పెళ్లి అయిన తరువాత భార్య ఖాళీగా ఇంట్లో ఉండకూడదని, భర్త సంపాదన అనేది మెయింటెనెన్స్ మాత్రమే అని హైకోర్టు ఒక కేసు విషయంలో వెల్లడించింది. వివాహానికి ముందు జాబ్ చేసిన భార్య వివాహం అయిన తరువాత ఖాళీగా ఉండకూడదని, ఉద్యోగం చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
భార్య ఖాళీగా ఇంట్లో కూర్చుని భర్త నుండి పూర్తి మెయింటెనెన్స్ కోసం డబ్బులు అడగకూడదని ఇటీవల హైకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లాకు చెందిన ఒక మహిళ భర్త నుండి డైవర్స్ తీసుకుంది. అయితే తనకు వస్తున్న భరణంలో కోత పెట్టారని ఆ మహిళా పిటిషన్ వేసింది. ఇటీవల ఈ పిటిషన్ ను కర్ణాటక న్యాయమూర్తి అయిన రాజేంద్ర విచారించారు. ఈ క్రమంలో తీర్పు చెబుతూ, గతంలో జాబ్ చేసిన భార్యలు ఖాళీగా ఇంట్లో ఉండకూడదని, భర్త ఇచ్చే భరణం పైనే పూర్తిగా ఆధారపడకుండా ఆ మహిళ ఏదైనా జాబ్ చేసుకుంటూ బతకాలని కర్ణాటక హైకోర్టు సూచించింది.
సదరు మహిళ పిటిషన్ ను విచారించిన జడ్జి, మాజీ భర్త ఎందుకు తనకు అదనంగా భరణం ఇవ్వాలని అడిగిన ప్రశ్నకు ఆ మహిళ సరైన సమాధానం చెప్పలేదు. భరణం అందుకోవడానికి ఆమె ఉన్న అవసరాలు ఏమిటో చెప్పాలని అడిగింది. వివాహనికి ముందు జాబ్ చేసావు మరి పెళ్లి అయిన తరువాత ఎందుకు జాబ్ చేయలేక పోయావని కోర్టు ప్రశ్నించింది.
కానీ సదరు మహిళ ఏం సమాధానం చెప్పలేకపోయింది. పెళ్ళికి ముందు జాబ్ చేసిన మహిళ వివాహం తర్వాత జాబ్ మానేసి పూర్తిగా భర్త సంపాదన పైనే ఆధారపడింది. భార్య లీగల్ గా బ్రతుకు దెరువు కోసం ఏదైనా ఉద్యోగం చేయాలని, భర్త నుండి కేవలం సపోర్టివ్ మెయింటెనెన్స్ తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది.
Also Read: భర్తతో విడాకులు… యజమానితో ప్రేమ పెళ్లి..! ఈ యువత గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

హైపర్ ఆది మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీషోలో ఎంట్రీ ఇవ్వడంతో ప్రోమోలో తనదైన పంచులతో నవ్వించాడు. హైపర్ ఆది ఈ ఎపిసోడ్ లో పెళ్లి చూపుల థీమ్ తీసుకున్నాడు. పెళ్లి చూపులకి ఆర్టిస్టులంతా కలిసి తన కుటుంబంలా వచ్చారని అనడంతో మొదలైన ప్రోమో ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది. ‘ఊ అంటావా మావ’ సింగర్ ఇంద్రావతి చౌహన్ పాడిన ఫోక్ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది.
ఆది రెయిన్ డ్యాన్స్ చేశాడు. జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుతో కలిసి ‘వాన వల్లప్ప వల్లప్ప’ పాటకి స్టెప్పులు వేశాడు. అయితే ప్రోమో చివర్లో ఆది సౌమ్య రావు కోసం ఒక గిఫ్ట్ తెచ్చానని చెప్పి, గిఫ్ట్ ఇస్తాడు. సౌమ్య గిఫ్ట్ కవర్ తెరచిన వెంటనే చాలా ఎమోషనల్ అయింది. సౌమ్య రావ్ తన తల్లితో ఉన్న ఫోటోను ఆది ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు. అప్పుడు ఆమె తల్లి ఫోటోలను ప్లే చేయడంతో వాటిని చూసిన సౌమ్య తన తల్లి గురించి చెప్తు బోరున ఏడ్చేసింది.
అమ్మకి విపరీతమైన తలనొప్పి వచ్చిందని, హాస్పిటల్‌కి తీసుకెళ్లడంతో డాక్టర్లు బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. అమ్మ తనెవరో తెలియనంతగా గతాన్ని మర్చిపోయిందని చెప్పింది. మూడున్నర ఏళ్లు అమ్మని బెడ్ మీదనే చూసుకున్నానని, దేవుడు అమ్మకి అలాంటి స్థితి ఇస్తాడని అనుకోలేదని, తన తల్లి మళ్లీ తన కడుపున జన్మించాలని అంటూ సౌమ్య కన్నీరు పెట్టుకోవడంతో ఇంద్రజ ఆమెను ఓదార్చారు.

రివ్యూ:
భీమ్ రావు క్యారెక్టర్ లో జగపతిబాబును తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేనంత అద్భుతంగా నటించారు. భీమ్ రావు క్యారెక్టర్ కి ప్రాణం పోశారు. మల్లేష్ గా ఆశిష్ గాంధీ మెప్పించారు. జ్వాలాబాయ్ పాత్రలో మమతా మోహన్‌దాస్ యాక్టింగ్ బాగుంది. ఆమె నటించిన సన్నివేశాలలో మమతా మోహన్‌దాస్ డామినేషనే కనిపిస్తుంది.
భీమ్ రావు పెద్ద భార్య మీరాబాయ్ క్యారెక్టర్ లో విమలా రామన్ ఆకట్టుకుంటుంది. టైటిల్ పాత్రలో నటించిన గనవి లక్ష్మణ్ ఈ మూవీకి పెద్ద అసెట్ గా నిలిచింది. కనిపించేది కాసేపే అయినా ఇంపాక్ట్ ని చూపించింది. కరుణం పాత్రలో ఆర్ ఎస్ నందా నవ్వులు పూయించాడు. మిగిలినవారు తమ పాత్రలు మేరకు నటించారు.
టెక్నికల్ విషయానికి వస్తే నాఫల్ రాజా అందించిన పాటలు అంతగా రిజిస్టర్ కావు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫి ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు కథకి తగినట్టుగా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇంద్ర’. ఈ మూవీని అశ్వినీదత్ ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై నిర్మించారు. చిరంజీవి నటించిన మృగరాజు, డాడీ, శ్రీమంజునాథ లాంటి సినిమాలు ప్లాప్ అవడంతో ‘ఇంద్ర’ మూవీ పై అంతగా అంచనాలు ఏర్పడలేదు.
ఈ మూవీ 2002 జూలై 24న రిలీజ్ అయ్యింది. మొదటి షోతొనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు సృష్టించింది. 122 సెంటర్స్ లో 100 రోజులు, 32 సెంటర్స్ లో 175 రోజులు రన్ అయ్యి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రంలో ఒక సీన్ లో చిరంజీవి తన మేనకోడలు సీమంతానికి పిలవడం కోసం ఆర్తి అగర్వాల్ ఇంటికి వచ్చినపుడు ఆర్తి అగర్వాల్ కొన్ని డైలాగ్స్ చెబుతుంది.
అయితే డబ్బింగ్ చెప్పక ముందు ఆ సీన్ లో ఆర్తి అగర్వాల్ ఎలా డైలాగ్స్ చెప్పిందో తెలిపే ఒక వీడియోని ఎంటర్టైన్మెంట్ మాషప్ అనే ఇన్ స్టా పేజ్ లో షేర్ చేశారు. ఆ సీన్ లో ఆర్తి అగర్వాల్ తనకు తెలుగు డైలాగ్స్ సరిగ్గా చెప్పలేకపోతుంది. ‘నవ్వు ఆపుకుని డైలాగ్స్ ఎలా చెప్పావ్ చిరు’ అని ఆ వీడియో కి క్యాప్షన్ ఇచ్చారు. దానిపై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
టమాట ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ప్రస్తుతం కిలో టమాట ధర 100 రూపాయలకు పైన ఉంది. దీంతో సామాన్యులు అంత రేటు పెట్టి టమాటా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం కిలో టమాటా 20 – 40 రూపాయల వరకు ఉన్నాయి. హఠాత్తుగా ధరలు పెరిగిపోవడంతో ఆందోళన పడుతున్నారు. మరో వైపు టమాటా ధరలు పెరగడంతో వాటిని దొంగతనం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం టమాటాకు డిమాండ్ ఉండడంతో దొంగలు దానిని క్యాష్ చేసుకుంటున్నారు. వీలైతే కూరగాయల షాపుల్లో, టమోటా పంటలను లూటీ చేస్తున్నారు.
కర్నాటకలకు చెందిన ధరణి అనే రైతు టమోటా పంట వేశాడు. ఈసారి ఎప్పటికంటే పంట బాగా పండింది. వారంలో మార్కెట్‌కు తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ ఆలోపు దొంగలు పంటనంతా దోచుకెళ్లారు. దాని విలువ రూ. 1.50 లక్షలు. ఇంతలా టమాటా ధరలు పెరగడానికి కారణాలు ఏంటంటే, ఉష్ణోగ్రతలలు పెరగడం, రుతుపవనాలు ఆలస్యం కావడంతో టమాటా దిగుబడులు తగ్గాయి. దాంతో టమాట ధరలు పెరిగాయని నిపుణులు అంటున్నారు.
దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల టమాటా పంటలు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెరిగిన వేడి వల్ల పంట దిగుబడి తగ్గింది. అందువల్ల టమాటాల సరఫరా తగ్గిపోయింది. నష్టాల వల్ల కొందరు రైతులు టమాటా సాగును తగ్గించారు. ఉత్తర ప్రదేశ్, హర్యాణారాష్ట్రాల నుంచి వచ్చే టమాటా సరఫరా చాలా తగ్గిపోయింది. అందువల్ల హోల్‌సేల్ మార్కెట్లలో టమాటా రేట్లు పెరిగాయని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్, ఆడియెన్స్ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ఆదిపురుష్ మూవీని రూపొందించారు. ఈ మూవీ దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఈ మూవీలోని డైలాగ్స్ పై వినమర్శలు వచ్చాయి. ఆ తరువాత పాత్రల ఆహార్యం పైన ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమాకి మొదటి 3 రోజులు మంచి వసూళ్లు వచ్చాయి. సోమవారం నుండి పడిపోయాయి. ఈ మూవీ డైరెక్టర్ ఓం రౌత్, రచయిత పై హిందూ సంఘాలు కూడా విమర్శిస్తున్నారు. ప్రేక్షకుల నుండి ప్రముఖుల వరకు అందరు విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.
ఈ మూవీలోని లంక సెట్, సీన్స్ హాలీవుడ్ సినిమాల నుండి కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆదిపురుష్ వీడియో క్లిపింగ్ కు దెయ్యాల కోట అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ వాయిస్ ఓవర్ తో ఎడిట్ చేసి షేర్ చేశారు. ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
సాధారణంగా బోయపాటి చిత్రాలలో లాజిక్‌లు అస్సలు చూడకూడదని టాక్. దానికి కారణం ఆయన తీసే సినిమాలలో ఒకదానిలో హీరో దేవుడు అవడం, తల గాల్లోకి ఎగరడం, ఆ తలను గద్ద ఎత్తుకెళ్ళి పోవడం లాంటివి కనిపిస్తాయి. రీసెంట్ గా ‘స్కంద’ మూవీ గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో రామ్ మాస్ లుక్ లో కనిపించారు. ఆయన చెప్పిన డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ డైలాగ్ రామ్ ఫైట్ చేసే క్రమంలో చెప్తాడు. ఆ ఫైట్ ను కోనేరులో తీశారు. అంటే వాటర్ లో జరిగిన ఈ ఫైట్ లో బోయపాటి మార్క్ అయిన రక్తపాతం చాలా ఎక్కువగా జరిగింది. అయితే రక్తం అంటే ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ఈ వీడియోలో మాత్రం రక్తం ఆరెంజ్ కలర్ లో కనిపించింది.
దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు బోయపాటి పై కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. అసలు ఆరెంజ్ కలర్ రక్తం ఎందుకు వచ్చింది. రక్తంతో వాటర్ కలసినా కూడా అవి ఆరెంజ్ కలర్ లోకి మారవు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై బోయపాటి ఎలా స్పందిస్తారో చూడాలి.
ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మహిళల స్టోరీనే ఈ వెబ్ సిరీస్. కుటుంబంలోని ఆడవాళ్ళకి ఏం కావాలో తెలియని సగటు మనిషి రాజరత్నం. అతను ఇంట్లోని వారు క్షేమంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అతని తల్లి సుందరి (లక్ష్మి), భార్య కావేరి (మధు), కుమార్తె నివి (శాంతి) సంతోషంగా ఉన్నారని భావిస్తాడు. తల్లిని ఇంట్లోనే ఉంచి చిన్న పిల్లలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఆమెకు ఎక్కడికైనా వెళ్లి గడపాలని కోరుకుంటుంది.
కుమార్తె క్రికెటర్ గా తన కెరీర్ ను, తనను గౌరవించే వ్యక్తి కోసం వెతుకుతుంటుంది. ఇక గృహిణి అయిన కావేరికి ఇళ్లే ప్రపంచం. కానీ భర్త, కొడుకు సరి అయిన గౌరవం ఇవ్వకపోవడం వల్ల విసిగిపోతుంది. అలా ఈ మహిళలు ముగ్గురు ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతారు. వారు తమ జర్నీని ఎలా కొనసాగించారు? ఆ ప్రయాణంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ తరువాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.
ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. నిజ జీవితంలో ప్రతిరోజూ తమ ఫ్యామిలీ కోసం త్యాగం చేసే ప్రతి మహిళ జీవితం గురించి ఈ సిరీస్ లో ప్రస్తావించారు. ముగ్గురు మహిళల పాత్రలను చక్కగా రాసుకున్నారు. వారి పాత్రలలో మనల్ని మనం ఊహించుకునేలా ఉన్నాయి. లక్ష్మి, మధుబాల ఇద్దరూ తమ పాత్రలలో జీవించారు. 7వ ఎపిసోడ్లో లక్ష్మి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. శాంతి చక్కగా నటించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.
ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సినిమా సలార్. ఈ చిత్రానికి కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్స్ గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని దర్శకుడు టీజర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ఈ టీజర్ లో ప్రభాస్ పూర్తి లుక్ ను చూపించలేదు. కానీ ఈ టీజర్ లో ప్రభాస్ గురించి ఎలివేషన్స్ ఇచ్చిన యాక్టర్ హైలెట్ గా నిలిచాడు.
అతను ఎవరో కాదు యాక్టర్ టీనూ ఆనంద్. అతనికి ప్రభాస్ తో ఇది రెండవ మూవీ. ప్రభాస్ ‘సాహో’ మూవీలో ఇతడు నటించాడు. అతను పలు తెలుగు సినిమాలలో నటించాడు. అయితే టీనూ ఆనంద్ తెలుగులో నటించిన మొదటి సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అంజి’ సినిమా లో విలన్ గా నటించాడు. అతను భాటియా అనే క్యారెక్టర్ లో సరికొత్త విలనిజం పండించాడు.
అంతేకాకుండా గతేడాది రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించిన ‘సీతారామం’ మూవీలో కూడా నటించాడు. మూవీ మొదట్లో వచ్చే ఆనంద్ మెహతా అనే క్యారెక్టర్ లో కనిపించాడు. ఆయన కుటుంబంలోని వారంతా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టీనూ ఆనంద్ మేనల్లుడు అయిన సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. టీనూ ఆనంద్ లో యాక్టర్ మాత్రమే కాదు. రైటర్, దర్శకుడు, నిర్మాతగా పని చేశాడు.
ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన జ్యోతి మౌర్యకు సంబంధించిన రకరకాల పోస్ట్‌లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పిసిఎస్ అధికారి అయిన జ్యోతి మౌర్య ఉద్యోగం వచ్చిన తర్వాత తన భార్య నమ్మకద్రోహం చేసిందని ఆమె భర్త అలోక్ మౌర్య చేశారు. అంతేకాకుండా తన భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. ఆమె పిసిఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో తన సహాయాన్ని ఉపయోగించుకుందని అలోక్ ఆరోపించారు.
తాజాగా అలోక్ మౌర్య, జ్యోతి మౌర్యల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ కార్డులో అలోక్ పారిశుధ్య కార్మికుడు అని కాకుండా గ్రామ పంచాయతీ అధికారి అని ఉంది. వైరల్ వెడ్డింగ్ కార్డ్ గురించి చెప్పడానికి జ్యోతి మౌర్య తండ్రి పరాస్ నాథ్ మౌర్య ముందుకు వచ్చారు. పెళ్లి సమయంలో అలోక్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన విషయాన్ని చెప్పలేదని జ్యోతి తండ్రి అన్నారు. దానికి బదులుగా అలోక్ గ్రామ పంచాయతీ అధికారినని చెప్పాడని అన్నారు.
అలోక్ మౌర్య ఇప్పుడు తాను పారిశుద్ధ్య కార్మికుడిని అని అరుస్తున్నాడని, కానీ పెళ్లికి ముందు, అలోక్ మరియు అతని కుటుంబం అబద్ధాలు చెప్పారని ఆయన వెల్లడించారు. తప్పుడు సమాచారం వల్లనే పెళ్లి జరిగిందనీ, అలాంటి పెళ్లి వల్ల ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అని అన్నారు. జ్యోతి మౌర్య తండ్రి ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని చిరాయిగావ్లో నివసిస్తున్నారు.