రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రభాస్ నటించిన ‘సలార్’ ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ‘ప్రాజెక్ట్ కె’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.
ఈ చిత్రానికి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. చిత్ర బృందం తాజాగా ఈ మూవీ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ను డిజైన్ చేసిన వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీ సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ చిత్రం పై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరి నటులు కూడా నటిస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగాయి. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కీలక పాత్రలో నటిస్తోంది. టైం ట్రావెల్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి గ్లింప్స్ రేపు(జులై 21) విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ మూవీ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో ప్రభాస్ ఐరన్ మ్యాన్ లా కనిపిస్తున్నారు. గత చిత్రాలతో పోలిస్తే ‘ప్రాజెక్ట్ K’ లో ప్రభాస్ కొత్తగా కనిపించాడు. ఈ పోస్టర్ ను డిజైన్ చేసిన వ్యక్తి పేరు నిఖిల్ అనుదీప్. ఇతను ఒక గ్రాఫిక్ డిజైనర్. ఈ పోస్టర్ కన్నా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజి మూవీ పోస్టర్, వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ రష్మిక నటిస్తున్న మూవీ పోస్టర్ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్ “బ్రో” సెన్సార్ టాక్..! సినిమా గురించి ఏం అన్నారంటే..?


తాము ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్న విషయం కోర్టుకు చెప్పడంతో అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కంపెనీలో పనిచేస్తోన్న ఈ జంట అప్పటి నుండి కలిసి జీవించడం మొదలుపెట్టారు. కానీ, అఫిఫా తల్లిదండ్రులు, బంధువులు వారు పని చేసే దగ్గరికి వెళ్ళి అఫిఫాను బలవంతంగా తీసుకెళ్లారు. దాంతో సుమాయా పోలీసు స్టేషన్లలో కంప్లైంట్ చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు వారు తీసుకోలేదు. ఆ తర్వాత కేరళ హైకోర్టులో సుమాయా ఒక పిటిషన్ దాఖలు చేసింది. అఫిఫాను కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించింది.
అయితే వారు కోర్టు ఆర్డర్ పాటించకుండా తమకు టైమ్ కావాలని అడిగారు. ఆ తర్వాత జూన్ 10 రోజులకు అఫిఫాను కోర్టుకు ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు బెదిరిచడంతో అఫిఫా కోర్టులో సుమాయాతో కలిసి ఉండాలనుకోవడం లేదని తెలిపారు. అలాగే తన తల్లిదండ్రులతో ఉండాలనుకున్నట్లు అఫిఫా చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అఫిఫా సుమాయాకు ఫోన్ చేసి, కోర్టు ముందు చెప్పిందంతా కావాలని మాట్లాడింది కాదని, తన తల్లిదండ్రులు వైద్య చికిత్స చేయించారని తెలిపింది.
వనజా కలెక్టివ్ సంస్థ ద్వారా సుమాయా పోలీసుల సహాయంతో అఫిఫాను తన తల్లిదండ్రుల నుంచి రక్షించారు. కోర్టులో సుమాయాతో వెళ్లలేనని చెప్పిన పరిస్థితులను అఫిఫా బీబీసీకి వివరించారు. శారీరక సంబంధం కోసం మాత్రమే తాము కలిసి ఉండాలని అనుకుంటున్నామని అనేవారని, ఇలా ఆలోచించే వారితో మాట్లాడటం కూడా అర్థరహితం. తమను అర్థం చేసుకునే విధంగా వారిని మార్చలేం’’ అన్నారు. డాక్టర్లే మా బంధాన్ని అర్థం చేసుకోలేదని, సొసైటీ, తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకుంటారని సుమాయా, అఫిఫా చెప్పుకొచ్చారు.
హిరణ్యకశ్యప సినిమాని రానా చేస్తాడని చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఫైనల్ గా కామిక్ కాన్‌లో ఈ సినిమాని రానా ప్రకటించాడు. తన సొంత సంస్థలోనే ఈ సినిమాను రానా నిర్మించనున్నాడు. అమరచిత్ర కథ కామిక్స్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ రాయనున్నాడు. అయితే హిరణ్యకశ్యప మూవీని గుణశేఖర్ 2019లోనే ప్రకటించారు. ఇది భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు, హీరోగా రానాను ప్రకటించారు.
గుణశేఖర్ ఏళ్ల తరబడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పై వర్క్ చేశారు. ఈ చిత్రం గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్. తాజాగా రానా ప్రకటించడంతో గుణశేఖర్ అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఆయన చేసిన ట్వీట్ ఆ మూవీ గురించే అని అంటున్నారు. ట్వీట్ లో గుణశేఖర్, ‘దేవుడిని మీ స్టోరీకి ప్రధాన ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది’ అని రాసుకొచ్చాడు.
గుణశేఖర్ ఇందులో ఎవరి పేరును వెల్లడించనప్పటికీ, రానా, త్రివిక్రమ్ లను లక్ష్యం చేశారని సమాచారం. తన కష్టాన్ని మరిచిపోయి ఆ సినిమాని వేరే వారికి అప్పగించిన రానా, ఈ మూవీకి స్క్రిప్ట్ అందిస్తున్న త్రివిక్రమ్ లకు నైతికత లేదని గుణశేఖర్ ఫీల్ అవుతున్నట్టు నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు. కొందరు గుణశేఖర్ కు సపోర్ట్ చేస్తూ రానా, త్రివిక్రమ్ లను తిడుతున్నారు.
“బేబీ సినిమా ఎలా ఉంది? దానిపై మీ రివ్యూ ఏంటి?” అని కోరాలో ప్రశ్నించగా, దానికి
కాకపోతే కొన్ని ఎంత ఎక్స్ట్రీమ్ గా ఉంటాయంటే అసలు ఈ సినిమా తీయడం నిజంగా అవసరమా ? అన్న భావన కలుగుతుంది. ఆ కోవలోకే ఈ “బేబీ ” సినిమా వస్తుంది. డైరెక్టర్ సాయి రాజేష్ హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో మనల్ని నవ్వించాడు. కలర్ ఫోటో లాంటి సినిమాకు కథ రాసి జనాల గుండెలను తాకాడు. కానీ బేబీ లాంటి సినిమా తీసి విజయమైతే సాధించాడు కానీ, ఒక దర్శకుడిగా తన స్థాయిని బాగా తగ్గించుకున్నాడు. ఇందులో కథ గురించి చెప్పడానికి ఏమి లేదు ట్రైలర్ లో చూపించిందే.
ఒక స్కూల్ అమ్మాయి ( వైష్ణవి చైతన్య ) అబ్బాయిని (ఆనంద్ దేవరకొండ ) ప్రేమిస్తుంది. అబ్బాయి టెన్త్ ఫెయిల్ అయ్యి ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. వైష్ణవి మట్టుకు ఇంజనీరింగ్ కాలేజీ దాకా వెళుతుంది. అక్కడ ఉండే కొత్త పోకడలకు పూర్తిగా ఆకర్షితురాలై తన ప్రవర్తన, అలవాట్లు, డ్రెస్సింగ్, ఆలోచనలు అన్ని మార్చేసుకుంటుంది. స్వతహా మొదటి నుంచి వైష్ణవికి రిచ్ లైఫ్, గిఫ్టుల మీద ఆశ ఎక్కువ ఉండటం వలన తప్పు దారి పడుతుంది. అక్కడ కలిగే కొత్త పరిచయాలు, అట్లాగే విరాజ్ కొత్తగా తన జీవితంలోకి రావడం, అతనితో స్నేహాన్ని మించిన బంధం.
ఒకేసారి ఆనంద్, విరాజ్ ఇద్దరితో ఆడుకోవడం, చెడు స్నేహాలు, ఇలా ఒక్కో పరిస్థితి వలన తెలియకుండానే వైష్ణవి ఒక ఊబిలో పడిపోతుంది. ఇంకా క్లైమాక్స్ ఏంటి అని స్క్రీన్ మీద చూడాలి. ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఉంది. సినిమాలో క్యారెక్టర్ల పేర్లు కూడా వాళ్ళ పేర్లే ఉంటాయి. ఉదాహరణకు ఆనంద్, వైష్ణవి, విరాజ్, కుసుమ, సీత వంటివి. ఈ మధ్యన మన తెలుగు దర్శకుల పంథా ఎలా ఉందంటే బయట టీనేజ్ పిల్లలు, లేదా 20ల్లో ఉన్న వాళ్ళు బాతులు బాగా వాడుతారు. కాబట్టి, బయట జరిగిందే చూపిస్తున్నాం కదా అని అంటారు.
ముఖ్యంగా అమ్మాయిలను నెగటివ్ గా చూపించడం అనేది Rx 100 తో ఊపందుకుంది. 2005 లో మన్మథలో చూపించారు. ఇప్పడూ అది బ్యాక్ టూ బ్యాక్ చూపిస్తున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలకు బ్రహ్మ రథం పడుతున్నారు . అందరు అమ్మాయిలు ఇలా ఉన్నారని కాదు కానీ, బహుశ సమాజంలో అమ్మాయిల్లో వస్తున్న మార్పుని దర్శకుడు చూపించే ప్రయత్నం చేసాడని అనిపించింది. సినిమా హిట్ అయింది అంటే జనాలు దీనికి బాగా కనెక్ట్ అయ్యారు అని అర్ధం. బహుశ కొన్ని పరిస్థితులు బయట అలానే ఉన్నాయేమో అనిపించింది.
ఫ్యామిలిస్ ఈ సినిమా చూడటం అనేది చాలా దూరం. ఒక్క టీనెజర్స్, కాలేజీ స్టూడెంట్స్ తప్ప ఈ సినిమాని ఎవరు ఎంజాయ్ చేయలేరు. ఆ దశలో ఉన్న వాళ్లకు బాగా నచ్చుతుంది. ఇప్పడీ తరం అమ్మాయిలు అబ్బాయి ఈ సినిమా లో చూపించిన విరాజ్, వైష్ణవిలాగానే ఉన్నారు. అబ్బాయిలు చాలా మంది తమని ఆనంద్ దేవరకొండ క్యారక్టర్ తో తమని తాము పోల్చుకుంటారు. ఆర్ ఎక్స్ 100 లాంటి సినిమాతో దర్శకుడు ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు. దాదాపు అదే పంథాలో ఈ సినిమా కూడా సాగుతుంది.
కాకపోతే ఈ సినిమాలో వైష్ణవి పరిస్థితుల వలన చెడిందైతే, ఆర్ ఎక్స్ 100 లో హీరోయిన్ క్యారెక్టర్ పరమ వరస్ట్ గా ఉంటుంది. నటినటుల గురించి మాట్లాడుకోవాలి అంటే, ముందుగా వైష్ణవి గురించి చెప్పాలి. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ లో అందరికి తెలిసిన వైష్ణవి. బేబీలో చాలా బాగా నటించింది. ఒక స్కూల్ అమ్మాయిగా, కాలేజీ అమ్మాయిగా, చెడు దోవ పట్టిన అమ్మాయిలాగ వేరియేషన్స్ చాలా అద్భుతంగా చూపించింది. ఎక్కడ కూడా మోనోటనీ రాలేదు. ప్రతి క్యారక్టర్ లో కొత్తగా ఎక్స్ప్రెషన్ పెట్టింది. బాడీ లాంగ్వేజ్ కూడా మారింది.
మొదట చేసిన తీన్మార్ డాన్స్ నుంచి,టెన్త్ క్లాస్ అమ్మాయిగా, ఆనంద్ ప్రేయసిగా, ఆ తరువాత ఒక హై క్లాస్ అమ్మాయిగా విరాజ్ కు కలరింగ్ ఇచ్చేడప్పుడు, మందు తాగి ఆనంద్ తో మాట్లాడేటప్పుడు, బాడీ లాంగ్వేజ్ కానీ, వేరియేషన్ కానీ అద్భుతంగా చూపించింది. వైష్ణవి పాత్రని బాగా పండించింది. వైష్ణవి స్టార్ హీరోయిన్ కాకపోవచ్చు. కాని ఐశ్వర్య రాజేష్ లా మంచి నటిగా గుర్తింపు పొందుతుందని అనుకుంటున్నాను. ఆనంద్ నటనతో తన ప్రత్యేకతను చాటాడు. ప్రేయసి మోసం చేస్తే ఒక ప్రియుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆ బాధను బాగా చూపించాడు.
మనసారా ప్రేమించిన అమ్మాయి గుండెల్లో గుచ్చితే ఎలా ఉంటుందో చాలా బాగా తెలిసేలా నటించాడు. విరాజ్ ఉన్నంతలో బాగానే చేసాడు. ఇంకా మిగతా వాళ్లంతా వాళ్ళ వాళ్ళ పరిధుల్లో బాగానే నటించారు. సినిమా కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా, సాగుతుంది. ఒక్క ప్రీ క్లైమాక్స్ మాత్రమే బాగా సాగదీసినట్టు అనిపించింది. విరాజ్ క్యారక్టర్ విషయంలో మట్టుకు దర్శకుడు రాజేష్ కొంచెం కంఫ్యూజ్ చేసాడు. విరాజ్ వైష్ణవిని ప్రేమిస్తున్నాడా? కామిస్తున్నాడా ? అన్న క్లారిటీ లేకుండా చేసాడు.
కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది సినిమా రిచ్ గా కనిపించి కానీ ఎక్కడ కూడా చిన్న సినిమాలాగా అనిపించలేదు. మొదటి నుంచి ఫేమస్ అయిన ” ఓ రెండు మేఘాలిలా ” పాట మంచి ఫీల్ ఉన్న టైంలో సినిమాలో వస్తుంది. అనంత శ్రీరామ్ ఈ పాటకు లిరిక్స్ చాలా అద్భుతంగా రాసాడు. మన్మధ, ఆర్ ఎక్స్ 100, బేబీ లాంటి సినిమాలతో ఇప్పుడు హీరోయిన్లు ఎంత బ్యాడ్ అయితే అంతగా జనాలు పడి పడి చూస్తున్నారా? అన్న భావన కలిగేలా దర్శకులు మార్చేశారు. ఈ సినిమా చూడాలి అంటే 22 ఏళ్ళ వాళ్ళ లాగ ఫీల్ అయ్యి చూడాలి. అప్పుడే ఎంజాయ్ చేయగలము.
ఫ్యామిలిస్ ఇంకా లేడీస్ మట్టుకు ఈ సినిమాకు కచ్చితంగా దూరంగా ఉండొచ్చు. ఒక నెల తరువాత ఓటీటీలో ఫ్రీగా వచ్చింది కదా అని కక్కుర్తి పడి అందరి ముందర చూడొద్దు సినిమాలో చాలా చోట్ల, సీన్లు, బూతులు ఉంటాయి. ఇళ్లలో పెద్దవాళ్ళ ముందర లేదా పిల్లల ముందర పరువు పోతుంది. ఇయర్ ఫోన్స్ యే శరణ్యం, తస్మాత్ జాగ్రత్త. వన్ లైన్ రివ్యూ దీని గురించి రాయాలి అంటే ” Oh baby.. సినిమా హిట్ అయితే కొట్టావు కానీ తెలుగు సినిమా స్థాయిని ఇంకో 4 మెట్లు దిగజార్చావు, ఈ తరం అబ్బాయిలకు అమ్మాయిల మీద అనుమానాలు పెంచావు” అని బేబీ గురించి చెప్పారు.
కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు చార్ట్ బస్టర్ పాటలను అనిరుధ్ రవిచందర్ అందించారు. పవన్ కళ్యాణ్ నటించిన “అజ్ఞాతవాసి” మూవీతో తెలుగువారికి కూడా పరిచయమయ్యారు. కానీ ఆ మూవీలో పాటలతో పెద్దగా మెప్పించలేకపోయారు. ఆ తరువాత నాని నటించిన “గ్యాంగ్ లీడర్” మూవీతో ఒకే అనిపించాడు. ఇక జెర్సీ మూవీతో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకున్న అనిరుధ్, తాజాగా మూడు పెద్ద సినిమాలకు సైన్ చేశారని తెలుస్తోంది.
అనిరుధ్ ప్రస్తుతం షారుక్ ఖాన్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొనే వంటి వారు నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం మూవీ పై అంచనాల కన్నా, ఈ మూవీ కోసం అనిరుధ్ అందుకుంటున్న పారితోషికం పైనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఎందుకంటే జవాన్ మూవీకి అనిరుధ్ రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది.
భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన ఒక మూవీకి దాదాపు రూ.8 కోట్లు పారితోషికం అందుకుంటాడు. అయితే ఇప్పుడు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ఆస్కార్ విన్నర్ రెహమాన్ ను కూడా మించిపోయాడు. అనిరుధ్ రెమ్యూనరేషన్ విషయాన్ని బాక్సాఫీస్ వరల్డ్‌వైడ్ రిపోర్ట్ తెలిపింది. అనిరుధ్ జవాన్ తో పాటుగా లియో, జైలర్, ఇండియన్ 2 వంటి చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
1. బేబీ:
2. ఆర్ ఎక్స్ 100:
3. డిజే టిల్లు:
4. రారండోయ్ వేడుక చూద్దాం:
5. మన్మధ:
6. నీవెవరో:
7. వల్లభ:
8. శుభలగ్నం:
9. ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు:
10. ప్రేమించాను నిన్నే:
11. ధర్మయోగి:
12. గుండెల్లో గోదారి:
13. బస్ స్టాప్:
14. సూర్య వంశం:
రాజశేఖర్ దంపతులు మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై 2011లో మీడియా సమావేశంలో చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ సేకరించిన బ్లడ్ ని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయం పై చిరంజీవి బావ మరిది అయిన అల్లు అరవింద్ అప్పట్లోనే రాజశేఖర్, జీవిత చేసిన విమర్శలు చేసినందుకు కోర్టును ఆశ్రయించారు.
చిరంజీవి పేరిట నడుస్తున్న ట్రస్టు, సేవా కార్యక్రమాల పై తప్పుడు ఆరోపణలు చేసారని పరువు నష్టం కేసు వేశారు. ఎన్నో సంవత్సరాల విచారణ తరువాత మంగళవారం నాడు నాంపల్లి 17వ మెట్రోపాలిటిటన్ కోర్టు రాజశేఖర్, జీవితలకు సంవత్సరం జైలు శిక్ష మరియు 5 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసు పై అప్పీలుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చింది.
ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినపుడు రాజశేఖర్, జీవితలు మెగాస్టార్ చిరంజీవి పై ఎన్ని విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. అప్పుడు చిరు అభిమానులు కొందరు ఆ విమర్శలను తట్టుకోలేక వారిపై దాడి చేయడం జరిగింది. తన ఫ్యాన్స్ దాడి చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వారి ఇంటికి వెళ్లి, క్షమించమని కోరిన విషయం కూడా తెలిసిందే.
బేబీ కల్ట్ బ్లాక్‌బస్టర్ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, నాగబాబు, నిర్మాత రవి శంకర్ లు హాజరు అయ్యి, మూవీలో నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యల నటన పై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ ఈవెంట్ లో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ బేబీ మూవీ విషయంలో ఒక హీరో తనను అవమానించిన సంగతిని బయటపెట్టారు.
ఆయన మాట్లాడుతూ, బేబీ మూవీ కథను ఒక హీరోకు చెప్పాలనుకుంటే ఆ దర్శకుడు అయితే స్టోరీ కూడా వినని ఆ హీరో అవమానించాడని, అలాంటి సమయంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తనను నమ్మి మంచి మూవీకి డైరెక్టర్ ను చేశారు. ఎస్.కె.ఎన్ తనను నమ్మి ఇంత ఖర్చు పెట్టాడు. దర్శకుడు మారుతిగారు మా కన్న ఎక్కువగా మూవీ పై నమ్మకం ఉంచారని చెప్పారు.
ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి చిత్రాలే తెరకెక్కిస్తానని మాటిస్తున్నానని వెల్లడించారు. అయితే కథ వినకుండానే బేబీ మూవీని మిస్ చేసుకున్నహీరో ఎవరని నెటిజెనలు సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ హీరో ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ హీరో ఎవరనే విషయాన్ని సాయి రాజేష్ లేదా ఆ హీరో కానీ రివీల్ చేస్తారేమో చూడాలి.
సంప్రదాయ ప్రకారంగా నలుపు రంగును కీడును శంకించే రంగుగా భావిస్తారు. నల్లని రంగు శని దేవుడికి ప్రీతికరమైన రంగు, కాబట్టి నల్లటి బట్టలు వేసుకోకూదని కొందరు చెబుతారు. సైన్స్ ప్రకారం చూసినట్లయితే నలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. అందువల్ల ఎండలో వెళ్ళినపుడు నలుపు రంగు దుస్తులు వేసుకుని వెళ్లీనట్లయితే అవి వేడిని ఎక్కువ గ్రహించడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దాంతో శరీరంలో నీటి శాతం తక్కువ అయ్యి డీహైడ్రేషన్ కు గురి అవుతారు. అందుకే ఎండకాలంలో బయటికి వెళ్ళేప్పుడు నల్లటి బట్టలను వేసుకోవద్దు అని అంటారు.
సద్గురు నలుపు రంగు బట్టలు ఎందుకు ధరించకూడదనే విషయం గురించి ఈ విధంగా వివరించారు. ‘నలుపు ప్రతి దాన్ని గ్రహిస్తుంది. మీ చుట్టూ ఉన్న దానిని గ్రహించాలి అనుకునేటువంటి ప్రదేశంలో మీరు ఉన్నప్పుడు నల్లని రంగు బట్టలను ధరించాలి. అయితే మీ చుట్టూ ఏదైతే ఉందో దానిని మీరు గ్రహించవద్దు అనుకునేటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు నల్ల దుస్తులు వేసుకున్నట్లు అయితే మీరు అక్కడ ఉన్న రకరకాల విషయాలను గ్రహించడం మొదలు పెడతారు.
ప్రజలు ఇబ్బంది పడుతున్న మానసిక ఘర్షణలు దాదాపుగా ఇరవై, ఇరవై ఐదు శాతం ఎందుకు జరుగుతున్నాయి అంటే చాలా ఎక్కువ సమయాలు అన్నీ రకాల పరిస్థితుల్లో నల్ల దుస్తుల్లో ఉండిపోవడం వల్ల, అలాంటి చోట్ల అలా ఉండకూడదు’ అని సద్గురు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియోను చూడండి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో ఒక నిరుపేద ఫ్యామిలిలో కానన్ దేవి 1916 ఏప్రిల్ 22న జన్మించింది. రతన్ చంద్రదాస్, రాజోబాలదాస్ కానన్ తల్లిదండ్రులు. కానన్‌కు సంగీతంలో శిక్షణ ఇచ్చే తండ్రి, కొద్దికాలనికే మరణించడంతో ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడాయి. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి ఓనర్ ఇంట్లో నుంచి వారి కుటుంబాన్ని వెళ్లగొట్టాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో తల్లీకూతుళ్లు డబ్బున్న వారింటిలో పని మనుషులుగా చేరారు. ఉండడానికి ఇల్లు లేని వారికి ఒక బంధువు ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు.
కానీ అంతలోనే అతడు తన నిజస్వరూపం చూపించాడు. ఏడేళ్లు కూడా నిండని కానన్ మరియు ఆమె తల్లితో చాకిరీ చేయించుకోవడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది భరించలేకపోయిన కానన్ తల్లితో పాటుగా ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆ స్థితిలో కోల్‌కతాను విడిచి తిరిగి హౌరాకు వెళ్ళి, వేశ్యాగృహాలకు దగ్గరలో ఒక గది తీసుకుని ఉన్నారు. ఆ సమయంలో కానన్ ను చూసిన వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె సినీ రంగంలో రాణించగలదని గ్రహించాడు. అలా కానన్ 10 సంవత్సరాల వయసులో ‘జైదేవ్’ అనే మూవీలో ఛాన్స్ వచ్చింది.
ఆ మూవీ కోసం కానన్ తీసుకున్న నెల జీతం ఐదు రూపాయలు. ఆ తరువాత అవకాశాలు రావడంతో 1928-31 మధ్య బాలనటిగా అనేక సినిమాలు చేసింది. అదే టైమ్ లో సింగర్ గానూ సత్తా చాటింది. శంకరాచార్య, జోరేబరత్, విష్ణుమాయ, రిషిర ప్రేమ్, ప్రహ్లాద్ సినిమాలలో తన నటనతో ఆడియెన్స్ అలరించింది. విష్ణుమాయ, ప్రహ్లాద్ చిత్రాలలో బాలనటుడిగా చేసింది. ఇక 21 సంవత్సరాలకే హీరోయిన్గా నటించిన కానన్ దేవి నటనకు, అందానికి, ఫిదా అవనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
తక్కువకాలంలోనే ఆమె సూపర్‌స్టార్‌గా మారింది. పాట పాడినందుకు లక్ష, హీరోయిన్గా ఐదు లక్షలు రెమ్యూనరేషన్ అందుకునేది. ఆమె 40 పాటలు పాడగా, సుమారు 57 చిత్రాలలో నటించింది. హీరోలకు మాత్రమే సలాం కొట్టే రోజుల్లో కానన్ ను అందరు మేడమ్ అని పిలిచేవారు. మేడమ్ అనిపించుకున్న తొలి హీరోయిన్ కానన్ దేవి. ఆమె కేఎల్ సెఘల్, ప్రథమేశ్ బరువా, పంకజ్ మాలిక్, పహరి సాన్యల్, అశోక్ కుమార్, చబీ బిస్వాస్ వంటి అగ్ర హీరోలతో నటించి, వారికి తీసిపోని విధంగా కోటీశ్వరురాలిగా ఎదిగింది.
1940 డిసెంబర్లో కానన్ బ్రహ్మ సమాజ మెంబర్ అయిన హిరంబ చంద్ర మిత్ర తనయుడు అశోక్ మిత్రాను వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన 5 ఏళ్లకే భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత బెంగాల్ గవర్నర్ వద్ద ఏడీసీగా వర్క్ చేసిన హరిదాస్ భట్టాచార్జిని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత హరిదాస్ డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో అందరూ హరిదాస్ ని కానన్ భర్తగా మాత్రమే చూశారు. ఇది భరించలేకపోయిన హరిదాస్ 1987లో ఏప్రిల్ 4న కానన్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. విడాకులు తీసుకోకుండానే ఇద్దరు విడివిడిగా జీవించారు.
76 ఏళ్ల వయసులో కానన్ దేవి అనారోగ్యంతో 1992లో జూలై 17న మరణించింది. హరిదాస్ కానన్ దేవిని ఆఖరిసారి చూడడానికి కూడా రాలేదు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కానన్ చివరికి ఒక అనాధగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. సినీ ఇండస్ట్రీకి కానన్ దేవి చేసిన సేవలకు గానూ 2011లో తపాలా శాఖ ఆమె పేరిట ఒక స్టాంపును రిలీజ్ చేసింది.