దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16న విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటించగా, కృతిసనన్ సీతాదేవిగా నటించింది. ఈ మూవీకి ఒక వైపు భారీ కలెక్షన్స్ వస్తున్నా, మరో వైపు వివాదాలు, విమర్శలు వస్తున్నాయి.
ఆదిపురుష్ మూవీ పై నిత్యం ఏదో ఒక కొత్త వివాదం తెర పైకి వస్తూనే ఉంది. అంతేకాకుండా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ చేసే కామెంట్స్ కూడా వివాదాలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు ఓం రౌత్ తాజాగా రామాయణం నేపథ్యంతో తెరకెక్కబోయే మరో చిత్రం గురించి కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
దంగల్, చిచోరే వంటి బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు నితేశ్ తివారి రామాయణం తెరకెక్కిస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సీతగా అలియా భట్ నటిస్తున్నారని ప్రకటించారు. మిగతా పాత్రల కోసం దక్షిణాది నటినటులను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్ ని నితీశ్ తివారి తెరకెక్కించే రామాయణం గురించి అడిగారు. ఓం రౌత్ ఇలా చెప్పుకొచ్చాడు. నితేశ్ తివారి గ్రేట్ డైరెక్టర్. తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. నితీశ్ తివారి తీసిన దంగల్ మూవీ భారతీయ అత్యుత్తమ సినిమాలలో ఒకటి అన్నారు.
నితేశ్ తివారి రచనలు, డైరెక్షన్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. నితేశ్ తీయబోయే రామాయణం పై రామ భక్తుల అందరిలాగే తాను కూడా ఆ మూవీ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. శ్రీ రాముడి గురించి ఎవరైనా, ఎన్ని చిత్రాలయినా రూపొందించవచ్చు. శ్రీ రాముడి గాధను ఎంత ఎక్కువ మంది చెప్తే అంత మంచిదని అన్నారు.
Also Read: మహేష్ బాబు “యువరాజు” సినిమాతో పాటు… “రాకేష్ మాస్టర్” కొరియోగ్రఫీ చేసిన 10 సూపర్ హిట్ పాటలు..!



ఆదిపురుష్ సినిమాను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ పీఎం మోదీకి లేఖ రాశారు. అందులో ఈ సినిమా ప్రదర్శనను థియేటర్లు మరియు ఓటీటీలో బ్యాన్ చేసేట్టు ఆదేశించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ మోదీని అభ్యర్థించింది. ఆదిపురుష్ మూవీ దర్శకుడు ఓం రౌత్, రైటర్ మనోజ్ శుక్లా పై వెంటనే పై కేసు నమోదు చేయాలని కోరింది.
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాముడు, హనుమంతుడి గౌరవాన్ని పోగొట్టేలా ఉన్నాయని పేర్కొంది. శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, రావణుడి క్యారెక్టర్లను మలిచిన విధానం బాగాలేదని పేర్కొన్నారు. భారతీయ ఇతిహాసమైన రామాయణం పేరుని చెడగొట్టేలా ఆదిపురుష్ ఉందని, మూవీలోని డైలాగ్‌లు హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అన్నారు.
భారతదేశంలో శ్రీరాముడిని దేవుడిలా ఆరాధిస్తారని, కానీ ఆదిపురుష్ మూవీలో రాముడిని, రావణాసురుడిని వీడియో గేమ్స్‌లోని క్యారెక్టర్లలా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇలాంటి మూవీలో హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, సైఫ్ అలీఖాన్ లు భాగస్వామ్యం అవడం సిగ్గుచేటని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖలో పేర్కొన్నారు.
ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి అందరికి తెలిసందే. జ్యోతిష్య వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయి. వేణుస్వామి ఇటీవల ఆదిపురుష్ సినిమా గురించి చెప్పారు. ఆదిపురుష్ సినిమా పై వస్తున్న ట్రోల్స్, విమర్శల నేపథ్యంలో వేణుస్వామి చెప్పిందే జరుగుతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ మూవీకి ఇప్పటివరకు హిట్ టాక్ రాలేదు. రివ్యూలు కూడా ఆదిపురుష్ హిట్ అని, ఫ్లాప్ అని చెప్పలేకపోయాయి.
వేణుస్వామి ‘ఆదిపురుష్’ రిలీజ్ కు ముందే అందరు అనుకున్నట్లుగా ఈ సినిమా హిట్ కాదని, యావరేజ్ గా నిలుస్తుందని జోస్యం చెప్పారు. బాహుబలి అంత ఊహించుకోవాల్సిన పని లేదన్నారు. రామాయణం ఆధారంగా వస్తున్న సినిమా అయినా ఆదిపురుష్ మాత్రం అంతగా హిట్ కాదని అన్నారు. హీరో ప్రభాస్ జాతకాన్ని బట్టి ఫలితం ఉందన్నారు.
విజువల్ వండర్ గా రూపొందించడంలో ఆదిపురుష్ మూవీ యూనిట్ సక్సెస్ అవలేదని, ప్రభాస్ ఇచ్చిన ఛాన్స్ ని డైరెక్టర్ ఓంరౌత్ సరిగా వినియోగించుకోలేదని, రామాయాణం స్టోరి విషయంలో సినిమాటిక్ ఫ్రీడంను ఎక్కువగా తీసుకున్నాడని అంటున్నారు. అందువల్లనే ఆడియెన్స్ పూర్తిగా ఈ మూవీ ఆమోదించడంలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక వేణుస్వామి చెప్పినట్టుగానే ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ కు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం తమన్ ను ఈ మూవీ నుండి తప్పించారని ప్రచారం జరిగింది. ఆ తరువాత రిలీజ్ అయిన గ్లింప్స్ తో అవన్నీ రూమర్స్ అని తేలింది. అయితే, తాజాగా తమన్ ను గుంటూరు కారం నుంచి తొలగించారనే ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుండి పూజా హెగ్డే తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్ ను తొలగించినట్లుగా వస్తున్న వార్తలలో వాస్తవం లేదని తెలుస్తోంది. వైజే రాంబాబు అనే ఎడిటర్ ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ “మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ని తప్పిస్తున్నారు అనే మాట అవాస్తవం. ఈ నెల 24 నుంచి షూటింగ్, జనవరి 13న రిలీజ్. ఒకవేళ అదే రోజు ప్రభాస్ ప్రాజెక్ట్ K ఉంటే మాత్రం ఒక రోజు ముందుగానే రిలీజ్” అని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కి ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా రెస్పాండ్ అయ్యారు.
మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ట్వీట్ చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్ లో మజ్జిగ గ్లాస్ ఇమేజ్ ను షేర్ చేసి, “రేపటి నుండి నా స్టూడియోలో ఫ్రీగా మజ్జిగ స్టాల్స్‌ను మొదలుపెడుతున్నాను. కడుపు మంట లక్షణాలతో ఇబ్బందీపడేవారికి స్వాగతం. నా టైమ్ ని వెస్ట్ చేయకూడదని భావిస్తున్నాను” అని రాసుకొచ్చాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో తమన్ ను తొలగించారనే వార్తలు రూమర్స్ అని తేలింది. హీరోయిన్ పూజా హెగ్డే విషయం తెలియాల్సి ఉంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆడియెన్స్ మనసులను హత్తుకుంది. ఈ చిత్రంలో సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తమ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించారు. జక్కన్న 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, తెలుగు సినిమా ఖ్యాతిని వరల్డ్ వైడ్ గా చాటి చెప్పింది. ఈ సినిమాను చూసి హాలీవుడ్ సినీ సెలెబ్రెటీలు కూడా జక్కన్న దర్శక ప్రతిభకు మెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ లో కూడా పలు అవార్డులను అందుకుంది
సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన ఆస్కార్ అవార్డుని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ అందుకుంది. నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ను ఉరూతలూగించింది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ పనిచేశారు. చిన్న,పెద్ద తేడా లేకుండా అందరు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ గురించి ప్రస్తుతం ఒక విషయం వైరల్ గా మారింది.
నాటు నాటు పాటలోని పాపులర్ స్టెప్స్ ని కోలీవుడ్ స్టార్ హీరో మూవీ నుండి కాపీ చేశారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ స్టార్ హీరో ఎవరంటే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. విజయ్ 1996లో ‘కోయంబత్తూరు మాపిళ్ళై’ అనే సినిమాలో నటించారు. హీరోయిన్ గా సంఘవి నటించారు. ఇక ఆ సినిమాలో ఒక పాటలో విజయ్ చేసిన స్టెప్స్, జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన స్టెప్స్ ఒకేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
‘ఆదిపురుష్’ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మొదలైన విమర్శలు, వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ టీజర్ రిలీజ్ చేయడంతో గ్రాఫిక్స్ పైన, పాత్రల ఆహార్యం పైన ట్రోల్స్ వచ్చాయి. కానీ ట్రైలర్ రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ ఏర్పడింది. హనుమంతుడి కోసం ఒక సీట్ రిజర్వ్ చేయడంతో అందరు భక్తిభావంతో మూవీకి వెళ్లారు.
రావణాసురుడు రాక్షసుడు అయినప్పటికీ, బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు మాంసాహారాన్ని ముట్టుకోరు. కానీ ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడుగా నటించిన సైఫ్ అలీఖాన్ పక్షికి మాంసాహారాన్ని తన చేతులతో స్వయంగా తినిపిస్తాడు. రావణుడు ఇలా ఎప్పటికి చేయడు. ఇంత పెద్ద తప్పు ఎలా చేసారు అంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చాలా సంవత్సరాల నుండి సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాకేష్ మాస్టర్ కు 3పెళ్లిళ్లు జరిగినట్టు తెలుస్తోంది. మొదటి భార్య గురించి అంతగా తెలియదు. ఇక రెండవ వైఫ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో కొడుకు చరణ్ గురించి అందరికి తెలుసు. లాక్ డౌన్ సమయంలో రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ తో యూట్యూబ్ వీడియోలు చేశారు. రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అభిమానులతో జరిగిన గొడవ కారణంగా రెండో భార్య తన నుండి విడిపోయిందని అన్నారు. తన వల్ల వారికి హాని ఉందని, అందుకే చనిపోయినా కూడా రావొద్దని చెప్పిందని ఎమోషనల్ అయ్యారు.
రాకేష్ మాస్టర్ మరణం గురించి గాంధీ హాస్పటల్ సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు మధ్యాహ్నం (ఆదివారం మధ్యాహ్నం) విరోచనాలు, వాంతులు అవుతున్నాయని రాకేశ్ మాస్టర్‌ను హాస్పటల్ కి తీసుకొచ్చారు. కానీ అప్పటికే రాకేష్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్, డయాబెటిస్ కావడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన గంటకే మాస్టర్ ఆరోగ్యం ఇంకా విషమించింది. రాకేష్ మాస్టర్ ను బతికించేందుకు ప్రయత్నాలు చేసినా, విఫలమవడంతో 5 గంటలకు చనిపోయారని’ అని వెల్లడించారు.
కొంచెం విజ్ఞత, రామాయణం పైన అవగాహన ఉన్న వారందరి నుండి ఆదిపురుష్ మూవీ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డైలాగ్స్ ఈ సినిమాని భ్రష్టు పట్టించాయని అంటున్నారు. క్యారెక్టర్ల లక్షణాలు, సందర్భాల ఔచిత్యం గురించి పట్టించుకోకుండా, ఇష్టం వచ్చినట్టుగా యాక్షన్ చిత్రాలకు రాసినట్టు డైలాగ్స్ రాశారు అని విమర్శిస్తున్నారు. దాంతో మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ను మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అయితే మూడు గంటల చిత్రంలో 3 నిమిషాలు ప్రజల ఊహకు భిన్నంగా రాయడంతో తనను సనాతన ద్రోహిగా చూస్తున్నారని మనోజ్ ముంతాషిర్ శుక్లా అన్నారు. నెటిజెన్లు ఈ మాటలు రచయిత మనోజ్ అహంకారాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు. డైలాగ్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా తప్పులు ఉన్నాయి కదా? మనం ఇంత చెప్తే వీళ్ళకి మాత్రం కేవలం డైలాగ్స్ విషయం మాత్రమే అర్థం అయ్యిందా? అంటున్నారు. ఊహలకు భిన్నంగా కాదు, రామాయణంలోని మౌలిక స్ఫూర్తికి భిన్నంగా, కించపరిచేలా డైలాగ్స్ రాసినందుకు బాధ కలుగుతుందని అంటున్నారు.