై చూపించడంలో కాస్త తడబడ్డారు. ఫీల్ గుడ్ మూవీ అందించేందుకు ప్రయత్నించారు. ఎంత డబ్బు సంపాదించిన మనిషికి మన అనుకునే తోడు లేకపోతే వారి జీవితంలో సంతోషంగా ఉండదు అనడానికి నిదర్శనమే ‘నాతో నేను’ మూవీ.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘కల్కి 2989 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ గ్లింప్స్ పై ఆడియెన్స్ నుండి సినీ ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియన్ హాలీవుడ్ మూవీలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీ గురించి ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో, ‘గ్రేట్ జాబ్ నాగి మరియు వైజయంతి మూవీస్. ఒక ఫ్యూచరిస్టిక్ సినిమాని తెరకెక్కించడం చాలా కష్టమైన పని, మీరు దీన్ని సాధ్యం చేసారు. ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఇక మిగిలింది ఒక్క ప్రశ్న మాత్రమే, మూవీ రిలీజ్ ఎప్పుడు’ అని రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ పై జక్కన్న సన్నిహితులు, ఫాలోవర్స్, నెటిజెన్లు కౌంటర్లు వేస్తున్నారు. బాహుబలి మూవీ నిర్మాత శోభు యార్లగడ్డ ‘రిలీజ్ డేట్ గురించి అడుగుతోంది ఎవరో చూశారా అని సరదాగా ట్వీట్ పెట్టారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ స్మైల్ ఎమోజీలు పెట్టాడు.
రాజమౌళి శోభు యార్లగడ్డ ట్వీట్ కి ‘అంటే అది’ అని పాపులర్ అయిన లక్ష్మి సినిమాలోని బ్రహ్మానందం మీమ్ తో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ రాజమౌళిని ఉద్దేశించి ‘మీరు చాలా స్వీట్. చాలా హంబుల్. మీ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని ట్వీట్ చేశారు.
భార్యను పూలమాలతో, శాలువాతో సత్కరించాడు. ఆ తరువాత కేక్ కట్ చేయించి, స్వీట్లు పంచిపెట్టాడు. భర్త చేసిన ఏర్పాట్లను చూసి దీనా ఆనంద భాష్పాలు రాల్చింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన వారు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఆడదాని సక్సెస్ వెనుక ఒక అర్థం చేసుకునే భర్త ఉంటాడని ఒకరు కామెంట్ చేశారు. అంతగా ప్రేమించి భార్య కోసం ఎఫర్ట్ పెట్టే వాళ్లు దొరకాలంటే రాసి పెట్టి ఉండాలని ఒకరు కామెంట్ చేశారు.
ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ పై ఆడియెన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
భవిష్యత్తులో రాబోయే యుగాంతానికి సంబంధించిన స్టోరీ అని తెలుస్తుంది. సూపర్ పవర్స్ ఉన్న ఒక హీరో ప్రజలను ఎలా కాపాడాడు అనే థీమ్ తో తెరక్కెకుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్లింప్స్ లో ఒక రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న సైన్యం కనిపిస్తుంది. వాళ్ళందరికి లీడర్ గా నటించిన నటుడి పేరు శాశ్వత ఛటర్జీ.
ప్రముఖ బెంగాలీ నటుడు. ఈ యాక్టర్ ఈ మూవీతోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. హిందీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన శాశ్వత ఛటర్జీ, ఎన్నో సీరియల్స్ లో, వెబ్ సిరీస్ లలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. విద్యాబాలన్ నటించిన కహానీ మూవీ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత జగ్గా జాసూస్, దిల్ బేచారా, దోబారా, ధాకడ్ వంటి హిందీ చిత్రాలలో నటించారు.
‘బ్రో’ మూవీలో పవన్ కళ్యాణ్ టైమ్ గాడ్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో తన పాత్ర చిత్రీకరణను కేవలం 3 వారాల్లో పూర్తి చేశాడు. దాంతో పవన్ కళ్యాణ్ ఈ మూవీలో చేసేది గెస్ట్ క్యారెక్టర్ అని ఫ్యాన్స్, నెటిజెన్లు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయం పై సాయిధరమ్ తేజ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో 80-90 శాతం వరకు పవన్ కళ్యాణ్ ఉంటాడని తెలిపాడు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఈ మూవీలో 80-90 శాతం వరకు పవన్ కళ్యాణ్ ఉంటాడని తెలిపాడు. సినిమా మొదటి పదిహేను నిమిషాలు పవన్ కళ్యాణ్ లేకుండా స్టోరీ నడుస్తుందని వెల్లడించాడు. ఆ సమయంలో తన పాత్ర పైనే స్టోరీ నడుస్తుందని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడని చెప్పారు. అప్పటి నుండి క్లైమాక్స్ వరకు పవన్ క్యారెక్టర్ కొనసాగుతుందని, తన వెంటే ఎప్పుడూ ఉండే క్యారెక్టర్ పవన్ దని తెలిపాడు. మూవీలో గంట 50 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు.
మూవీలో తనకు ఒక డ్యూయెట్, పవన్ తో కలిసి మరో పాట ఉంటుందని, మిగిలిన రెండు సాంగ్స్ మాంటేజ్ తరహా పాటలని తెలిపాడు. పవన్ నటించింది దేవుడి పాత్రే కానీ గోపాల గోపాల సినిమాలో ఉన్నట్టు సీరియస్ గా ఉండదని, ఎంటర్టైనింగ్ గా, ఫ్యాన్స్ కు నచ్చేలా సముద్రఖని, త్రివిక్రమ్ తీర్చిదిద్దారని చెప్పాడు. పవన్ చాలా సరదాగా ఈ క్యారెక్టర్ ను చేశారని, ఇద్దరి మధ్య ఉండే బంధం ఈ మూవీకి హైలైట్ అని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు.
ఈ మూవీ భారతీయ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. ఈ గ్లింప్స్ తో ఆ విషయాన్ని మర్చిపోయేలా చేశారు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
అయితే కొందరు నెటిజెన్లు మాత్రం ఈ గ్లింప్స్ ని 2 హాలీవుడ్ సినిమాలని కలిపి తీసినట్టుగా ఉందని అంటున్నారు. హాలీవుడ్ సినిమాలు డూన్, స్టార్ వార్స్ ని కలిపి తీసినట్టుగా ఉందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక బీజీఎం ఐతే అదే సంతోష్ నారాయణ్ కాబట్టి ‘దసరా’ సినిమా బీజీఎం విన్నట్టుగా ఉందని అంటున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ K’ టైటిల్ రివీల్ అయింది. ఈ మూవీకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ‘ప్రాజెక్ట్ k’ లో ఏముంది? అనే విషయాన్ని గ్లిమ్ప్స్ రూపంలో చూపించారు. ఈ గ్లిమ్ప్స్ నిడివి 1 నిముషం 16 సెకన్ల ఉంది. ప్రభాస్ సూపర్ పవర్స్ ఉన్న హీరోగా కనిపించబోతున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. “ప్రపంచాన్ని చీకటి కమ్మినపుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడే అంతం మొదలవుతుంది ” అని ప్రారంభం అయిన గ్లింప్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సంతోషం కలిగించేలా ఉంది.
శాన్‌డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్లో విడుదలైన తొలి భారతీయ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ రికార్డ్ సృష్టించింది. ఈ వేడుకలో కమల్ హాసన్, హీరో ప్రభాస్, రానా దగ్గుబాటి తదితరులు సందడి చేశారు. ఇది ఇలా ఉంటే ‘కల్కి 2898 ఏడీ’ మూవీ గ్లింప్స్ పై నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
తాజాగా రిలీజ్ అయిన ప్రాజెక్ట్ K ప్రభాస్ ఫస్ట్ లుక్ లో సూపర్ హీరోలా ఉన్న బాడీకి ప్రభాస్ తలను అతికించినట్లుగా ఉందని ప్రభాస్ అభిమానులే నిరుత్సాహపడ్డారని తెలుస్తోంది. నెటిజెన్లు ఈ పోస్టర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెటిజెన్లు రిలీజ్ అయిన పోస్టర్లలో ఏది బాగుందో తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల ఇటీవల కాలంలో స్టార్ హీరోలు అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల నుండి పోస్టర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరుకారం మూవీ నుండి మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ పై నెటిజెన్ల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ నుండి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 నుండి అమ్మవారి గెటప్ లో ఉన్న అల్లుఅర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
మే నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. తాజాగా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ ఆరు సినిమాల పోస్టర్లలో పుష్ప, గుంటూరుకారం సినిమాల పోస్టర్లు బాగున్నాయని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ K మూవీని సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్ 2024లో జనవరి 12న రిలీజ్ కానుంది. హాలీవుడ్లో ప్రాజెక్ట్ కే సందడి మొదలైంది. మరి కొన్ని గంటల్లో ప్రాజెక్ట్ కే టైటిల్ గ్లింప్స్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్, కమల్ హాసన్, రానా వంటివారు అమెరికా చేరుకున్నారు.
ప్రాజెక్ట్ కే యూనిట్ కు స్వాగతం చెప్తూ అక్కడి వారు ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో దీపికా పదుకొనే సాండియాగోలో జరుగుతున్నఈ ఈవెంట్‌కు దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అది నిజమేనని, ప్రస్తుతం అక్కడ ‘హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్’ సమ్మె జరుగుతోంది.
దీపికా పదుకొనే ఈ అసోసియేషన్‌లో మెంబర్ గా ఉన్నారు. సమ్మె జరుగుతుండడంతో అందులోని మెంబర్స్ అయిన నటీనటులు సినీ ఈవెంట్స్ కానీ, ప్రమోషన్స్ లో కానీ పాల్గొనకూడదని యూనియన్ పేర్కొంది. అందువల్ల ప్రాజెక్ట్ K ఈవెంట్‌కు దీపిక హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారట.